Liger Movie: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హీరో విజయ్ తాజాగా నటించిన సినిమా "లైగర్" నుంచి రెండో పాట విడుదల అయింది. "వాట్ లగా.." అంటూ సాగే ఈ పాట.. విజయ్ మాస్ డైలాగ్స్ తో అకట్టుకుంటోంది. "వి ఆర్ ఇండియన్స్. మేము ఎవరికీ తీసిపోం. సోదరి నాతో రా.. మనం వెళ్దాం.. పోరాటం చేద్దాం.." అంటూ పాట ప్రారంభంలో విజయ్ ఆగ్రహంతో చెప్పే డైలాగ్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒకటిన్నర నిమిషం పాటు సాగిన ఈ వీడియో సాంగ్ లో విజయ్.. తన ప్రత్యర్థిపై పోరాటం చేస్తున్న దృస్యాలు చూపించారు.
విజయ్ తొలి పాన్ ఇండియా చిత్రం.. లైగర్!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. మదర్ సెంటిమెంట్, కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విజయ్ కు తల్లిగా అలనాటి నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. అనన్య పాండే ఈ సినిమాలో కథానాయికగా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్నా ప్రొడక్షన్స్ పతాకంపై ఛార్మి, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 25 తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
చిరు, ప్రభాస్ ల చేతులమీదుగా ట్రైలర్ విడుదల..
అయితే జులై వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను గురువారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాష్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లలో విజయ్ దేవరకొండ చేసిన స్టంట్స్, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ తో బాక్సింగ్ సన్నివేశాలు, అనన్యతో రొమాన్స్.. ఇలా ప్రతి సన్నివేషం మాస్ ని మెప్పించేలా ఉంది. ఇదే నెల 11వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన తొలి సాంగ్ ని విడుదల చేశారు.
అందిరనీ మెప్పించిన అక్డీ పక్డీ పాట..
"అక్డీ పక్డీ" అంటూ వచ్చిన ఆ పాటలో విజయ్ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. రౌడీ బాయ్ స్పీడ్ డ్యాన్స్ అందరినీ కట్టిపడేసింది. బీట్ కు తగ్గట్టు ఆయన వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. అనన్య పాండే విజయ్ తో పోటీ పడి మరీ నర్తించింది. ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయమూ విజయ్ అబిమానుల్ని తెగ ఆకట్టుకుంటుంది. సినిమా చూడాలంటే ఇంకో నెల రోజులు ఆగాలా అని అభిమానులు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఇంట్రెస్టింగ్ సినిమాను చూడకుండా అన్ని రోజులు ఆగలేమంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
Also Read: కారులో, బోటులో సెక్స్ చేశా - విజయ్ దేవరకొండ
అయితే తాజాగా ముంబయి లోకర్ ట్రైన్ లో హీరో విజయ్ దేవరకొండ, నటి అనన్య పాండే సందడి చేశారు. లైగర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఈ జోడీ.. మహా నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడి వారితో తమ సినిమా గురించి ముచ్చటించింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం వీరిద్దరూ లోకల్ ట్రైన్ లో ప్రయాణించారు.
Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?