బాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కొంత మంది నటీనటులు చట్టపరమైన చిక్కుల్లో పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ (Rajpal Yadav)కు మూడు నెలల జైలు శిక్షపడింది. అది మరువక ముందు మరొక నటుడు వేధింపుల కేసులో అరెస్ట్ కావడం సంచలనం అయ్యింది. హిందీ టీవీ యాక్టర్ రోహిత్ చందేల్ అరెస్ట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

మైనర్ బాలికపై వేధింపులు...పోక్సో కేసులో రోహిత్ అరెస్ట్!Rohit Chandel Arrested Under POCSO: హిందీ సీరియళ్ళు చూసే తెలుగు ప్రేక్షకులకు రోహిత్ చందేల్ తెలిసి ఉండొచ్చు. 'కాశీబాయి బాజీరావు బల్లాల్', 'పాండ్యా స్టోర్', 'సైరాబ్' వంటి టీవీ సీరియల్స్‌లో మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన్ను పోక్సో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబై టీవీ ఇండస్ట్రీలో యాక్టర్ రోహిత్ చందేల్‌ పాపులర్. ఇప్పుడు ఆయనకు 19 ఏళ్ళు. పదహారేళ్ళ మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడినందుకు, అలాగే ఆమెను వెంబడించినందుకు రోహిత్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ వార్త హిందీ టీవీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

Continues below advertisement

Also Read: Hrudayam Murali Review - 'హృదయం మురళి' రివ్యూ... నటుడిగా తమన్ రీ ఎంట్రీ... అథర్వ, ప్రీతి ముకుందన్ సినిమా ఎలా ఉందంటే?

ముంబై పోలీసుల కథనం ప్రకారం... రోహిత్ చందేల్ మీద ముంబై ఈస్ట్ శివారు ప్రాంతానికి చెందిన బాలిక ఫిర్యాదు చేశారు. తనకు మొబైల్ నుంచి పదేపదే ఫోన్లు చేసేవాడని, వద్దని ఎంత చెప్పినా వినకుండా తరచూ వివిధ ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ చేసేవాడని, వేధించేవాడని మైనర్ బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాదు... జూలై 5వ తేదీన తనను ఇంటి దగ్గరలో వెంబడించాడని, మైనర్ బాలిక ఇంటికి వెళుతున్న సమయంలో ఆమెను అడ్డుకుని అసభ్య పదజాలంతో దూషించాడని, అలాగే భౌతిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయితో రోహిత్‌కు ముందు నుంచి పరిచయం ఉన్నదని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.

Also ReadAkhil Akkineni Lenin Review - 'లెనిన్' సినిమా రివ్యూ: అఖిల్ అక్కినేని సినిమా ఎలా ఉందంటే? హిట్టు కొట్టారా?

తనను వేధించాడని మైనర్ బాలిక ఫిర్యాదు చేయడంతో రోహిత్ చందేల్‌ మీద 'పోక్సో - ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్' (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారుముంబై పోలీసులు. సెక్షన్ 78 (స్టాకింగ్), సెక్షన్ 115(2) కింద కూడా కేసులు నమోదు చేశారు. శుక్రవారం (జూలై 10న) ముంబైలోని దహిసర్‌ ప్రాంతంలో గల రోహిత్ చందేల్ నివాసంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్పెషల్ పోక్సో కోర్టులో హాజరు పరిచారు. పోలీస్ కస్టడీకి  కోర్టు అనుమతించింది.

రోహిత్ చందేల్ యాక్టర్ మాత్రమే కాదు... క్రికెటర్ కూడా! మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రొఫెషనల్ క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో కూడా పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉంది.

Also Read: Thamizh Murugan Vs God of War - ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?