సంక్రాంతి బరిలో, బాక్సాఫీస్ దగ్గర గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నట విశ్వరూపం చూపించారు. ఫ్యాక్షన్ బేస్డ్ ఫిలిమ్స్ అంటే... ఫ్యాక్షన్ లీడర్ రోల్స్ అంటే... బాలకృష్ణ ఎప్పుడూ బెస్ట్ ఇస్తారు. 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy)లో కూడా విజృంభించారు.
 
సంక్రాంతికి విడుదలైన 'వీర సింహా రెడ్డి' సినిమా అభిమానులకు నచ్చింది. భారీ వసూళ్ళు సాధించింది. ఇప్పుడు సినిమా యూనిట్ బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించడానికి రెడీ అయ్యింది. 


హైదరాబాద్ జేఆర్సీలో...  
వీరసింహుని విజయోత్సవం
ఈ ఆదివారం... జనవరి 21న సాయంత్రం ఐదు గంటలకు జేఆర్సీ ఫంక్షన్ హాల్ 'వీర సింహా రెడ్డి' సక్సెస్ మీట్ కోసం రెడీ అవుతోంది. సాయంత్రం ఐదు గంటలకు 'వీరసింహుని విజయోత్సవం' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ సహా ఇతర యూనిట్ సభ్యులు అటెండ్ కానున్నారు. 


'వీర సింహా రెడ్డి' @ 70 కోట్ల షేర్!
పది రోజుల్లో 'వీర సింహా రెడ్డి' కలెక్షన్స్ 70 కోట్ల రూపాయలు దాటాయి. ఇది షేర్ కలెక్షన్. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 'వీర సింహా రెడ్డి' సినిమా రూ. 54 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు చూస్తే సుమారు 125 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.


అమెరికాలో వన్ మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసిన 'వీర సింహా రెడ్డి' ఇంకా వసూళ్ళు సాధిస్తోంది. 


Also Read : 'మిషన్ మజ్ను' రివ్యూ : రష్మిక 'మజ్ను' గురి తప్పిందా? బావుందా?






ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్!
బాలకృష్ణ కెరీర్ చూస్తే... 'వీర సింహా రెడ్డి'కి భారీ రిలీజ్ దక్కిందని చెప్పాలి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1500 థియేటర్లలో విడుదలైంది. నైజాంలో 265, సీడెడ్ ఏరియాలో 200, ఏపీలో 410, ఓవర్సీస్ చూస్తే 500, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 100కు పైగా స్క్రీన్లలో సినిమా విడుదలైంది. 


అమెరికాలో షో ఆపేసిన థియేటర్ యాజమాన్యం!
అమెరికాలోని డల్లాస్ సిటీలో ఒక థియేటర్ యాజమాన్యానికి మాత్రం బాలకృష్ణ అభిమానులు చేసిన సందడి నచ్చలేదు. సెక్యూరిటీ అధికారులు వచ్చి థియేటర్ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అందుకు కారణం ఏంటో తెలుసా? ప్రేక్షకులు చూపించిన అభిమానమే. స్క్రీన్ మీద పేపర్లు విసురుతూ, గోల గోల చేసే సరికి షో మధ్యలో ఆపేశారు. 'అఖండ' సినిమా విడుదలైన సమయంలో కూడా అమెరికాలో థియేటర్‌లో సౌండ్ విషయంలో కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 'వీర సింహా రెడ్డి'కి ఇలా జరిగింది.


Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?


'క్రాక్' విజయం తర్వాత గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రమిది. 'అఖండ' విడుదల తర్వాత బాలకృష్ణ నుంచి వచ్చిన సినిమా కూడా ఇదే. ఇందులో ఫైట్స్ బావున్నాయని, 'వీర సింహా రెడ్డి'గా బాలకృష్ణ యాక్టింగ్ అద్భుతమని రివ్యూ రైటర్లతో పాటు ప్రేక్షకులు చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయిందని టాక్ వచ్చింది.


శ్రుతీ హాసన్ కథానాయికగా... హానీ రోజ్ మరో నాయికగా, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతినాయిక ఛాయలు ఉన్న పాత్రలో, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు నటించారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.