భవానీ ముకుంద చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కృష్ణ వల్ల ముకుందని ఎందుకు దూరం చేసుకుంటున్నారని అన్న మాటలు ఆలోచిస్తుంది. భవానీ సీరియస్ గా ఆలోచించడం చూసి నా కొడుకు కోడలు ఇప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు తను ఏ నిర్ణయం తీసుకుంటుందోనని రేవతి భయపడుతుంది. నేను తీసుకోబోయే నిర్ణయం మీదే ఈ ఇంటి భవిష్యత్ ఆధారపడి ఉందని భవానీ కఠినంగా చెప్తుంది. కృష్ణ భవానీ దగ్గరకి వస్తుంది. వెళ్లిపొమ్మని బయటకి చూపిస్తుంది. వెళ్తాను కానీ చెప్పాల్సింది చెప్పి వెళ్తానని అనేసరికి భవానీ ముకుంద అని గట్టిగా అరుస్తుంది. ముకుంద టెన్షన్ గా వస్తుంది.


కృష్ణ: మీరు ఏసీపీ సర్ తో మాట్లాడాలంటే ఏం చేయాలో చెప్పండి


భవానీ: ఇది నా ఇల్లు నేను తీసుకున్న నిర్ణయాలు ఫైనల్ ఎవరి రికమండేషన్ వినను


కృష్ణ: ఏసీపీ సర్ తప్పేమీ లేదని చెప్పు ముకుంద. జరిగిన తప్పుకి పూర్తి బాధ్యత నాదే ఇందులో ఆయన జోక్యం చేసుకోలేదని చెప్పు ముకుంద 


Also Read: క్రూర మృగం కంటే దారుణంగా ఉన్న శైలేంద్ర- కొడుకుని కౌగలించుకుని గుండెలు పగిలేలా ఏడ్చిన జగతి


ముకుంద: తప్పు నీదే కానీ నీ మాట విని మురారీ తప్పు చేశాడు కదా అందుకే శిక్ష వేశారు. నువ్వు చేసిన ద్రోహానికి ఇంకోకళ్ళు అయితే ఇంట్లో నుంచి గెంటేసే వాళ్ళు


భవానీ: ఇంకొక్క క్షణం ఉంటే అదే చేస్తాను


కృష్ణ బాధగా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. మురారీ కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటే భోజనం తీసుకుని వస్తుంది. ఏంటి కళ్ళలో నీళ్ళు వచ్చాయని అడుగుతాడు. ఏమి లేదని చెప్పి కవర్ చేస్తుంది. మురారీకి ఇష్టమైనవి చేసి తీసుకొచ్చానని చెప్పి ప్రేమగా తినిపిస్తుంది.


సందు దొరికినప్పుడల్లా ముకుంద భవానీకి కృష్ణ మీద ఎక్కించే పనిలోనే ఉంటుంది. నువ్వు ఆలోచించినంత లోతుగా నేను ఆలోచించలేదు ఇక నుంచి ఆలోచిస్తానని చెప్తుంది. కోడలు ఎందుకు అంత ఆనందంగా ఉంది. ఎంత మంచి కొడుకుని కన్నావ్ అని ఎందుకు అన్నది. ఈ విషయం ఎలా తెలుసుకోవాలని రేవతి ఆరాటపడుతుంది. కానీ వాళ్ళని పలకరిస్తే తనని కూడా ఎక్కడ వెలి వేస్తుందోనని భయపడి మాట్లాడకుండానే వెనక్కి వెళ్ళిపోతుంది.


Also Read: కావ్య పదహారు రోజుల పండగ - ఈసారైనా అప్పు ప్లాన్ వర్కౌట్ అవుతుందా?


ముకుంద మురారీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని మురిసిపోతుంది. పెద్దత్తయ్య ఇప్పుడిప్పుడే నా మాట వింటున్నారు. మెల్లగా మీది నిజమైన పెళ్లి కాదని చెప్పేస్తాను అప్పుడు ఇంట్లో పెద్ద బాంబ్ పేలుతుంది. మనం ప్రేమించుకున్న విషయం అందరికీ చెప్పేస్తాను అప్పుడు మన పెళ్లి జరుగుతుందని అనగానే కరెంట్ పోతుంది. ఇదేంటి ఇలా జరిగిందని ముకుంద టెన్షన్ పడుతుంది. అక్క ముకుంద మాటలకు ప్రభావితం అవుతుందా అని రేవతి కంగారు పడుతుంది. దీని వల్ల మురారీ జీవితానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడమని మనసులోనే దేవుడిని వేడుకుంటుంది.