సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె (Raghu Kunche)కు పితృ వియోగం సంభవించింది. ఆయన తండ్రి లక్ష్మీనారాయణ ఈ నెల 17న తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలంలో గల గాదరాడలో మృతి చెందారు. 


ప్రతి ఏడాదీ సంక్రాంతికి సొంతూరు గాదరాడకు వెళ్లడం రఘు కుంచెకు అలవాటు. పండగ పూట తండ్రితో కలిసి టైమ్ స్పెండ్ చేస్తారు. ఈ ఏడాది కూడా అలాగే రఘు కుంచె వెళ్ళారు. అయితే, ఈ సంక్రాంతి తండ్రి చివరి క్షణాలు అవుతాయని ఆయన ఊహించలేదు.


రఘు కుంచె ఎమోషనల్ పోస్ట్
''నాన్న ప్రాణం పోవడానికి కొన్ని గంటలు ముందు... నేను తెచ్చిన కొత్త బట్టలు వేసుకుని, ఫ్యామిలీతో ఉల్లాసంగా గడిపి, దూరంగా ఉన్నవాళ్ళను వీడియో కాల్ ద్వారా పలకరించి, మర్నాడు (జనవరి 17, 2023) పొద్దున్నే లేచి స్నానం చేసి, పూజ చేసుకుని, బ్రేక్ ఫాస్ట్ చేసి... తనకు ఇష్టమైన మడత కుర్చీలో వెనక్కి వాలి, తన ప్రాణానికి ప్రాణమైన భగవద్గీత చదువుతూ అలానే ప్రశాంతంగా శాశ్వత నిద్రలోకి జారిపోయారు. ఏ రోజు ఎవరిని కించిత్ కూడా ఇబ్బంది పెట్టని నాన్న... ఆఖరి క్షణాల్లో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలానే వెళ్లిపోయారు'' అని రఘు కుంచె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 


Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?  






టీవీలో యాంకర్, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటుడిగా అతిథి పాత్రల్లో కనిపించిన రఘు కుంచె... తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా పూర్తి స్థాయిలో ప్రయాణం ప్రారంభించారు. ఇప్పుడు నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు. రఘు కుంచె గత ఏడాది 'రుద్రవీణ', 'మా నాన్న నక్సలైట్' సినిమాల్లో... అంతకు ముందు 'పలాస 1978'లో, రవితేజ 'డిస్కో రాజా' తదితర సినిమాల్లో నటించారు. ఇప్పుడు విలన్‌గా ఐదు సినిమాలు చేస్తున్నారాయన. త్వరలో హీరోగా మారనున్నారని సమాచారం.


Also Read : రష్మీ ఇంట్లో విషాదం - కన్నీటితో కడసారి వీడ్కోలు


రఘు కుంచె మెయిన్ లీడ్‌గా మూవీ చేయడానికి ఓ దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత కూడా రెడీ! సాధారణంగా తెలుగులో మెయిన్ లీడ్ అంటే హీరో అని అంటారు. రఘు కుంచె తనకు హీరోగా నటించాలని లేదని చెప్పేశారట. కథ విన్న తర్వాత రెగ్యులర్ హీరో తరహా రోల్ కాకుండా... కొత్తగా ఉండటంతో ఓకే చెప్పేశారట. ఆయన వయసుకు తగ్గట్టు ఈ రోల్ ఉంటుందట. త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారట. 


సంగీత దర్శకుడిగా మూడు సినిమాలు!
నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ... సంగీత దర్శకుడిగా కూడా రఘు కుంచె సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. 'పలాస 1978' సినిమాకు ఆయన స్వరపరిచిన పాటలు ఇప్పటికీ యూట్యూబ్‌లో వినిపిస్తూ ఉంటాయి. ఆ సినిమాతో లోకల్ సింగర్స్‌ను ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సంగీత దర్శకుడిగా ఆయన తొలి సినిమా 'బంపర్ ఆఫర్'లో 'ఎందుకే రావణమ్మా...' పాట ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ మహారాజ రవితేజ 'దేవుడు చేసిన మనుషులు' కూడా మంచి పాటలు అందించారు. త్రిష 'నాయకి' సినిమా పాటలు కూడా హిట్టే.