Urfi Javed’s Swollen Face: ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నిత్యం వింత డ్రెస్సులతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఎవ్వరికీ సాధ్యం కాని కాస్ట్యూమ్స్ తో ప్రశంసలతో పాటు ట్రోలింగ్ కు గురవుతుంటుంది. అలాంటి ఉర్ఫీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. గతం చాలా సార్లు తనకు స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు చెప్పిన ఆమె.. తాజాగా షాకింగ్ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలో ముఖం, కళ్లు, పెదవులు పూర్తిగా ఉబ్బి ఉన్నాయి. చర్మం ఇన్ఫెక్షన్ గురై ఎర్రగా మారిపోయింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  


ఇంతకీ ఉర్ఫీ జావేద్ కు ఏమైంది అంటే?


తాజాగా తనకున్న ఆరోగ్య సమస్య గురించి అందరితో పంచుకునే ప్రయత్నం చేసింది ఉర్ఫీ. బోటాక్స్, ఫిల్లర్స్ గురించి బాధపడుతున్నట్లు చెప్పింది. 18 ఏళ్ల వయసు నుంచే తాను ఫిల్లర్లు పొందుతున్నట్లు చెప్పింది. తీవ్రమైన ఎలర్జీ కారణంగా ముఖం గుర్తు పట్టలేనంతగా మారిపోయినట్లు వివరించింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. ఇందుకోసం ఇమ్యునో థెరపీ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. స్కిన్ ఎలర్జీ కారణంగా తాను చాలా బాధపడున్నానని చెప్పుకొచ్చింది. ఎలర్జీ కారణంగా పొద్దున్నే నిద్రలేచే సరికి ముఖం బాగా ఉబ్బిపోయి కనిపిస్తుందని వెల్లడించింది. ముఖంతో పాటు చర్మం మీద నొప్పి, దురద ఏర్పడుతుందని చెప్పింది. ప్రస్తుతం నిపుణుల సమక్షంలో ఇమ్యునో థెరపీ కొనసాగుతున్నట్లు వివరించింది.






ఉర్ఫీ ఫోటోలు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు


ఉర్ఫీ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ కొత్త కొత్త డ్రెస్సులతో ఆకట్టుకునే ఉర్ఫీ ఒక్కసారిగా ఇలా దర్శనం ఇవ్వడంతో షాక్ అవుతున్నారు. వీలైనంత త్వరగా ఆ సమస్య నుంచి కోలు కోవాలని కోరుకుంటున్నారు. మళ్లీ ఎప్పటి లాగే తమను ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు.


ఇంతకు ఎవరు ఈ ఉర్ఫీ జావేద్?


ఉర్ఫీ జావేద్ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వివాదాలకు కారణం అయ్యింది. ఆమె వేసుకునే వింత డ్రెస్సులు బాగా పాపులర్ కావడానికి కారణం అయ్యాయి. బిగ్ బాస్ షోకు ముందే ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’ సీరియల్ లో అవనీ పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ALT బాలాజీలో ప్రసారమైన ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా,  ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా కనిపించి ఆకట్టుకుంది. 2016 నుండి 2017 వరకు, ఉర్ఫీ స్టార్ ప్లస్ ‘చంద్ర నందిని’లో ఛాయా పాత్రలో ఆకట్టుకుంది. 2018లో SAB TV  ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి క్యారెక్టర్ లో కనిపించింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా కనిపించింది. ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది.  


Read Also: సల్మాన్‌ ప్లేస్‌లో ఆ కుర్ర హీరోకు ఛాన్స్? దర్శకుడు సూరజ్ బర్జాత్య షాకింగ్ నిర్ణయం