రుణ్‌తేజ్‌ హీరోగా నటించిన ‘గని’ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావల్సి ఉన్నా.. కోవిడ్-19 వల్ల చాలాసార్లు వాయిదా పడింది. మధ్య మధ్యలో భారీ చిత్రాల విడుదల వల్ల కూడా నిర్మాతలు ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్‌తో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. 


‘‘గని ఇక లైఫ్‌లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చేయ్’’ అంటూ ‘గని’ తల్లి చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలువుతుంది. కానీ, తల్లి మాట వినకుండా గని బాక్సింగ్ కొనసాగిస్తాడు. ‘‘ఒక వేళ అమ్మకు నిజం తెలిసే రోజే వస్తే.. అది నేను నేషనల్ ఛాంపియన్ అయిన రోజువ్వాలి. అదే నా గోల్’’ అని గని చెబుతాడు. మరి, గని లక్ష్యం నెరవేరుతుందా? నేషనల్ ఛాంపియన్‌గా నిలిచి తల్లి ముందు నిలుచుంటాడా? తన లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి. తదితర అంశాలను ట్రైలర్‌లో చూపించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌కు తల్లిగా నదియా నటించారు. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర తదితరలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘‘ఆట గెలవాలంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడూ గెలిచినవాడి మాటే నమ్ముతుంది’’ అనే డైలాగ్ బాగుంది. మొత్తానికి ఈ ట్రైలర్ మెగా ఫ్యామిలీ అభిమానులకు బాగా నచ్చేస్తుంది. 


Also Read: ‘యుద్ధం’ చూడాలని ఉందా? ఈ 8 వెబ్‌సీరిస్‌లు కట్టిపడేస్తాయ్, డోన్ట్ మిస్!