టాలీవుడ్‌కు ఈ ఏడాది సుభారంభమనే చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహా రెడ్డి’ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం అవి ఓటీటీల్లో కూడా సందడి చేస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాలేవీ లేవు. దీంతో చిన్న సినిమాల హవా నడుస్తోంది. థియేటర్, ఓటీటీల్లో కూడా ఈ వారం పలు చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. అవేంటో చూసేయండి మరి.
థియేటర్లలో విడుదల కానున్న సినిమాలివే:
‘బలగం’
హాస్య నటుడు ప్రియదర్శి ఓ వైపు కమెడియన్ రోల్స్ చేస్తూనే మరోవైపు కంటెంట్ బేస్డ్ సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకుల చేత మంచి మార్కులు వేయించుకున్నాడు. ఆయన తాజాగా నటించిన చిత్రమే ఈ ‘బలగం’. ఈ మూవీలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హస్థిత తెరకెక్కించారు. భీమ్స్ సంగీతం అందించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’
బిగ్ బాస్‌తో అభిమానులను సంపాదించుకున్న సోహెల్ పలు సినిమాలతో తన లక్ పరీక్షించుకుంటున్నాడు. గతంలో ‘లక్కీ లక్ష్మణ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు ‘ఆర్గానిక్ మామ - హైబ్రీడ్ అల్లుడు’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, మీన ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కూడా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘రిచిగాడి పెళ్లి’
సత్య, చందన్రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ఈ ‘రిచి గాడి పెళ్లి’. కె.ఎస్. హేమరాజ్ ఈ మూవీకు దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా మార్చి 3 న థియేటర్లలో విడుదల అవనుంది.
‘సాచి’
సంజన రెడ్డి, గీతిక రధన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘సాచి’. ఈ సినిమా బిందు అనే యువతి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీ పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి వివేక్ పోతినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కూడా శుక్రవారం విడుదల కాబోతోంది.
‘గ్రంథాలయం’
విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి జంటగా నటించిన సినిమా ‘గ్రంథాలయం’. సాయి శివన్ జంపన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వైష్ణవి శ్రీ నిర్మించారు. ఈ సినిమా కూడా మార్చి 3 న విడుదల కానుంది.
అలాగే వీటితో పాటు ఓటీటీ లో కూడా పలు సినిమాలు డిజిటల్ బాట పట్టనున్నాయి.
ఓటీటీలో రిలీజయ్యే సీరిస్‌లు, సినిమాలివే..
హాట్ స్టార్ లో..
ది మాండలోరిన్ (వెబ్ సిరీస్) - మార్చి 1
గుల్మొహర్ - మార్చి 3
ఎలోన్ - మార్చి 3
అమెజాన్ ప్రైమ్ వీడియోలో..
డైసీ జోన్స్ అండ్ ద సిక్స్ (వెబ్ సిరీస్) - మార్చి 3
జీ5 లో..
తాజ్: డివైడెడ్ బై బ్లడ్ (వెబ్ సిరీస్) - మార్చి 3
నెట్ ఫ్లిక్స్ లో..
హీట్ వేవ్ - మార్చి 1
సెక్స్ లైఫ్ (వెబ్ సిరీస్) - మార్చి 2
థలైకూతల్ - మార్చి 3