కనకం చేసిన రచ్చకి రాజ్ రగిలిపోతూ ఉంటాడు. కొడుకు ఆవేశ పడుతుంటే అపర్ణ సర్ది చెప్పేందుకు చూస్తుంది. కోపంలో ఎంత పెద్ద నిజాన్ని బయట పెట్టబోయావో అర్థం అవుతుందా అంటుంది. అందుకని వాళ్ళు ఎంత చేశారో చూశావా పూజ అంటూ గోల చేశారు. ఇంకొన్ని రోజుల్లో కావ్య ఇంటి నుంచి వెళ్లిపోతుందని నువ్వే చెప్పావు కదా వాళ్ళు పూజలు చేసుకొనివ్వు మనకి ఎందుకు నువ్వు ఓపికగా ఉంటే మంచే జరుగుతుందని నచ్చజెపుతుంది. ఎట్టి పరిస్థితుల్లోని కావ్యని కండిషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చావని బయట పెట్టకు. రెండు రోజుల్లో తన తప్పుని ఒప్పుకుని తనే వెళ్ళిపోతుంది. అప్పుడు అందరికీ అర్థంఅవుతుంది నేను తనని కోడలిగా ఎందుకు అంగీకరించలేదోనని అంటుంది.


Also Read: యష్ కోరిక తీర్చిన వేద- చిత్రని పెళ్లి చేసుకోవడానికి అభి స్కెచ్, బుట్టలో పడిన వసంత్


మీనాక్షీ ప్రశాంతంగా పడుకుంటే కనకం ఫోన్ చేస్తుంది. అది చూసి మీనాక్షీ వణికిపోతుంది. పదహారు రోజుల పండుగ చేసేందుకు గుడికి రమ్మని పిలుస్తుంది. ఇంట్లో ఎవరూ ఉండరు రాహుల్ ని పిలిపించుకుని ప్రేమగా మాట్లాడి నా కంట్రోల్ లోకి తెచ్చుకుంటానని సంబరపడుతుంది. అందరూ వెళ్లిపోయారా లేదా అని చూసేందుకు బయటకి వచ్చేసరికి స్వప్నకి కనకం వాళ్ళు ఎదురుపడతారు. శుభమా అని కావ్యకి పదహారు రోజుల పండుగ చేసుకోవడానికి వెళ్తున్నా ఎటువంటి దరిద్రపు పనులు చేయవద్దని కనకం తిడుతుంది. అప్పు గుడికి రానని అంటుంది. అక్క ఒక్కతే ఉంటుంది కదా నాకు అది తోడు ఉంటుంది నేను డానికి తోడు ఉంటానని చెప్తుంది. సరేనని చెప్పి కనకం దంపతులు గుడికి వెళ్లిపోతారు. ఎవరూ ఉండరని అనుకుంటే నువ్వు ఉండిపోయావు ఏంటే అని స్వప్న మనసులో తిట్టుకుంటుంది. నేను ఫ్రెండ్స్ తో సినిమా ప్లాన్ చేశా అందుకే ఎగ్గోట్టా నువ్వు బయటకి వెళ్లకని నమ్మేలా చెప్తుంది. తనకి అడ్డు తప్పిపోయిందని అనుకుని స్వప్న సంబరపడుతుంది. కావ్య గదిలో పని చేసుకుంటూ ఉండగా అపర్ణ చీర పట్టుకుని వస్తుంది.


కావ్య: మేడమ్ మీరు నా గదిలోకి


అపర్ణ: నీ గది కాదు నా కొడుకు గది అందరూ కలిసి నా కొడుకుని అమాయకుడిని చేసి నిన్ను ఈ గదిలోకి పంపించారు


కావ్య: మీ కొడుకు మీరు అనుకున్నంత అమాయకుడు ఏమి కాదు, మీరే అన్నారుగా అందరూ కలిసి మీ కొడుకు గదిని నా గదిగా మార్చారు ఇంతకీ మీరు వచ్చిన విషయం ఏమిటీ  


అపర్ణ: ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను


కావ్య: మీరు నాకు శారీ పెడుతున్నారా? అంటే నేను ఈ పూజ చేయడానికి మీరు ఒప్పుకున్నట్టే కదా, ఈ ఇంటి కోడలిగా నన్ను అంగీకరించినట్టే కదా


అపర్ణ: మరీ అంత సంబరపడకు నా కొడుకు ఆయుష్హు కోసం ఒప్పుకున్నా. దుగ్గిరాల ఇంటి కోడలివి అయ్యే అర్హత నీకు ఎప్పటికీ లేదు. జరిగిన దాంట్లో తప్పు నీది అని అందరికీ తెలిసొచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోతావు. అప్పటి వరకు ఈ ఇంటి కోడలు హోదాలో అన్ని భోగాలు అనుభవించు. ఈ ఇంటి నుంచి నిన్ను బయటకి గెంటేసేటప్పుడు సకల లాంఛనాలతో అన్ని సంప్రదాయం ప్రకారమే వీడ్కోలు పలుకుతాము


Also Read: దివ్య గురించి విక్రమ్ మనసులో విషబీజం నాటిన రాజ్యలక్ష్మి- మళ్ళీ ఫస్ట్ నైట్ గోవింద


కావ్య: కొంత కాలం అయినా నన్ను కోడలిగా అంగీకరించినట్టే కదా. మీకు తెలియకుండానే మీరు నన్ను కోడలిగా అంగీకరిస్తున్నారు అంటే మీలో మార్పు మొదలైంది. నేను తప్పు చేయలేదని నిరూపణ అయితే ఈ ఇంట్లో దుగ్గిరాల వారి కోడలిగా శాశ్వతంగా ఉండిపోతాను కదా మేడమ్


అపర్ణ: కలలు అందరూ కంటారు కానీ పిచ్చి వాళ్ళు పగటి కలలు కూడా కంటారని ఇప్పుడే చూస్తున్నా అని కోపంగా తిట్టేసి వెళ్ళిపోతుంది.


గుడిలో పదహారు రోజుల పండుగ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కనకం, కృష్ణమూర్తి వాళ్ళు బట్టలు తీసుకుని వస్తారు. మీనాక్షీ వచ్చి హడావుడి చేస్తుంది. రాహుల్ కి స్వప్న ఫోన్ చేస్తుంది. మా వాళ్ళు అంతా టెంపుల్ లోనే ఉన్నారు ఇంట్లో నేను తప్ప ఎవరూ లేరు. మనం ఇద్దరం కలుసుకోవడానికి ఇంతకంటే మంచి టైమ్ రాదు. మా ఇంటికి రా అని పిలుస్తుంది. ఈ టైమ్ లో మీ ఇంటికి ఎలా వస్తానని అంటాడు. నువ్వు ఇక్కడికి రాకపోతే నేను అక్కడికి రావాల్సి వస్తుంది అందరి ముందు మన విషయం చెప్పేస్తానని బెదిరిస్తుంది. నేను అక్కడికి రాను, నువ్వు రావొద్దు వేరే ప్లేస్ చెప్తాను అక్కడికి రమ్మని చెప్తాడు. వాళ్ళ మాటలన్నీ అప్పు వింటుంది.