మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నారు. అలానే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా', శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి సినిమాలు చేస్తూనే.. రీసెంట్ గా సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి 'రావణాసుర' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. నవంబర్ 5న ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయనున్నారు.


Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’గా రవితేజ.. వేటకు ముందు నిశబ్దమంటున్న స్టువర్టుపురం దొంగ


ఇవేవీ పూర్తి చేయకుండానే.. తాజాగా మరో సినిమాను ప్రకటించి ఆశ్చర్యపరిచారు రవితేజ. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో 'టైగర్ నాగేశ్వరావు' అనే బయోపిక్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 1970వ సంవత్సరానికి చెందిన స్టువర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావ్ జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 


మొదట ఈ సినిమాను రానాతో చేయాలనుకున్నారు. కానీ స్క్రిప్ట్ పూర్తిగా రెడీ అవ్వకపోవడంతో కుదరలేదు. అటు తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేయాలనుకున్నారు. ఈ కథకు ఆయన ఓకే కూడా చెప్పేశాడు. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. బెల్లంకొండ హిందీ సినిమా 'ఛత్రపతి' షూటింగ్ తరువాత ఈ బయోపిక్ లో నటిస్తారని వార్తలు కూడా వచ్చాయి. 


కానీ ఇప్పుడు బెల్లంకొండ కూడా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకి రైటర్ మురళి అనే వ్యక్తి కథ అందిస్తున్నారు. ముందుగా ఆయన బెల్లంకొండకి కథ చెప్పడంతో.. కేఎస్ అనే డైరెక్టర్ తో సినిమా చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వలన రైటర్ మురళి తన స్క్రిప్ట్ ను పట్టుకొని బయటకు వచ్చేశాడు. అదే కథతో వంశీ ఆకెళ్ల.. రవితేజ హీరోగా సినిమా చేపట్టాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. 



 


Also Read:పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్




 

Also Read: 'అభిమానులు అనాలా..? ఆర్మీ అనాలా..?'.. 'ఆహా 2.0' ఈవెంట్ లో బన్నీ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి