Upcoming Telugu Movie: ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు సినీ లవర్స్ ను అలరించనున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ ఈ వారంలోనే థియేటర్లలోకి రానుంది. అటు బ్లాక్ బస్టర్ హిట్ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ తెలుగు వెర్షన్ తో పాటు ‘లంబసింగి’, ‘భీమా’ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. 


ఈవారం థియేటర్లలోకి వచ్చే సినిమాలు


1. ఫ్యామిలీ స్టార్- ఏప్రిల్ 5న విడుదల


టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. పరుశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విజయ్, పరుశురామ్ ‘గీతగోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వీరి కాంబోలో వస్తున్న’ఫ్యామిలీ స్టార్’ మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా అలరించింది.


2. భరతనాట్యం - ఏప్రిల్ 5న విడుదల


సూర్య తేజ, మీనాక్షి గోస్వామి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘భరతనాట్యం’. మహేంద్ర ఈ సినిమాను తెరకెక్కించారు. పాయల్ సరాఫ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలాంటి మలుపు తిప్పింది అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, సలీం కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.   


3. బహుముఖం - ఏప్రిల్ 6న విడుదల


హర్షివ్ కార్తిక్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బహుముఖం’. స్వర్ణిమా సింగ్‌, మార్టినోవా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది. అమెరికా సహా పలు ఇతర దేశాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.


4. మంజుమ్మల్‌ బాయ్స్‌- ఏప్రిల్ 6న విడుదల


మలయాళంలో విడుదలై రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన చిత్రం ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’. ఈ సినిమాను ఇప్పుడు అదే పేరుతో తెలుగులోకి విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. ఏప్రిల్‌ 6న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.   


5. ప్రాజెక్ట్‌-Z - ఏప్రిల్ 6న విడుదల


సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ్ మూవీ ‘మాయవన్‌’. సుమారు ఏ సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోకి విడుదల కాబోతోంది. ‘ప్రాజెక్ట్‌-Z’ పేరుతో ఏప్రిల్‌ 6న థియేటర్లలోకి అడుగు పెట్టబోతోంది. సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.  


6. మంకీ మ్యాన్ - ఏప్రిల్ 5న విడుదల  


హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మంకీ మ్యాన్’. హనుమంతుడిని ప్రేరణగా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా అమెరికాలో విడుదలై అద్భుత ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, విపిన్ శర్మ, అశ్విని కల్సేకర్, అదితి కల్కుంటే, సికందర్ ఖేర్, పిటోబాష్, మకరంద్ దేశ్‌పాండే, షార్ల్టో కోప్లే కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు   


నెట్‌ఫ్లిక్స్‌


1. స్కూప్‌- హాలీవుడ్ మూవీ- ఏప్రిల్‌ 05న విడుదల


2. పారాసైట్‌: దిగ్రే- కొరియన్‌ సిరీస్‌- ఏప్రిల్‌ 05న విడుదల


అమెజాన్‌ ప్రైమ్‌


1. మ్యూజికా-హాలీవుడ్ మూవీ- ఏప్రిల్‌ 04న విడుదల


2. హౌ టూ డేట్‌ బిల్లీ వాల్ష్‌- హాలీవుడ్ మూవీ- ఏప్రిల్‌ 05న విడుదల


జీ5


1.ఫర్రే- హిందీ మూవీ- ఏప్రిల్‌ 05న విడుదల


డిస్నీ+హాట్‌స్టార్‌


1. లంబసింగి- తెలుగు సినిమా- ఏప్రిల్‌ 02న విడుదల


2. భీమా- తెలుగు సినిమా- ఏప్రిల్ 05న విడుదల


Read Also: ‘ఓపెన్‌హైమర్’ ఒక ప్రాపగాండా సినిమా - సంచ‌ల‌న కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో!