సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'సర్కారు వారి పాట'. కీర్తీ సురేష్ (Keerthy Suresh) కథానాయిక. పరశురామ్ (Parashuram) దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ సినిమాలో తొలి పాట 'కళావతి...' విడుదలైన సంగతి తెలిసిందే. 90 ప్లస్ మిలియన్ రికార్డ్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకు వెళుతోంది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేయడానికి టీమ్ రెడీ అయ్యింది.

 

'సర్కారు వారి పాట'లో రెండో పాట 'పెన్నీ...'ను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ రోజు వెల్లడించారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. (Penny Song from Sarkaru Vaari Paata will be released on 20th March)





మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంస్థలపై తెరకెక్కుతోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 12న సినిమా విడుదల (Sarkaru Vaari Paata Release On May 12, 2022) కానుంది. 'వెన్నెల' కిషోర్, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: ఆర్. మధి, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్.