వినాయక చవితి.. పైగా శుక్రవారం.. దీంతో థియేటర్, ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సీరిస్‌లు సందడి చేయనున్నాయి. అవేంటో చూసేద్దామా.
‘సిటీమార్’: హీరో గోపీచంద్-తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది దర్శకత్వంతో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సిటీమార్’. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లో సందడి చేయనుంది. ఇప్పటికే వేసవి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ మూవీ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. వినాయక చవితి రోజు సందడి చేస్తోంది. ఇందులో గోపీచంద్ ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‌గా, తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‌గా నటిస్తున్నారు.
‘తలైవి’: దివగంత నటి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘తలైవి’ కూడా ఈ శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఏఎల్ విజయ్ తెరకెక్కించిన ఈ మూవీలో కంగనా జయలలితగా, అరవిందస్వామి ఎంజీఆర్ గా కనిపించనున్నారు. సినిమా, రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిందీ సినిమా.
'జాతీయ రహదారి': లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాల ఇతివృత్తంలో తెరెక్కించిన సినిమా ‘జాతీయ రహదారి’. ‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’, ‘లజ్జ’ చిత్రాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది ఈ మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా సెప్టెంబరు 10న థియేటర్‌లో విడుదల కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే:
నాని ‘టక్ జగదీష్’: నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా అమెజాన్ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ సినిమా విడుదల విషయంలో వివాదంలో నెలకొన్న విషయం తెలిసిందే.
‘నెట్’: రాహుల్ రామకృష్ణ, అవికాగోర్ నటించిన ‘నెట్’ కూడా శుక్రావారం జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. భార్గవ్ మాచర్ల దర్శకుడు. అశ్లీల చిత్రాలు చూసే రాహుల్ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్నదే కథ
ముంబై డైరీస్ 26/11 : అమెజాన్ ప్రైమ్ వేదికగా అలరించనున్న మరో కొత్త సిరీస్ ‘ముంబై డైరీస్ 26/11’. ఈ మెడికల్ థ్రిల్లర్ సెప్టెంబరు 9 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయింది. 26/11 ముంబయి దాడుల సమయంలో వైద్యులు, విలేకరులు, పోలీస్ ఫోర్స్ ఏవిధంగా పనిచేసిందనేదే ఈ సీరిస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి.
‘తుగ్లక్ దర్బార్’: విజయ్ సేతుపతి మరో చిత్రం తుగ్లక్ దర్భార్ . రాశీ ఖన్నా, మంజిమా మోహన్ హీరోయిన్లు. దిల్లీ ప్రసాద్ దీనదయాళన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సెప్టెంబరు 10న సన్ టీవీ నేరుగా ప్రసారం చేయనుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. విజయ్ సేతుపతి-శృతి హాసన్‌లు నటించిన ‘లాభం’ ఇప్పటికే విడదలైంది.
ఇక OTTలో ఈవారం విడుదలైన-కానున్న మరికొన్ని వెబ్ సీరిస్, సినిమాలు:
నెట్‌ఫ్లిక్స్
అన్‌టోల్డ్: బ్రేకింగ్ పాయింట్ (సెప్టెంబర్ 07)
ఇన్ టు ది నైట్ (సెప్టెంబర్ 08)
బ్లడ్ బ్రదర్స్ (సెప్టెంబర్ 09)
లూసిఫర్ (సెప్టెంబర్ 10)
కేట్ (సెప్టెంబర్ 10)
మెటల్ షాప్ మాస్టర్స్ (సెప్టెంబర్ 10)
అమెజాన్ ప్రైమ్
టక్ జగదీష్ (సెప్టెంబర్ 10)
ముంబై డైరీస్ 26/11 (సెప్టెంబర్ 10)
లూలా రిచ్ (సెప్టెంబర్ 10)
మాటల్ కమ్‌బాట్ (సెప్టెంబర్ 11)
హెచ్‌బీవో మ్యాక్స్
మాలిగ్‌నాంట్ (సెప్టెంబర్ 10)
జీ 5
నెట్(సెప్టెంబర్ 10)
డిక్కీ లూనా (సెప్టెంబర్ 10)
క్యా మెరీ సోనమ్ గుప్తా బెవాఫా హై (సెప్టెంబర్ 10)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
అమెరికన్ క్రైమ్‌స్టోరీ (సెప్టెంబర్ 08)
తుగ్లక్ దర్బార్ (సెప్టెంబర్ 11)
ఆహా...
ద బేకర్ అండ్ ద బ్యూటీ ( సెప్టెంబర్ 10)
మహాగణేశా ( సెప్టెంబర్ 10)
వూట్
క్యాండీ (సెప్టెంబర్ 08)
నీ స్ట్రీమ్
కూరా (సెప్టెంబర్ 09)
ఆపిల్ టి.వి ప్లస్
బీయింగ్ జేమ్స్‌బాండ్ (సెప్టెంబర్ 07)