కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్ నిర్మించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha). ఇందులో క‌శ్మీర ప‌ర్ధేశీ (Kashmira Pardeshi) కథానాయిక. తొలుత ఫిబ్రవరి 17న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే... ఇప్పుడు ఒక్క రోజు వెనక్కి వెళ్ళారు.
 
ధనుష్ 'సార్' నిర్మాత కోసం...
ధనుష్ తొలి స్ట్రెయిట్ సినిమా 'సార్'ను సితార ఎంట్ర్‌టైన్‌మెంట్స్ పతాకం మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సితార సంస్థకు, గీతా ఆర్ట్స్ సంస్థకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకని, సితార నిర్మాతల కోసం ఒక్క రోజు 'వినరో భాగ్యము విష్ణు కథ'ను ఒక్క రోజు వెనక్కి తీసుకు వెళ్ళారు. ఈ సంగుతులు బయటకు చెప్పలేదు కానీ... ఫిబ్రవరి 18న సినిమాను విడుదల చేస్తున్నట్టు ఈ రోజు అనౌన్స్ చేశారు. అదీ సంగతి!


సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
'వినరో భాగ్యము విష్ణు కథ' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మంచి సినిమా తీశారని సెన్సార్ సభ్యులు చిత్ర నిర్మాతలను ప్రశంసించారని సమాచారం. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కూడా ప్రశంసలు అందుకుంది. నెంబర్ నైబర్ కాన్సెప్ట్ మీద సినిమా తీశారు.


Also Read : 'రిషబ్'తో ఊర్వశి రౌతేలా - 'కాంతార 2'లో






'వాసవ సుహాస...'తో పాజిటివ్ వైబ్స్!
'వినరో భాగ్యము విష్ణు కథ' నుంచి మొదట 'వాసవ సుహాస...' పాటను విడుదల చేశారు. ఆ బాణీ, అందులో సాహిత్యం, గానం ఎంత శ్రావ్యంగా ఉన్నాయో ప్రేక్షకులు అందరూ విన్నారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ 'వాసవ సుహాస'ను విడుదల చేశారు. అప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. సినిమాకు ఆ సాంగ్ మంచి బజ్ తీసుకు వచ్చింది. ఆ తర్వాత విడుదల చేసిన 'దర్శనా...' సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడది యువతకు లవ్ యాంథమ్ కింద మారింది. సినిమా టీజర్ సైతం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దాంతో విడుదలకు ముందు సినిమా లాభాల్లోకి వెళ్ళిందని సమాచారం. 


Also Read నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? చెక్ పెట్టిన బ్రాహ్మణి, ప్రణతి 


జీఏ 2 పిక్చర్స్ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడం... ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో 'వినరో భాగ్యము విష్ణుకథ' విడుదలకు కొన్ని రోజుల ముందే లాభాల్లోకి వెళ్ళిందని తెలిసింది. బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యిందట. జీఏ 2 పిక్చర్స్ సంస్థకు కొంత మంది రెగ్యులర్ బయ్యర్స్ ఉన్నారు. కొన్ని ఏరియాల్లో సొంతంగా విడుదల చేస్తారు. ఆల్రెడీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రేట్స్ & రైట్స్ ఫైనల్ చేశారు. డిజిటల్ & శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా అమ్మేశారు. వాటితో బడ్జెట్ మొత్తం రికవరీ కావడమే కాదు, లాభాలు వచ్చాయని తెలిసింది. 


కిరణ్ అబ్బవరం ఈజ్ బ్యాక్!?
'రాజా వారు రాణీ గారు' సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం, తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమాతో భారీ విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఆశించిన విజయాలు తీసుకు రాలేదు. కిరణ్ అబ్బవరం మీద సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పడ్డాయి. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా అతడికి విజయాలు రావడం లేదని! 'వినరో భాగ్యము విష్ణు కథ'కు వస్తున్న బజ్, జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే కిరణ్ అబ్బవరం ఈజ్ బ్యాక్ అనిపించుకునేలా కనిపిస్తున్నారు. ఏమవుతోంది చూడాలి.