Just In





Vijay Antony: విజయ్ ఆంటోని పరిస్థితి విషమం? ఆ వార్తల్లో నిజమెంతా? ఇప్పుడు ఎలా ఉన్నారు?
మలేషియాలో జరిగిన బోటు ప్రమాదంలో గాయపడిన విజయ్ ఆంటోని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? కోలుకుంటున్నారా?

‘బిచ్చగాడు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటుడు, దర్శకుడు విజయ్ ఆంటోనీ సోమవారం మూవీ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మలేషియాలో జరుగుతున్న ‘బిచ్చగాడు-2’ షూటింగ్‌లో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన విజయ్‌ను హుటాహుటిన విజయ్‌ను కౌలలాంపూర్ హాస్పిటల్‌కు తరలించారు.
‘బిచ్చగాడు-2’ షూటింగ్‌లో భాగంగా లంకావీ అనే దివి తీరంలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విజయ్ ఆంటోని జెట్‌స్కై బోటును నడుపుతున్నాడు. వేగంగా వెళ్తున్న బోటు ఒక్కసారే అదుపు తప్పింది. నేరుగా వెళ్లి కెమేరా సిబ్బందితో వెళ్తున్న పెద్ద బోటును ఢీకొట్టింది. దీంతో విజయ్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతడిని హుటాహుటిన ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కోలుకుంటున్న విజయ్?
అయితే, విజయ్ సన్నిహితులు మాత్రం ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్లు చెబుతున్నారు. విజయ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నారు. ప్రమాదంలో విజయ్ నడుముకు చిన్న గాయమైందని తెలిపారు. ఆయన తిరిగి కోలుకొనేవరకు షూటింగ్‌ను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. బుధవారం అక్కడి హాస్పిటల్‌లో డిశ్చార్జ్ కాగానే చెన్నైకు వచ్చేశారని తెలిపారు. అభిమానులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే నిర్మాత ధనంజయన్, దర్శకుడు సిఎస్ అముధన్ కూడా ధృవీకరించారు. విజయ్ కోలుకుంటున్నారని ట్వీట్ చేశారు.
2016లో తమిళంలో ‘పిచ్చైక్కరన్’ టైటిల్‌తో విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఈ మూవీని ‘బిచ్చగాడు’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేశారు. హీరో బిచ్చగాడి పాత్రలో నటించడమనేది నిజంగా సాహసమే. దీంతో విజయ్ ఆంటోనీకి ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘బిచ్చగాడు-2’ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ‘బిచ్చగాడు’ మూవీకి శశీ దర్శకత్వం వహించగా, ‘బిచ్చగాడు-2’కు ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాలతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలను సైతం డూప్ లేకుండా ఆయన స్వయంగా చేస్తున్నట్లు తెలిసింది.