Urfi Javed Arrest: ఉర్ఫీ జావేద్. ఈమె గురించి సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. హిందీ బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, వింత వింత డ్రెస్సులు. చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె వేసుకునే డ్రెస్సులు చూస్తూ ఎవ్వరైనా హవ్వా అంటూ ముక్కున వేలేసుకోవాల్సింది. గోనె సంచులు, కండోమ్స్, తాళ్లు, టేపు, కవర్లు, ఆకులు ఒకటేమిటీ ఆమె రకరకాల వస్తువులతో తయారు చేసిన డ్రెస్సులు వేసుకుని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. కొన్నిసార్లు ఈ వింత వేషధారణతో బహిరంగ ప్రదేశాల్లో తిరగడంతో పలుమార్లు వివాదానికి కారణం అయ్యింది.


ఉర్ఫీని అరెస్టు చేసిన పోలీసులు


తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె వింత వేషధారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముంబై పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్టుకు సంబంధించి నెట్టింట్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ రెస్టారెంట్ కు వెళ్లిన ఆమెను ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. అయితే, ఆమెను నిజంగానే అరెస్టు చేశారా? లేదంటే ఏదైనా ప్రమోషన్ లో భాగంగా ఈ తతంగం నడిచిందా? అనేది తెలియాల్సి ఉంది.  






ఈ అరెస్టు నిజమేనా? అయితే, కారు నెంబర్ మాటేంటి?


ఉర్ఫీ రెస్టారెంట్ కు వెళ్లగా, ఇద్దరు పోలీసులు వచ్చిన ఆమెను అరెస్టు చేస్తున్నట్లు చెప్తారు. అయితే, కొద్ది సేపు పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగుతుంది. ఆ తర్వాత పోలీసు వెహికిల్ ఎక్కి వెళ్తుంది. ఆమె వెళ్లే కారులో ఇద్దరు మహిళా పోలీసులతో పాటు ఓ ఎస్సై, డ్రైవర్ ఉన్నారు.  ఆమెను తీసుకెళ్లిన వాహనం కూడా పోలీసు వాహనం మాదిరిగానే ఉంది. బ్లాక్ స్కార్పియోకు పైన పోలీస్ సైరన్, లైట్స్ ఉన్నాయి. పోలీస్ అనే స్టిక్టర్ కూడా ఉంది. అయితే, ఈ వెహికిల్ ఎవరిది? అని ఆర్టీవో సైట్ లో చూస్తే,  గోవింద్ భాయి ఆర్. రాథోడ్ పేరు మీద రిజిస్టర్ చేయించి ఉంది. ప్రభుత్వ వాహనం ప్రైవేటు వ్యక్తి మీద రిజిస్ట్రేషన్ చేయడం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు.






అరెస్టు అంతా డ్రామానా?


మరోవైపు ఉర్ఫీ అరెస్ట్ అనేది ఓ నాటకంగా నెటిజన్లు భావిస్తున్నారు.  ఆ పోలీసులు కూడా జూనియర్ ఆర్టిస్టుల మాదిరిగానే ఉన్నారంటున్నారు. మరి కొంతమంది ఇదంతా ప్రమోషనల్ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. ఇంకొంత మంది ఉర్ఫీ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే, పోలీసులు నిజంగానే అరెస్టు చేస్తారని హెచ్చరిస్తున్నారు.  మరి ఈ అరెస్టు గురించి ఉర్ఫీ ఏం చెప్తుందో చూడాలి. ప్రస్తుతానికి ఈ వీడియోను నెటిజన్లు ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. 


Read Also: నా మాటలు విని శ్రీ‌దేవి కంటతడి పెట్టింది, ఆమెను అలా చూసి చాలా బాధేసింది- ఆదిల్ హుస్సేన్









Join Us on Telegram: https://t.me/abpdesamofficial