ర్ఫీ జావెద్ ఫ్యాషన్ పిచ్చి గురించి మీకు తెలిసిందే. ఆమె ఏ డ్రెస్ వేసినా ప్రత్యేకమే. అయితే, చాలా సందర్భాల్లో ఆమె ధరించేది డ్రెస్సేనా? అనే సందేహం కూడా కలుగుతుంది. అయితే, ఆమెపై ఎన్ని విమర్శలు వచ్చినా.. తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. తనకు నచ్చింది నచ్చినట్లు చేసుకుపోతోంది. చివరికి బెదిరింపులను సైతం ఆమె లెక్క చేయకుండా ఆ డ్రెస్‌లతోనే పబ్లిక్‌లోకి వెళ్తోంది. తాజాగా ఉర్ఫీ.. చూయింగ్ డ్రెస్‌ను ధరించింది.


ఫ్యాషన్ ఉసురు తీస్తున్నావంటున్న నెటిజన్స్


నమిలి ఊసిన చూయింగ్ గమ్‌లను శరీరానికి అంటించుకుని.. దాన్నే డ్రెస్ అని ఉర్ఫీ చెప్పడాన్ని నెటిజనులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఛీ, యాక్.. ఇదేం ఫ్యాషన్ పోకడ అంటూ తిట్టిపోస్తున్నారు. కొందరైతే ఫ్యాషన్ ఉసురు తీస్తున్నావు ఉర్ఫీ అని కామెంట్లు పెడుతున్నారు. కేవలం ప్రైవేట్ పార్టులను వస్తువులతో కప్పుకోవడాన్నే నువ్వు ఫ్యాషన్ అనుకుంటున్నావా? ఫ్యాషన్ అంటే అది కాదు.. అని కొందరు క్లాస్ పీకుతున్నారు. తాజాగా ఉర్పీ.. పొడవైన జుట్టును శరీరారినికి ధరించి షాకిచ్చింది. ఆ చేదు జ్ఞాపకాన్ని ఇంకా నెటిజనులు మరిచిపోక ముందే.. ఉర్ఫీ ఈ చూయింగ్ గమ్ డ్రెస్‌తో ప్రత్యక్షమైంది. నోటిలోని చూయింగ్ గమ్‌ను బయటకు లాగుతూ మరీ ఆమె ఫొటోలకు పోజులిచ్చింది. పాపం, ఉర్ఫీ ఫ్యాషన్ ఫోబియాను.. ఈ పాడు ప్రపంచం ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అంటున్నారు ఫ్యాన్స్. 




నాకు బట్టలంటే అక్షరాలా అలెర్జీ


తాజాగా తాను ఎందుకు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవాల్సి వస్తుందో వివరించింది ఉర్ఫీ జావేద్. ఇందుకు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలోకి వదిలింది. ‘చలికాలంలో ఎవరికైనా ఈ అలర్జీ వస్తుందా?’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. నిండైన దుస్తులు ధరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో వివరించింది. “ఫుల్ ఉన్ని దుస్తులు ధరించడం వల్ల తన శరీరం అలర్జీకి గురవుతోందని తెలిపింది. అక్కడక్కడా పొక్కులు వస్తున్నాయి. అందుకే నాకు బట్టలంటే అక్షరాలా అలెర్జీ. ఇప్పుడు మీకూ తెలిసింది నేను ఎందుకు బట్టలు వేసుకోనో! నాకున్న ఈ తీవ్రమైన పరిస్థితి కారణంగా నిండైన బట్టలు వేసుకుంటే వెంటనే దురద ఏర్పడుతుంది. కాబట్టి నేను ఎక్కువగా నగ్నంగా ఉండటానికే ఇష్టపడతాను” అని ఉర్ఫీ వెల్లడించింది.


ఉర్ఫీపై రణ్‌బీర్ విమర్శలు




ఉర్పీ డ్రెస్సింగ్ స్టైల్‌ను పలువురు సెలబ్రిటీలు సైతం తప్పుబడుతున్నారు. ఇటీవల రణబీర్ కపూర్ కూడా ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌పై విమర్శలు చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, తన కజిన్ కరీనా కపూర్ నిర్వహించిన 'వాట్ విమెన్ వాంట్' చాట్ షోకి రణబీర్ కపూర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఉర్ఫీ జావేద్ దుస్తుల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఉర్ఫీ అవుట్ ఫిట్స్ లేదా ఆమె ఛాయిసెస్ ను బ్యాడ్ టేస్ట్ గా రణబీర్ పేర్కొన్నాడు. అయితే, కరీనా కొన్ని రోజుల తర్వాత ఉర్ఫీని అత్యంత ధైర్యవంతురాలిగా, చాలా గట్స్ ఉన్న అమ్మాయిగా అభివర్ణించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కరీనా కాంప్లిమెంట్ పై ఉర్ఫీ స్పందించింది.


గాల్లో ఎగిరినట్లుంది: ఉర్ఫీ


కరీనా కామెంట్స్‌పై ఉర్ఫీ స్పందిస్తూ.. “నేను గాల్లో ఎగిరాను, నేను మొదట నమ్మలేకపోయాను. ఇది ఒక జోక్ అని నేను అనుకున్నాను.. ఆమె నా దుస్తులను విమర్శించి ఉంటుందని భావించాను. నన్ను ప్రశంసించిందని చెప్పి.. అందరూ నన్ను మోసం చేస్తున్నారనుకున్నా. కానీ తర్వాత నేను ఆ వీడియో క్లిప్‌ని చూశాను. ఆ రోజు నేను నా జీవితంలో ఏదో సాధించానని గ్రహించాను” అని ఉర్ఫీ జావేద్ తెలిపారు. రణ్‌ బీర్ కామెంట్స్ తో నేను అప్సెట్ అయ్యాను, కానీ కరీనా కపూర్ కాంప్లిమెంట్ తో నేను ‘రణ్‌ బీర్ గో టూ హెల్’ అన్నట్లుగా ఉంది. కరీనా నన్ను ప్రశంసించింది, నాకు ఎవరి ధ్రువీకరణ లేదా మరేమీ అవసరం లేదు అని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. 


Also Read : పడ్డవాడు చెడ్డవాడు కాదు - కుర్రాళ్ల క్రేజీ హార్ట్ బీట్ విజయ్ దేవరకొండ, రౌడీ బాయ్ కెరీర్‌ను మార్చిన మూవీస్ ఇవే!