టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తన బ్యానర్ పై 'పుష్పక విమానం' అనే సినిమాను నిర్మించారు. ఇందులో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. ఈరోజే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు విజయ్ దేవరకొండ. స్పెషల్ ఇంటర్వ్యూలు, చిట్ చాట్ లు, ఫ్యాన్స్ మీట్స్ ఇలా ఒక్కటా, రెండా.. విజయ్ తన సినిమాకి ఎంత ప్రమోషన్ చేస్తాడో అంతకంటే ఎక్కువే తమ్ముడి సినిమా కోసం కష్టపడ్డాడు.
Also Read: కెప్టెన్ గా రవి.. వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో తెలుసా..?
ఇదే ఈరోజు 'పుష్పక విమానం'తో పాటు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన 'కురుప్' సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని కూడా విజయ్ కొంత ప్రమోట్ చేశారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను విజయ్ తన ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ఆ సమయంలో దుల్కర్ విజయ్ కి థాంక్స్ చెప్పారు. ఇక ఈరోజు తన సినిమాతో పాటు విడుదలైన 'పుష్పక విమానం' టీమ్ కి విషెస్ చెప్పారు దుల్కర్ సల్మాన్. ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండలను ఉద్దేశిస్తూ ట్వీట్ పెట్టడంతో ఇది వైరల్ అయింది.
ఈ ట్వీట్ చూసిన విజయ్ దేవరకొండ.. షూటింగ్ కోసం లాస్ ఏంజెల్స్ కి రావాల్సి వచ్చిందని.. తన టీమ్(పుష్పక విమానం)ని వదిలి వచ్చినందుకు కాస్త వర్రీ అయ్యానని.. కానీ తన ఆబ్సెన్స్ లో దుల్కర్ సల్మాన్ సినిమాను పుష్ చేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన దుల్కర్.. 'We got each other’s backs VD' అంటూ ట్విట్టర్ లో కామెంట్ చేశారు.
ఇద్దరు పాపులర్ యంగ్ హీరోలు ఇలా ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకుంటుండడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నెటిజన్లు కూడా దుల్కర్, విజయ్ లను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి హెల్తీ వాతావరణం ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటున్నారు.