Telugu States Poor Houses : తెలుగు రాష్ట్రాల ప్రభుత్ాలు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్లు నిర్మించే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని కేంద్ర రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఆరు ఇళ్ల నిర్మాణమే జరిగినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాద్వీ నిరంజన్ జ్యోతి వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2019 నుంచి ఇప్పటి వరకూ ఏపీకి 2,56,270 ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించామని చెప్పారు. 1,11,312 ఇళ్లను మంజూరు చేయగా, వాటిలో కేవలల 6 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు వివరించారు.
అదే సమయంలో మరో సభ్యుడు అడిగిన ప్రశ్నకు 2016 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ఏపీకి 2,56,270 ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించామని చెప్పారు. 1,82,632 ఇళ్లను మంజూరు చేయగా, వాటిలో 46,726 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు వివరించారు. పూర్తయిన ఇళ్లలో 5 మినహా మిగతావన్నీ గత ప్రభుత్వ హయాంలోనే నిర్మించారని ఆ రిపోర్టులో తెలిపారు.
కేంద్ర పథకాన్ని అమలు చేయకుండా సొంతంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్
అయితే అసలు తెలంగాణ ప్రభుత్వం 2016 నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్లు అసలు నిర్మించలేదు. ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని కేంద్రం తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం రూ. లక్షా 80వేలు ఇస్తుంది. మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. దీనికి కూడా రుణ ప్రాతిపదికిన లబ్దిదారులకు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణ కేసీఆర్ ఇలాంటి సమస్యలు వద్దని .. చిన్న చిన్న ఇళ్లు అవసరం లేదని చెప్పి.. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టారు. కేంద్రం నుంచి పైసా కూడా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నారు. చాలా చోట్ల ఇవి పూర్తయ్యాయి. త్రలో పేదలకు పంపిణీ చేయనున్నారు. ఈ కారణంగానే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ ఎలాంటి ఇళ్లు నిర్మించలేదని రికార్డుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఏపీలో సెంట్ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడం - టిడ్కో ఇళ్లు ఇవ్వకపోవడంతో లెక్కలు తారుమారు
అయితే ఏపీ ప్రభుత్వానిది మాత్రం భిన్నమైన స్టోరీ. గత ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చే నిధులను గరిష్టంగా ఉపయోగించుకుని టిడ్కో ఇళ్లను నిర్మించింది. లబ్దిదారులకు కేటాయించింది. అయితే పనులు పూర్తి చేయకపోవడం వల్ల.. ఆ ఇళ్లను లబ్దిదారులకు కేటాయించలేదు. తర్వాత ముఫ్పై లక్షల ఇళ్ల స్థలాల పేరుతో సెంట్ స్థలాలను జగన్ పేదలకు ఇచ్చారు. వాటిలో ఇల్లు కట్టుకోవాలని.. చెబుతున్నారు. ఈ ఇళ్ల నిర్మాణం సరిగ్గా ముందుకు సాగడం లేదు. దీంతో పేదలకు ఆరు ఇళ్లు మాత్రమే పూర్తయినట్లుగా రికార్డుల్లో నమోదయింది. వచ్చే ఏడాదికి తాము 30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది.