తన భార్యని బతికించమని గోవిందరాజులు జానకిని వేడుకుంటాడు. ఏం చేయాలో అర్థం కాక జానకి బాధపడుతూ తన పోలీస్ టోపీ చూసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కనబడని నాలుగో సింహంగా మారి సమాజానికి సేవ చేయాలని అనుకుంటే బంధాలు వెనక్కి లాగుతున్నాయి. శత్రువు ఇంట్లో దాకా వచ్చాడు పారిపోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితికి తీసుకొచ్చాడు. ఉద్యోగం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మనుషుల్ని పోగొట్టుకుంటే ఎంత కష్టపడినా సంపాదించుకోలేను అది నా వల్ల కాదని అనుకుంటుంది. యూనిఫాం వదులుకోవద్దని అటు రామ చెప్పిన మాటలు ఇటు జ్ఞానంబ పెట్టిన కండిషన్ తలుచుకుని వ నిర్ణయం తీసుకుంటుంది. ఫైనల్ డెసిషన్ తీసుకున్నా వెంటనే ఈ నిర్ణయం చెప్పాలని జానకి స్టేషన్ కి వస్తుంది.
రామకి క్యారేజ్ ఎందుకు తీసుకురాలేదని సుగుణ అడుగుతుంది. ఎస్సై మొండి పట్టు చూశావ్ కదా అందుకే తీసుకురాలేదని చెప్తుంది. సుగుణ తన బాక్స్ ఇచ్చి రామకి పెట్టమని చెప్తుంది. యూనిఫాం వదలనందుకు సంతోషంగా ఉందని రామ అంటాడు. జానకి అవేమీ పట్టించుకోకుండా ఫుడ్ తినిపిస్తుంది.
Also Read: జైల్లోనే నందు- ఇంట్లో అగ్గి రాజేసిన బసవయ్య, దివ్య గురించి అపార్థం చేసుకున్న విక్రమ్
జానకి: మీరు నన్ను యూనిఫాంలో చూడటం ఇదే ఆఖరి రోజవుతుంది. నా రాజీనామా రాసి ఇవ్వడానికి స్టేషన్ కి వచ్చాను. పరిస్థితులకు తల వంచాల్సిందే
రామ: యూనిఫాం వేసుకుని ఓటమిని అంగీకరిస్తున్నారా
జానకి: కోడలిగా బాధ్యత చేస్తున్నా, ఇంటి గౌరవం కాపాడాలని నిర్ణయించుకున్నా
రామ: అవేమీ పట్టించుకోవద్దని చెప్పాను కదా
జానకి: మీరు నా చుట్టు గిరి గిస్తే అందరికీ దూరమై శత్రువు అవుతున్నా. అక్కడ అత్తయ్య నిరాహారదీక్ష చేస్తూ మందులు వేసుకోవడం లేదు. మీరు కంటికి కనిపించకపోతే ఏమి తిననని అంటున్నారు. అత్తయ్యకి ప్రాణభిక్ష పెట్టమని మావయ్య అడిగారు. కాదని ఎలా చెప్పేది మీరు చెప్పిన మాట వింటే సంతోషంగా ఇంటికి వెళ్తే అక్కడ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ ఉండరు
రామ: యూనిఫాం త్యాగం చేసి మొగుడ్ని కాపాడుకుందని అనుకుంటారు. నేను నిర్దోషనని ఎవరూ నమ్మరు నన్ను దోషిలాగా చూస్తారు. అప్పుడే ఎస్సై వస్తాడు. అసలు ఎస్పీని కలిసి ఎస్సై మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం లేదని అంటాడు. జానకి భర్తకి తినిపించబోతుంటే మనోహర్ వచ్చి ప్లేట్ విసిరికొడతాడు.
మనోహర్: ఎవరి పర్మిషన్ తీసుకుని సెల్ ఓపెన్ చేశావ్, భోజనం పెడుతున్నావ్. ఇదేమైన నీ ఇల్లు అనుకుంటున్నావా? ఈ ఒక్క కారణం చాలు నీ మీద కంప్లైంట్ రాసి సస్పెండ్ చేయించడానికి. ఇక నుంచి రామ సెల్ దగ్గరకి వెళ్ళడానికి వీల్లేదు మాట్లాడటానికి వీల్లేదు. నువ్వు నా మాట విని రిజైన్ చేసే వరకు రోజుకొక గిఫ్ట్ ఇస్తాను. యుద్ధం చేస్తుందట యుద్దం చెయ్యి అనేసరికి జానకి వెళ్ళిపోతుంది.
జ్ఞానంబకి జెస్సి ఫుడ్ తీసుకొస్తుంది. కొడుకు కోసం దీక్ష చేస్తున్నా ఎవరి మాట వినేది లేదని తెగేసి చెప్తుంది. అప్పుడే జానకి ఇంటికి వస్తుంది. వెనుకే అఖిల్ కోపంగా ఇంటికి వచ్చి బ్యాగ్ విసిరికోడతాడు.
అఖిల్: నీ పెద్ద కోడలు దురదృష్టాన్ని అందరికీ పంచుతుంది.
Also Read: భవానీని తనవైపుకి తిప్పుకుంటున్న ముకుంద- ప్రేమలోకంలో విహరిస్తున్న కృష్ణ
జెస్సి: విషయం చెప్పకుండా అరిస్తే ఎవరికి ఏం అర్థం అవుతుంది. జానకి అక్క తన పాట్లు ఏవో పడుతుంది నీకేంటి నష్టం
అఖిల్: మీ అన్నయ్య మత్తు మందులు అమ్ముతున్నారంట కదా కుటుంబం మొత్తం అదే పనిలో ఉన్నారా అని మా బాస్ నిలదీశాడు. అన్నయ్య కోర్టులో నిర్దోషిగా బయటకి వచ్చేవరకు ఆఫీసుకి రావొద్దని ఉద్యోగంలో నుంచి తీసేశారు
జానకి: అలా ఎలా తీసేస్తారు నేను మాట్లాడతాను
విష్ణు: ఎంత మందితో మాట్లాడతావ్ వదిన అందరి బతుకులు రోడ్డున పడుతున్నాయ్. నా షాపు లీజుకి ఇచ్చిన ఓనర్ వచ్చి ఖాళీ చేయమని అంటున్నాడు. మత్తు మందుల వ్యాపారం మనం కూడా చేయమని ఏంటి నమ్మకమని అడుగుతున్నాడు
జానకి: అఖిల్, విష్ణుకి ఒకేసారి ఒకెలాంటి సమస్య ఎందుకు వచ్చింది అంటే ఎస్సై అనుకున్నంత పని చేస్తున్నాడు
జ్ఞానంబ: రామని మత్తు మందుల కేసులో ఇరికించిన వాళ్ళే ఈ పని చేశారు ఇంకా ఇంకా తెగిస్తారు