బాలీవుడ్ తారల పెళ్లంటే మామూలు విషయమా. కనీసం నెల రోజుల పాటూ హంగామా ఉంటుంది. పెళ్లికి వారం ముందు నుంచి మొదలైన సంబరాలు విదేశాల్లో హనీమూన్ తో ముగుస్తాయి. ప్రేమపక్షులు విక్కీ-కత్రినా భార్యా భర్తలుగా మారి పది రోజులు అయ్యిందో లేదో విక్కీ సినిమా షూటింగులకు బయల్దేరాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో నెటిజన్లంతా ‘విక్కీ నీకు ఏమైంది, బాగానే ఉన్నావా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. కత్రినాను ఎక్కడ వదిలేశావ్ అంటూ టీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 9 న వీరిద్దరి పెళ్లి జరిగింది. అక్కడ్నించి ఈ జంట ముంబై వచ్చింది. ముంబైలో చేయిచేయి పట్టుకుని ప్రేమగా నడుచుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అటునుంచి అటే ఇద్దరూ హనీమూన్ కు వెళతారనుకున్నారు అభిమానులు. కానీ కత్రినా- విక్కీ అలాంటి ప్లాన్ లో ఉన్నట్టు కనిపించలేదు. 


కొత్త పెళ్లికొడుకు విక్కీ ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టాడు. కారులో వెళుతున్న ఫోటోను పెట్టి ముందు టీ తరువాత షూటింగ్ అని క్యాప్షన్ పెట్టాడు. వెడ్డింగ్ మూడ్ అప్పుడే పోయిందా విక్కీకి, కత్రినా చేసిన హల్వా తిని ఏమైనా అయ్యిందా అంటూ కామెంట్ల వరద నడుస్తోంది ఆ పోస్టు మీద. కొంతమంది మాత్రం మరీ ఇంత వర్క్ డెడికేషనా అంటూ ప్రశ్నించారు. కత్రినా కూడా షూటింగుల్లో బిజీగా ఉందా లేక ఇంట్లోనే వదిలేశావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


కత్రినా-విక్కీ కలిసి ఒక్కసినిమాలో కూడా చేయలేదు. అయినా ఒక టీవీ షో ద్వారా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమ చిగురించింది. కత్రినా మీద విక్కీ వయసులో అయిదేళ్ల చిన్నవాడు. వీరిద్దరి ప్రేమ వయసు కేవలం ఏడాదే. త్వరగానే పెళ్లి పీటలు ఎక్కేసింది ఈ జంట. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ లో వీరి వివాహం జరిగింది. 



Also Read: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?



Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...


Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి