మోహన్ స్టేషన్ కి వస్తాడు. బెయిల్ తీసుకొచ్చావా అని అడుగుతుంది. అది పక్కోడి పొట్లం కాదు తులసి తెచ్చి ఇవ్వడానికని లాస్య ఎంట్రీ ఇస్తుంది. మొగుడితో పాలు పంచుకోవాల్సిన దానివి మీ వాళ్ళతో కష్టాలు పంచుకుంటున్నావా అని దివ్యకి కౌంటర్ వేస్తుంది. నీకేం కావాలని దివ్య అడుగుతుంటే అన్నింటికీ మీ నాన్నకి తెలుసని చెప్తుంది. కేసు వెనక్కి తీసుకోవడానికి రెడీగా ఉన్నానని అయితే ఏం చేయాలో మీ నాన్నకి తెలుసని అంటుంది. చేసిన తప్పుకి కాళ్ళు కాకపోయినా చేతులు పట్టుకుని భార్యగా ఒప్పుకుని గౌరవంగా ఇంటికి తీసుకెళ్తానని చెప్పు అప్పుడు కేసు వాపస్ తీసుకుంటానని లాస్య చెప్తుంది.


నందు: నీతో కాపురం చేయడం కంటే కోర్టు భరించే శిక్ష అయిన భరిస్తాను


లాస్య: నేను పెట్టింది మామూలు కేసు కాదు గృహహింస కేసు


నందు: అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావ్


Also Read: జానకి చుట్టు ఉచ్చు బిగించిన మనోహర్- చావుబతుకుల్లో జ్ఞానంబ


లాస్య: ఈ పొగరే తగ్గించుకోమని చెప్తుంది. నిన్ను అంత తేలికగా వదిలిపెట్టను


తులసి: తప్పు చేసి రెచ్చగొడుతున్నావ్ సిగ్గులేదా


లాస్య: పక్కన ఉండి మాజీ మొగుడ్ని రెచ్చగొడుతున్నావ్ నీకు సిగ్గు లేదా? నువ్వు ఏం చేసినా పడి ఉండటానికి నేను తులసిని కాదు లాస్యని. నీతో కలిసి బతకడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రాత్రి ఆలోచించుకుని చెప్పు అనేసి వెళ్ళిపోతుంది.


ఇంటి దగ్గర అందరూ దివ్య కోసం కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు. నిజమెంటో తెలుసుకునేంత వరకు దివ్యని అపార్థం చేసుకోవద్దని విక్రమ్ తాతయ్య చెప్తాడు. దివ్యకి ఫోన్ చేస్తూనే ఉన్నా కానీ తను లిఫ్ట్ చేయడం లేదని అంటాడు. సహనంగా ఆలోచించు ఆవేశంగా ఆలోచించకని చెప్తాడు. మధ్యలో బసవయ్య కల్పించుకుంటూ దివ్యకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. దివ్య విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. టెన్షన్ లో ఉన్నాను అమ్మ దగ్గరకి వచ్చాను తర్వాత మాట్లాడతానని చెప్పి విక్రమ్ మాట్లాడేది కూడా వినిపించుకోకుండా కాల్ కట్ చేస్తుంది. అన్నయ్యకి కూడా విషయం చెప్పకపోవడం ఏంటి అందరి ముందు అన్నయ్య పరువు పోయినట్టే కదా అని సంజయ్ అంటాడు.


అందరూ దివ్యని తలా ఒక మాట అంటూ రాజ్యలక్ష్మిని పొగుడుతూ ఉంటారు. గృహహింస కేసు చిన్నది కాదని విడిపించడం కష్టమని మోహన్ మరోసారి చెప్తాడు. కేసు పెట్టిన లాస్యనే దాన్ని వెనక్కి తీసుకోవాలని అంటాడు. తులసి మంచిది కాబట్టి బాధని గుండెల్లో మోసి మమ్మల్ని క్షమించింది. అప్పుడు నువ్వు జాలి చూపించినా దేవుడు వదల్లేదని అనసూయ ఏడుస్తుంది. తులసి ఒంటరిగా కూర్చుని రాజ్యలక్ష్మి గతంలో అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటుంది. తను అనుకున్నది జరగడం లేదని లాస్య రగిలిపోతుంది. విక్రమ్ ని నిద్రలేపి తులసి ఇంటికి వెళ్ళమని పెద్దాయన సలహా ఇస్తాడు. ఇంత జరిగినా దివ్య మీద కోపం లేదు తను ఇంటికి రాగానే ప్రేమగా గుండెలకు హత్తుకుంటాను. కానీ విక్రమ్ ఆ ఇంటికి వెళ్ళడం తనకి ఇష్టం లేదని చెప్తుంది.


Also Read: భవానీని తనవైపుకి తిప్పుకుంటున్న ముకుంద- ప్రేమలోకంలో విహరిస్తున్న కృష్ణ


విక్రమ్ కి దివ్య అంటే ఇష్టం కానీ తన వ్యక్తిత్వం పోగొట్టుకోకూడదు కదా అంటుంది. రాత్రికి రాత్రి కూతురు పుట్టింటికి వస్తే ఫోన్ చేసి చెప్పాలనే ఇంగిత జ్ఞానం కూడా దివ్య పుట్టింటి వాళ్ళకి లేదా? కోడలు అంటే అత్త చేతి కింద పనిమనిషి లెక్క. కానీ ఎప్పుడైనా నువ్వు అలా ప్రవర్తించావా అని బసవయ్య పుల్లలు వేస్తూ ఉంటాడు.