విశాఖపట్నంలో బావామరదళ్లు కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం అయింది. దూరపు బంధుత్వం కారణంగా వరుసకు వారు బావా మరదళ్లు అవుతారు. అయితే, వారు సీరియస్ గా ప్రేమించుకోగా, భవిష్యత్తుపై భయంతో ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. క్షణికమైన ఆవేశంలో వారు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వారి ఇంట్లోని వారికి కడుపుకోతను మిగిల్చింది.


విశాఖ నగరంలోని ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రేమికులు శ్రీకాకుళానికి చెందిన వారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం, చిన్నకొత్తపేట ప్రాంతానికి చెందిన యువకుడు కందివలస దామోదర్‌ స్థానికంగా (20) డిగ్రీ చదువుతున్నాడు. చదువుతో పాటు తండ్రికి పొలంలో వ్యవసాయ పనుల్లో సాయం చేస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నాడు.


ఆముదాలవలస, బలగం గ్రామానికి చెందిన ఆదపాక సంతోషి కుమారి అనే 17 ఏళ్ల యువతి ఇంటర్‌ సెకండ్ ఇయర్ చదువుతోంది. వీరి రెండు కుటుంబాలకు దూరపు బంధుత్వం ఉంది. ఈ మధ్యే వారు ఓ పెళ్లి వేడుకలో తొలిసారిగా కలుసుకున్నారు. ఆ పరిచయం అప్పుడే ప్రేమగా మారింది. తరచూ ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడమే కాకుండా కలుసుకునేవారు. ఈ క్రమంలోనే వీరిద్దరు విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ దరి గొల్లెలపాలెంలోని ఓ లాడ్జిలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రూం రెంట్ కి తీసుకున్నారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు గది తలుపులు తీయలేదు. దీంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి తలుపు తట్టారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. 


అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు


తొమ్మిదేళ్ల బాలికపై పలుమార్లు లైంగికదాడి చేసిన కేసులో 73 ఏళ్ల వృద్ధుడికి తాజాగా వైజాగ్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి నాలుగు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని మొబైల్ గేమ్‌లతో ఆకర్షించి తన ఇంటికి తీసుకెళ్లి అశ్లీల వీడియోలు చూడమని బలవంతం చేసి లైంగికదాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఐదు నెలల పాటు ఆమెపై లైంగికదాడి చేసి, జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు నిందితుడు. బాలిక తన తల్లితో కలిసి జీవిస్తోందని పోలీసులు తెలిపారు. లైంగికదాడి చేసిన వ్యక్తి కూడా అదే ప్రాంతంలోనే ఉన్నాడు. 


20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష 
మార్చి 23, 2022న చిన్నారి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ దారుణమైన నేరం వెలుగులోకి వచ్చింది. అమ్మాయి తన తల్లికి మొత్తం జరిగిన విషయాన్ని చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఆరిలోవ పోలీసులు నిందితుడు కోలాటి బాలయోగిపై ఐపీసీ సెక్షన్ 376, 354 (ఎ), 506, పోక్సో చట్టం-2012 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఏసీపీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ నేతృత్వంలో దిశ పోలీసులు విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ పోక్సో న్యాయమూర్తి కె.రామ శ్రీనివాస్‌ మంగళవారం తీర్పునిచ్చారని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కరణం కృష్ణ తెలిపారు. మహిళలు, బాలికల భద్రత, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నిర్ణీత గడువులోగా నిందితులను అరెస్టు చేసి ఛార్జిషీట్ దాఖలు చేయడంలో నగర పోలీసులు కృషిచేశారని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేసిన పోలీసు బృందాన్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే కృష్ణను నగర పోలీస్‌ చీఫ్‌ శ్రీకాంత్‌ అభినందించారు. 


వారు ఆ గది వద్దకు చేరుకొని గది తలుపులు పగలగొట్టి చూశారు. దీంతో ఇద్దరు బాత్‌ రూమ్‌లోని కిటికీ ఊచలకు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. యువతి మెడలో పసుపుతాడు ఉంది. దాన్ని బట్టి, వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ ప్రేమికుల బలవన్మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.


అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమికులు ఇద్దరూ వారి ఇళ్లలో ప్రేమ గురించి చెప్పలేదని స్పష్టమైంది. ఒకవేళ ప్రేమ గురించి తెలిస్తే ఏం జరుగుతుందోననే భయంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు.