తెలుగులో ‘ఆహా’ ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ షో ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో పెద్దగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ టాక్ షో మొదటి సీజన్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెండో సీజన్ లోకి అడుగు పెట్టింది. వారానికో కొత్త గెస్ట్ ను ఆహ్వానించి వారి అంతరంగాలను ఆవిష్కరించే ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. అందుకే ప్రతీవారం వచ్చే గెస్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు అభిమానులు. తాజాగా ఈ షో కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ వారం హీరో ప్రభాస్, ఆయన ఫ్రెండ్, హీరో గోపీచంద్‌లు అతిథులుగా రానున్నారు. తొలిసారి ప్రభాస్, బాలయ్య కలసి కనిపించనుండటంతో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ టాక్ షోలో ప్రభాస్ స్నేహితుడు గోపీచంద్ కూడా పాల్గోనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఈ షోలో ప్రభాస్ చాలా సింపుల్ గా కనిపించారు. కానీ ఆయన ధరించిన షర్ట్ మాత్రం ప్రత్యేకత ఆకర్షణ గా నిలిచింది. ఈ కలర్ ఫుల్ షర్ట్ లో ప్రభాస్ ను చూసి తెగ సంబరపడిపోతున్నారు ఆయన డైహార్డ్ ఫ్యాన్స్. దీంతో ప్రభాస్ ధరించిన చొక్కాపై చర్చలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన వేసుకున్న చొక్కా గురించి ఆరా తీస్తే.. ఆ షర్ట్ ప్రముఖ బ్రాండ్ రాల్ఫ్ లారెన్‌కు చెందినదని తెలిసింది. దాని ధర సుమారు 11 వేలకు పైనే ఉంటుందని సమాచారం. అంత సింపుల్ గా కనిపిస్తున్న ఆ చొక్కా అంత ధర ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారట డార్లింగ్ అభిమానులు. కొంత మంది మాత్రం ప్రభాస్ లైఫ్ స్టైల్ తో పోలిస్తే ఈ షర్ట్ ధర చాలా తక్కువ అని కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి టీజర్ ప్రోమోను విడుదల చేసింది ఆహా టీమ్. ఈ ప్రోమో గ్లింప్స్ లో ప్రభాస్ మల్టీ కలర్ షర్ట్ లో మెరిసిపోతూ కనిపించారు. టాక్ షో లో ప్రభాస్ ఎంట్రీ ను కూడా సినిమా లెవల్ లో ప్లాన్ చేసింది ఆహా. ఈ ప్రోమో వీడియోలో ప్రభాస్, గోపీచంద్ తో ఫుల్ సందడి చేశారనే చెప్పాలి. బాలయ్య ప్రభాస్ ను తన దగ్గరికి రమ్మంటే ఆయన భయపడుతూ వెనక్కి వెళ్లినట్లుగా గ్లింప్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దీని కోసం డార్లింగ్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్‌ను డిసెంబర్ 31 న కొత్త సంవత్సరం కానుకగా స్ట్రీమింగ్ చేయాలని చూస్తోంది ఆహా టీమ్.
Also Read: షారుఖ్ 'బేషరమ్ రంగ్'కు రాజకీయ రంగు - 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడి సెటైర్లు?