Puneeth Rajkumar - James Twitter Review: 'జేమ్స్' జాతర షురూ - సెలబ్రేషన్స్‌లో పవర్ స్టార్ పునీత్ ఫ్యాన్స్
James Movie Review By Netizens: పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా 'జేమ్స్' నేడు విడుదలైంది. పునీత్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని నెటిజన్స్ అంటున్నారు. కర్ణాటకలో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి.
కన్నడ ప్రేక్షకులు 'పవర్ స్టార్' అని, అభిమానులు ముద్దుగా 'అప్పు' అని పిలుచుకునే దివంగత కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా 'జేమ్స్' నేడు విడుదల అయ్యింది. కన్నడలో తీసిన ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో డబ్ చేశారు. ప్రియా ఆనంద్ కథానాయికగా... శ్రీకాంత్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. కర్ణాటకలో ఈ రోజు తెల్లవారుజామున బెనిఫిట్ షోలు పడ్డాయి.
పునీత్ మరణం తర్వాత, నేడు ఆయన జయంతి సందర్భంగా 'జేమ్స్' విడుదల కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చారు. స్క్రీన్ మీద పునీత్ ప్రతి మూమెంట్‌ను సెలబ్రేట్ చేస్తున్నారు. పేపర్లు ఎగరేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. థియేటర్ల బయట అయితే బాణాసంచా కలుస్తూ... పండగ వాతావరణం తీసుకొచ్చారు. పునీత్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ 'జేమ్స్' అని నెటిజన్స్ అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశంలో పునీత్ మాసివ్ పెర్ఫార్మన్స్ చూస్తే గూజ్ బంప్స్ గ్యారెంటీ అని మరొకరు ట్వీట్ చేశారు. పునీత్ రాజ్ కుమార్ 'జేమ్స్' గురించి ఇంకా నెటిజన్స్ ఏమని అంటున్నారంటే....