జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కిన నూతన చిత్రం 'ప్రిన్స్'. తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్న(మంగళవారం) జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్టేజి పై మాట్లాడారు. ప్రిన్స్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉందన్నారు. సినిమా కు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహించిన సురేష్ ప్రొడక్షన్స్, సునీల్ నారాయణ్ బ్యానర్ లో తాను పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి మంచి చిత్రాలు చేశానని అన్నారు. ఈ సినిమాకు వారు ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు విజయ్. 


నాకు బోర్ కొడితే ఆయన వీడియోలు చూస్తా: విజయ దేవరకొండ


ప్రిన్స్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ అనుదీప్ పై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ అనుదీప్ మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ అని అన్నారు. ఎవడే సుబ్రమణ్యం సినిమా సమయంలో నాగ్ అశ్విన్ అనుదీప్ గురించి చెప్పేవారని అన్నారు. తనకు ముందు నుంచీ పరిచయం ఉన్న వ్యక్తిలా అనుదీప్ కనిపిస్తారని అన్నారు విజయ్. తనకు ఎప్పుడైనా బోర్ కొడితే అనుదీప్ వీడియోస్ చూస్తానని, అవి ఎంతో ఫన్నీ గా ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రిన్స్ సినిమా సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి ఒక ప్రోమో వీడియోను విడుదల చేశారని, ఆ వీడియో కూడా తనకు ఎంతో నచ్చిందని అన్నారు. 


శివకార్తికేయన్ జర్నీ నాకు చాలా ఇష్టం: ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్. సాధారణ టివి ఆర్టిస్ట్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై సూపర్ స్టార్ గా ఎదిగిన శివకార్తికేయన్ జర్నీ తనకు ఎంతో ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుందన్నారు. శివకార్తికేయన్ ను ఎప్పటినుంచో కలవాలనుందని అది ఈరోజు కుదిరిందన్నారు. ఓ సందర్భంలో శివకార్తికేయన్ స్టేజి పై కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన తనకి ఇంకా గుర్తుందని పేర్కొన్నారు. అప్పుడు మేమంతా సినిమా వాళ్లం ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ గా నిలవాలి కదా అని అనిపించిందని ఎమోషన్ అయ్యారు.


సినిమాకు సంబంధించి అన్ని విభాగాలు ఎంతో కష్టపడి పనిచేశారని, ప్రతీ ఒక్కరూ సినిమా సక్సెస్ లో  భాగామవుతారని పేర్కొన్నారు. ఇలాంటి టీమ్ తో పనిచేయాలని తనకీ ఉందని చెప్పారు. సినిమా ట్రైలర్ బాగా నచ్చింది సినిమా చూడాలని తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ప్రతీ ఒక్కరూ సినిమాను చూడాలని వ్యాఖ్యానించారు రౌడీ హీరో.  జాతిరత్నాలు తర్వాత డైరెక్టర్ అనుదీప్ బాధ్యత వహించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆశలన్నీ సినిమా పైనే పెట్టుకున్నారు. ఈ వారం గట్టి పోటీ మధ్య విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి మరి.


Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?