బాక్సాఫీస్ బరిలో అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' దూకుడు చూపిస్తోంది. మొదటి రోజుతో పోలిస్తే... రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయ్. సినిమాకు క్రిటిక్స్ నుంచి హిట్ టాక్ రావడంతో పాటు ఫ్యాన్స్, ప్రేక్షకులకు నచ్చడంతో బాక్స్ ఆఫీస్ బరిలో భారీ నంబర్లు నమోదు చేసింది. రెండు రోజుల్లో అఖిల్ అక్కినేని సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Continues below advertisement

రెండు రోజుల్లో 'లెనిన్' @ 23.40 కోట్లుLenin Movie Day 2 Collection India Net: 'లెనిన్' సినిమాకు మొదటి రోజు రూ. 9.73 కోట్ల గ్రాస్ వచ్చింది. అటు ఇటుగా 10 కోట్లు చేసింది. రెండో రోజు పది కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇండియాలో ఎన్ని కోట్లు వచ్చాయి? ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...

  • 'లెనిన్' సినిమాకు రెండో రోజు ఇండియాలో రూ. 8.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు కలెక్షన్లు రూ. 7.15 కోట్ల నెట్‌తో కంపేర్ చేస్తే... 14 శాతం గ్రోత్ కనిపించింది.
  • రెండు రోజుల్లో 'లెనిన్' ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 15.30 కోట్లు. గ్రాస్ విషయానికి వస్తే... రూ. 17.60 కోట్లు.
  • ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే... రెండో రోజు విదేశాల్లో 'లెనిన్'కు రూ. 2.50 కోట్ల గ్రాస్‌ వచ్చింది. దాంతో రెండు రోజుల ఓవర్సీస్ గ్రాస్ రూ. 5.80 కోట్లకు చేరుకుంది.
  • ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 23.40 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది. వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 40 కోట్ల క్లబ్బులో చేరడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల టాక్.

Also Read: S Janaki Death Reason - Health Bulletin - జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?

Continues below advertisement

తెలుగు రాష్ట్రాల్లో 'లెనిన్' బ్లాక్ బస్టర్ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే... చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కించిన 'లెనిన్'ను తెలుగులో విడుదల చేశారు. వసూళ్లలో కూడా ఏపీ, తెలంగాణ నుంచి మేజర్ కలెక్షన్స్ వస్తున్నాయి. రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్ణాటక నుంచి రూ. 1.10 కోట్లు, తమిళనాడులో రూ. 13 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో మరో రూ. 15 లక్షల గ్రాస్ వచ్చింది. థియేటర్లలో శనివారం నాడు ఆక్యుపెన్సీ (60.27 శాతం) కూడా బావుంది. 

Also ReadS Janaki Death - Celebs Reaction: జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్

మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించిన 'లెనిన్'లో అఖిల్ అక్కినేని జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. తమన్ సంగీతం అందించారు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన అఖిల్... సాలిడ్ సక్సెస్ కొట్టారు. ఈ సినిమా విజయం నాగార్జునకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పడానికి సక్సెస్ మీట్ లో ఆయన పెట్టుకున్న కన్నీళ్ళే ఉదాహరణ.

Also Read: Naga Chaitanya Upcoming Movies - హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య... రెండు కథలు లైనులో పెట్టిన అక్కినేని హీరో?