జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాలయ్య నుంచి రెండు పెద్ద అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. అందులో ఒకటి గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించినది కాగా.. మరొకటి అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా అప్డేట్. గోపిచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా నుంచి ఇప్పటికే బాలయ్య లుక్ ని వదిలారు. ఇప్పుడు బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకొని చిన్న టైటిల్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు.
'రెడ్డిగారు' అనే టైటిల్ ను దాదాపు ఖాయం చేసినట్లుగా సమాచారం. ఇదే టైటిల్ ను బాలయ్య బర్త్ డే రోజు అనౌన్స్ చేస్తారట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు.
ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు బాలయ్య. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ తో పాటు బాలయ్య లుక్ ని కూడా జూన్ 10న రివీల్ చేస్తారట. ప్రస్తుతం అనిల్ రావిపూడి.. ఫస్ట్ లుక్ డిజైన్ పై వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇందులో బాలయ్య తన వయసుకి తగ్గ పాత్రలో కనిపిస్తారని సమాచారం. కథ ప్రకారం.. ఆయనకొక కూతురు కూడా ఉంటుందట. ఆ పాత్రలో హీరోయిన్ శ్రీలీల కనిపించబోతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ