Trinayani Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో విశాలాక్షి గాని జీవన్ కానీ ఇటువైపు వస్తే ఎలర్ట్ గా ఉండమని చెప్పాలి కదా అంటాడు హాసిని భర్త.


విశాల్: అవునన్నయ్య ఎవరు కనిపించినా చెప్పండి మేము కూడా చూస్తాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


ఎలా చూడాలో నేను చెప్తాను అంటూ హాసిని కూడా విశాల్ ని ఫాలో అవుతుంది.


తిలోత్తమ్మ వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు పాములు వాడు దిగులుగా కూర్చుని ఉంటాడు అటువైపుగా జీవన్ వస్తాడు.


జీవన్ : ఎందుకు అలా కూర్చున్నావు అని పాములవాడిని అడుగుతాడు.


పాములవాడు : బేరం వచ్చింది కానీ వాళ్లే రాలేదు అంటాడు.


జీవన్ : అతనికి 500 ఇచ్చి ఉంచుకో అంటాడు పాములవాడు వద్దంటున్నా అప్పు కాదు సాయం అనుకో అని అతనికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు.


ఇదంతా తిలోత్తమ వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు.


వల్లభ: వాళ్ళు ఇద్దరు ఏంటి మాట్లాడుకుంటున్నారు., చంపవలసింది వాడినే కదా అంటాడు.


తిలోత్తమ: పాములు వాడికి చంపమని చెప్పాము కానీ చంపాల్సిందే వాడినే అని పాములోడికి తెలియదు అంటుంది.


జీవన్ వెళ్ళిపోయిన తర్వాత తిలోత్తమ వాళ్ళు పాములవాడి దగ్గరికి వచ్చి నువ్వు చంపవలసిందే వాడినే అంటారు. అయ్యో అవునా అంటాడు పాములవాడు.


మరోవైపు పూజ చేస్తున్న నయనిని నువ్వు ఏదో చేస్తావనుకుంటే పూజ చేస్తున్నావేంటి అని అడుగుతుంది సుమన.


విక్రాంత్ : పూజ చేస్తే యుక్తి వస్తుంది అనటంతో నయన బాగా చెప్పావు అంటుంది.


ఇవన్నీ దూరం నుంచి గమనిస్తూ ఉంటారు ఎద్దులయ్య, విశాలాక్షి.


ఎద్దులయ్య: ఇప్పుడు నిజం చెప్పేస్తే అతను చనిపోతాడు కదా


విశాలాక్షి : ఎవరికి ఎలాంటి హాని జరగకూడదు అని నయని నన్ను కోరుకుంది.


ఎద్దులయ్య: ఏం చేస్తావో అంతా నీదే భారం.


విశాలాక్షి : తిలోత్తమ వాళ్ళు నన్ను ఏం చేసినా నువ్వు ఏమి అనొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళుతుంది. 


జీవన్ అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటాడు. అప్పటికే నయని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి వెనకగా దాక్కుంటారు.


నయని: జీవన్ దగ్గరికి వచ్చి అతనికి రాఖీ కడుతుంది. మీ చెల్లెలు నీకు రాఖీ కట్టి నిజం చెప్పమని అడుగుతుంది నిజం చెప్పు అన్న నా కూతురు ఎక్కడ అంటుంది.


మరోవైపు నుంచి ఇదంతా హాసిని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు.


హాసిని: సెంటిమెంట్తో కట్టేసిందే ఇక జీవన్ నిజం చెప్పేస్తాడు.


విశాల్: నిజం చెప్తే అతను రక్తం కక్కుకొని చస్తాడు అని కంగారుగా అంటాడు.


అదే సమయంలో తిలోత్తమ వాళ్ళు పాములు వాడిని తీసుకొని అక్కడికి వస్తారు.


వల్లభ: వాడు నిజం చెప్పేస్తాడేమో ఈలోపు పాము వాడి మీదకి విసిరెయ్ అని పాములవాడికి చెప్తాడు.


మరోవైపు


జీవన్: చచ్చు పడిపోయేలా చేసిన ఈ చేతికి జీవం పోసావు అందుకోసమైనా నిజం చెప్తాను కానీ నేను నిజం చెప్తే రక్తం కక్కుకొని చస్తాను అంటాడు.


అదే సమయంలో పాములవాడు పాము విసిరితే అది ఎవరి మీద అయినా పడొచ్చు అంటాడు.


తిలోత్తమ: నయన మీద పడినా కూడా పర్వాలేదు అంటుంది.


వెనకగా వచ్చిన విశాలాక్షి సుమన మీద పడినా కూడా పర్వాలేదా అంటుంది.


విశాలాక్షి చూసేసింది అని భయపడతాడు హాసిని భర్త అదేం చేస్తుందిలే నువ్వు పాము విసురు అనేసరికి పాములు వాడు పాముని జీవన్ మీదకి విసిరితాడు. పాము కాస్తా పూలదండగా మరి జీవన్ మెడలో పడుతుంది.


అందరూ షాక్ అవుతారు.


విక్రాంత్: ఈ పూలదండ వచ్చి ఎలా పడింది.


నయని: నీకు ఎలాంటి ప్రాణహాని జరగదు అని చెప్పడానికే అమ్మవారు ఇలా చేసి ఉంటుంది దయచేసి నిజం చెప్పన్న అంటుంది.


అదే సమయంలో


విశాలాక్షి: నీ పని అయిపోయింది ఇక నువ్వు వెళ్ళు అని అనటంతో పాములవాడు భయంతో పారిపోతాడు.


తిలోత్తమ: ఈ గారడీ పిల్లే ఏదో చేసి ఉంటుంది అని విశాలాక్షి నోరు నొక్కేసి ఆమె కాళ్లు చేతులు పట్టుకుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు తల్లి కొడుకులు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.