Vishnu Priya Bhimeneni Comments On Instagram Subscription: ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వెనకేసుకుంటున్న అందాల భామలు ఎంతో మంది ఉన్నారు. అందులో యాంకర్, నటి విష్ణుప్రియా భీమనేని ఒకరు. ఇన్‌స్టాలో తన అకౌంట్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న నెటిజనులకు బోల్డ్, ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు & వీడియోలు షేర్ చేస్తున్నారు. దాంతో ఆవిడపై కేసులు పెట్టడం వంటివి జరిగాయి. ఓ విధంగా ఆ వివాదం ఆమెకు హెల్ప్ అయ్యింది. సబ్‌స్క్రైబర్స్ సంఖ్య వివాదం తర్వాత పెరిగింది. ఇప్పుడు తన ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ గురించి విష్ణుప్రియా భీమనేని చేసిన ఓ కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Continues below advertisement

అక్కా, రేటు తగ్గించు... కుదరదు తమ్ముడూ!''అక్కా... సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించండి. నేను, మా ఫ్రెండ్స్ జాయిన్ అవుతాం. మాకు ఉద్యోగాలు లేవు. ప్లీజ్'' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అతడికి ''అయ్యో... సరే. దయచేసి చదువుకో. డోంట్ వెస్ట్ మనీ (డబ్బులు వృథా చేసుకోకు)'' అని విష్ణుప్రియా భీమనేని రిప్లై ఇచ్చారు.

Also Read: Arya Criminal Case - హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?

Continues below advertisement

ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదని విష్ణుప్రియా భీమనేని పరోక్షంగా చెప్పినట్టు అయ్యింది. ప్రజెంట్ ఆమె రిప్లై నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇన్‌స్టాలో విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్లు ఎంతమంది?Vishnu Priya Bhimeneni Income Through Instagram Subscription: ఇప్పుడు విష్ణుప్రియా భీమనేని మీద ఎటువంటి వివాదం లేదు. నిజానికి సోషల్ మీడియాలో ఆమె ఒక్కరే కాదు... ఈ విధంగా సబ్‌స్క్రైబర్లకు ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ కంటెంట్ షేర్ చేసున్న వ్యక్తులు ఇంకొంత మంది ఉన్నారు. ప్రస్తుతం విష్ణుప్రియ ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న నెటిజనుల సంఖ్య 6700. ఒక్కొక్కరి నుంచి 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే నెలకు జనాలు కట్టే అమౌంట్ 26 లక్షలకు పైగా. ఎలా లేదన్నా అందులో విష్ణుప్రియకు 15 లక్షలకు పైగా వస్తుందని సమాచారం.

Also ReadLenin Box Office Collection Day 2 - 'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్

డిజిటల్ యుగంలో సెలబ్రిటీలకు నెగటివ్ పబ్లిసిటీ కూడా హెల్ప్ అవుతోంది. ఓ ఆదాయ వనరుగా మారుతోంది. కేసులు, కాంట్రవర్సీ లేకపోతే విష్ణుప్రియ భీమినేని సబ్‌స్క్రిప్షన్ అంత మంది తీసుకునేవాళ్ళు కాదు. అందులో మరో సందేహం అవసరం లేదు. విష్ణుప్రియ ఇన్‌కమ్ సోర్స్ ఇదొక్కటే కాదు... టీవీ షోలు కూడా చేస్తున్నారు. అలాగే, అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లోనూ నటిస్తున్నారు. విష్ణుప్రియా భీమనేని ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ మీద కేసులు రావడంతో అనన్యా నాగళ్ళ, పాయల్ రాజ్ పుత్ వంటి అందాల భామల బోల్డ్ కంటెంట్ కోసం అయితే తమను సబ్‌స్క్రైబ్ కావొద్దని వీడియోలు విడుదల చేశారు. విష్ణుప్రియ తర్వాత అందాల భామలు జాగ్రత్త పడ్డారని చెప్పడానికి అదొక ఉదాహరణ. 

Also Read: Rohit Chandel Arrested - మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్