ప్రముఖ నటి, రచయిత్రి, బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా హాయిగా ఆటోలో జర్నీ చేశారు. తన కూతురు నితారతో కలిసి సరదాగా ఆటోలో వెళ్లారు.  ఆమెను గమనించి జర్నలిస్టులు ఫోటోలను క్లిక్ అనిపించారు. వారి ఉత్సాహాన్ని చూసి భయ్యా కాసేపు ఆటో ఆపండి అని చెప్పారు. ఫోటోలకు తల్లీ కూతురు ఫోజులిచ్చారు. ఆ తర్వాత ఆటోలో అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు. చాలా కాలం తర్వాత ఆటో ఎక్కడంతో “బహుత్ అచ్చా హువా” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. నితార కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యింది. ఇక ట్వింకిల్ గోల్డెన్ శాండల్స్‌ తో కూడిన కలర్ ఫుల్ డ్రెస్ వేసుకున్నారు. నితార పర్పుల్ టాప్, షార్ట్, స్నీకర్స్‌ లో కనిపించింది. ట్వింకిల్ ఒక బ్యాగ్, ఒక పుస్తకాన్ని కూడా తీసుకెళ్తూ కనిపించారు. చేతిలో ఒక పర్సు ఉంది. 






నితార ట్వింకిల్, అక్షయ్ కుమార్‌ చిన్న కూతురు. కొడుకు పేరు ఆరవ్. ఇటీవల, ట్వింకిల్ తన 48వ పుట్టిన రోజును తన కుటుంబ సభ్యలతో కలిసి జరుపుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో తన బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఈ సందర్భంగా "నేను చాలా ఇష్టపడే వ్యక్తులందరితో పరిపూర్ణ పుట్టినరోజు జరుపుకున్నాను. మీ అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని చెప్పారు. 


2015లో రచనా రంగంలోకి అడుగు పెట్టిన ట్వింకిల్


2001 వరకు సినిమాల్లో నటించిన ట్వింకిల్ ఖన్నా ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత రచయిత్రిగా మారారు. 2015లో ఆమె తన తొలి పుస్తకం ‘Mrs ఫన్నీబోన్స్‌’ను విడుదల చేసింది.  ట్వింకిల్ 2017లో ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ అనే కథా సంకలనాన్ని రాశారు. ఆ తర్వాత ‘పైజామా ఆర్ ఫర్గివింగ్’ అనే మరో పుస్తకాన్ని విడుదల చేశారు.


‘రామ్ సేతు’తో సూపర్ హిట్ అందుకున్న అక్షయ్


అటు  అక్షయ్ ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘రామ్ సేతు’లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర హిట్ అందుకుంది. ప్రస్తుతం తను ‘సెల్ఫీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అక్షయ్‌తో పాటు, ఇమ్రాన్ హష్మీ, డయానా పెంటీ, నుష్రత్ భరుచ్చా  నటిస్తున్నారు. నిర్మాత రాజ్ మెహతా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


Read Also: అంతకాలం ఇండస్ట్రీలో ఉండటం చిన్న విషయం కాదు, అదే తన అసలు లక్ష్యమన్న నయనతార