'అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు' - 'ఖలేజా' పతాక సన్నివేశాల్లో త్రివిక్రమ్ రాసిన మాట. కన్నడ సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా ప్రేక్షకులను, విదేశీయులను సైతం మెప్పించిన 'కాంతార' గురించి చెప్పాలంటే ఈ మాట సరిగ్గా సరిపోతుంది ఏమో!


రిషబ్ శెట్టి (Rishab Shetty) కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కాంతార' కన్నడ నాట థియేటర్లలో విడుదలైనప్పుడు ఎవరూ కూడా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. తొలుత కన్నడలో, ఆ తర్వాత ఇతర భాషల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదలైన తర్వాత సీక్వెల్, ప్రీక్వెల్ చేస్తానని రిషబ్ శెట్టి వెల్లడించారు. ఇప్పుడు ఆ పనులు మొదలు పెట్టారు. 


'కాంతార 2'లో ఊర్వశి రౌతేలా!
Kantara Prequel Update : ఇప్పుడు 'కాంతార'కు ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. అదే 'కాంతార 2'. అందులో కథానాయిక ఊర్వశి రౌతేలా నటిస్తున్నారు. ఆమెకు ఇది చాలా పెద్ద అవకాశం అని చెప్పాలి. సెన్సేషనల్ హిట్ 'కాంతార' ప్రీక్వెల్ అంటే  సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టి పడుతుంది. రిషబ్ శెట్టితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా 'కాంతార 2 లోడింగ్' అని కాప్షన్ ఇచ్చారు. దాంతో సినిమాలో ఆమె ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. 


Also Read : నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? చెక్ పెట్టిన బ్రాహ్మణి, ప్రణతి






'కాంతార'ను 'కెజియఫ్ 1', 'కెజియఫ్ 2' సినిమాలు ప్రొడ్యూస్ చేసిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. విజయ్ కిరగందూర్ నిర్మాత. ఇప్పుడీ 'కాంతార 2'ను కూడా ఆయనే నిర్మిస్తున్నారు. 'కాంతార' విజయంలో అజనీష్ లోకనాథ్ స్వరాలు, నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడీ ప్రీక్వెల్ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు.


రిషబ్ శెట్టి దక్షిణ కర్ణాటకలో తీర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన బాల్యానికి, 'కాంతార' కథకు ఓ సంబంధం ఉంది. దక్షిణ కర్ణాటకలో దైవారాధన ఎక్కువ. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు కుల దైవం వంటి ఆచారాలు ఉన్నాయి. బాల్యంలో ఆ ఆచారాలను గమనించిన రిషబ్ శెట్టి, ఈ సినిమాలో చూపించారు. ఇప్పుడీ 'కాంతార 2' వాటి గురించి మరింత ఎక్కువ చూపించే అవకాశాలు ఉన్నాయి. 


Also Read : 'ఇండియన్ ఐడల్ 2' షురూ - తమన్ వచ్చాడు, నిత్యా మీనన్ ఎక్కడ?


గత ఏడాది బాక్సాఫీస్ బరిలో 'కాంతార' సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన ప్రతి భాషలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ హిస్టరీలో సరికొత్త రికార్డులు లిఖించింది. పదిహేను కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వంద రోజులు కూడా పూర్తి చేసుకుంది. 'కాంతార'లో సప్తమి గౌడ కథానాయికగా నటించారు. అచ్యుత్ కుమార్, కిశోర్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. వాళ్ళలో ఎంత మంది 'కాంతార 2'లో ఉంటారో... ఎంత మంది కొత్త తారలు వస్తారో చూడాలి. వెయిట్ అండ్ సి.