Maamagaru serial: బుల్లితెరపై సీరియల్స్ హవా మామూలుగా లేదని చెప్పాలి. అన్ని ఛానల్స్ లలో సీరియల్స్ బాగా దూసుకుపోతున్నాయి. కేవలం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు సైతం సీరియల్స్ కు అతుక్కుపోతున్నారు. సీరియల్ సమయం ప్రారంభం అవ్వగానే ఆ సమయంలో ఎన్ని పనులు ఉన్నా వాయిదా వేసేస్తున్నారు. అంతలా సీరియల్స్ కు అడిక్ట్ అవుతున్నారు ప్రేక్షకులు.
కానీ అన్ని సీరియల్స్ లో ఒకే కథ అని చెప్పాలి. ఒకరికి ఇద్దరు అన్నట్లు.. అంటే ఒక మగాడి కోసం ఇద్దరు ఆడవాళ్లు. చాలావరకు సీరియల్స్ ఇటువంటి కంటెంట్ తోనే నడుస్తున్నాయి. ఎక్కడో కొన్ని చదువు, ప్రేమ, పరువు, బాధ్యత వంటివి కనిపిస్తున్నాయి. ఇక చాలావరకు ఇటువంటి కథలకే ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు సీరియల్ డైరెక్టర్లు ఇప్పుడిప్పుడే మంచి కథలతో ముందుకు వస్తున్నారు.
అటువంటిదే మామగారు సీరియల్ అని చెప్పాలి. నటి సుహాసిని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సీరియల్ త్వరలో స్టార్ మా లో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం స్టార్ మా లో వస్తున్న సీరియల్స్ అన్ని ఏవి చివరి దశలో ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే మామగారు సీరియల్ ప్రోమో రావడంతో ప్రేక్షకులు ఏ సీరియల్ ముగుస్తుందో అని కంగారు పడుతున్నారు. కానీ ఏ సీరియల్ ముగింపు దశకు వస్తుందన్న హింట్ మాత్రం కనిపించడం లేదు.
కానీ ఒకింత మామగారు ప్రోమో చూడడంతో ఈ సీరియల్ పై కాస్త ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించింది. కారణం ఏంటంటే ఈ సీరియల్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది కాబట్టి. ఇప్పటివరకు ఇటువంటి కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు రాలేదని చెప్పాలి. అయితే ఆ ప్రోమోలో కథ గురించి చూపించిన విధానం ఏంటంటే.. అదొక ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంలో మామగారు ఏది చెబితే అదే వినాలి.
కొడుకులు, కోడళ్లు, భార్య, కూతురు చివరికి మనవళ్లు కూడా ఆయన చెప్పిందే వినాలి. అయితే ఈ ఇంట్లోకి సుహాసిని చిన్న కోడలిగా అడుగుపెడుతుంది. తను పుట్టింట్లో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని పోషించటానికి తను ఉద్యోగం చేసేది. ఇక అత్తారింట్లో అడుగుపెట్టగా తన పుట్టింటి కోసం ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఆ విషయాన్ని తన భర్తకు చెప్పగా తన భర్త కూడా తనకు సపోర్టుగానే ఉంటాడు.
కానీ ఆ భర్త కూడా తన భార్య ఉద్యోగం గురించి తన తల్లికి చెప్పటానికి భయపడతాడు. కేవలం తనే కాదు ఇంట్లో వాళ్ళు కూడా ఏది అడగాలన్నా కూడా భయపడతారు. అయితే సుహాసిని తన మామయ్య దగ్గరికి వెళ్లి తన ఉద్యోగం చేస్తాను అనడంతో.. ఇంట్లో ఇంతమంది మగవాళ్ళు పనిచేస్తున్నాక ఉద్యోగం ఏంటి అని అడగటంతో తన పుట్టింటి వారి కోసం ఉద్యోగం చేస్తాను అంటుంది.
వెంటనే ఆయన తనపై కసురుకుంటాడు. ఇద్దరు కోడలు పెద్ద పెద్ద చదువులు చదివారని అయిన ఇంట్లో ఉండి సంతోషంగా పనిచేయటం లేదా అంటాడు. అంతేకాకుండా ఈ ఇంట్లో ఆడాళ్ళు ఇంట్లో పనులు చెయ్యడానికే కానీ ఉద్యోగాలు చేసి వెలగపెట్టడానికి కాదు అనటంతో అందరూ భయపడి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కనిపిస్తారు.
ఇక సుహాసిని తన అత్తయ్య దగ్గరికి వెళ్ళగా ఆయన గురించి పట్టించుకోకు అని ఆయన అలాగే ప్రవర్తిస్తాడు అని అంటుంది. దానితో సుహాసిని కేవలం ఆయన అభిప్రాయాలు మాత్రమే అలా ఉన్నాయి.. కాబట్టి మామయ్య గారి అభిప్రాయాలు మార్చుతాను అని అంటుంది. మరి సుహాసిని తన మామ గారి అభిప్రాయాలను మార్చి ఆయనను మంచి మనిషిగా మారుస్తుందా లేదా అనేది చూడాలి.
also read it : Navya Swamy - Ravi Krishna: వాన పాటలో నవ్య స్వామి, రవికృష్ణ - రొమాన్స్ మాములుగా లేదుగా, డ్యాన్స్ షోలో రచ్చ రచ్చ!