Trinayani Serial Today Episode నయని పెట్టెలోని పేపర్లు తీసుకుంటుంది. నయనితో పాటు గురువుగారు కూడా మణికాంత ప్రాంతానికి బయల్దేరుతారు. అందరూ నయనిని పంచకమణిని తీసుకురమ్మని చెప్తారు. ఇక సుమన అయితే గురువుగారు తిరిగి రాకపోయినా పర్లేదు నువ్వు మాత్రం పంచకమణి తీసురా అని అంటుంది. సుమన మాటలకు విక్రాంత్ తిడతాడు. ఇక నయని విశాల్ దగ్గరకు వెళ్లి నీ కుడి చేయి నా చేతిలో పెట్టి ఆల్‌ ది బెస్ట్ చెప్పమని అంటుంది. విశాల్ చేయి లేపలేకపోతాడు. గాయత్రీ పాప వచ్చి తండ్రి చేయి పట్టుకొని తల్లి చేతిలో చేయి పెట్టి ఆల్‌దిబెస్ట్ చెప్పిస్తుంది. నయని చాలా సంతోషిస్తుంది. అందరూ గాయత్రీ పాపని పొగుడుతారు. నయని గాయత్రీ పాపకి జాగ్రత్తలు చెప్తే గాయత్రీ పాప నయనికి ముద్దు పెడుతుంది. ఇక నయని ఎమోషనల్‌ అవుతూనే గడప దాటుతుంది.


 విక్రాంత్: వదిన మనల్ని వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. తొందరగా తెల్లారితే బాగున్ను.
విశాల్: అవునురా ఈ తొమ్మిది గంటలు ఎలా గడుస్తాయో ఏంటో.
తిలోత్తమ: నిండు చంద్రుడు కురుపిస్తున్న ఈ పండు వెన్నెల నయని వెళ్లిన చోట కూడా ఉండాలి వల్లభ. లేదంటే అక్కడికి వెళ్లిన ఇరవై నిమిషాల వరకు చంద్రున్ని ఏ మేఘం అయినా కప్పేసిందే అనుకో మళ్లీ పౌర్ణమి వరకు ఆగాల్సిందే
వల్లభ: ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయేంటి మమ్మీ.
తిలోత్తమ: అందుకే కదా మనం వెళ్లలేదు. నయని పంచమకమణి తీసుకు వచ్చిందనుకో దాన్ని మనం తెలివిగానో బలవంతంగానో తీసుకున్నామనుకో.
వల్లభ: అప్పుడు మనం ఇంకా కోటీశ్వరులం అయిపోవచ్చు. మమ్మీ నాకు ఇంకో అనుమానం నయని పంచకమణిని తీసుకురాలేకపోయిందే అనుకో.
తిలోత్తమ: విశాల్ ప్రాణం పది రోజుల్లో పోవచ్చు. అక్కడికి వెళ్లిన తర్వాత నీటి దీపం నయని వెలిగించకపోతే అఖండ పాము నయనిని చంపేస్తుంది.
వల్లభ: పాములు నయనిని ఏం చేయవు కదా మమ్మీ.
తిలోత్తమ: అక్కడుండేది నాగయ్య పాము కాదురా, క్షేత్ర పాలకుడైన అఖండ సర్పం.
వల్లభ: నయని పోతే విశాల్ బతకడు విశాల్ పోతే నయని బతకదు. పిల్లలు అనాథలైపోతారమ్మా. అసలు నయని పంచకమణి తీసుకురాకపోయినా మనకేలాభం. మమ్మీ మనం పంచకమణి తీసుకుంటే గజగండకి కోపం రాదా.
తిలోత్తమ: గజగండ గాడిద గుడ్డా పని అయినాక ముంచేయడమే.


నయని, గురువుగారు మణికాంత ప్రాంతానికి వెళ్తారు. చుట్టూ చీకటిగా ఉంటుంది. మరోవైపు విశాల్ తన తల్లి ఫొటో దగ్గరకు వచ్చి నీ కోడలు మానసాదేవి ఆలయానికి వెళ్లిందని, అక్కడికి చేరుకోవడం చాలా కష్టమని చిన్నప్పుడు నువ్వు వెళ్లావ్ ఇప్పుడు నయని పంచకమణి తీసుకురాకపోతే నా చేయి నయం కాదని నువ్వు కూడా చెప్పావ్. నయని నా బాధ చూస్తూ  పౌర్ణమి వరకు తట్టుకుంది కానీ నువ్వు ఏడిస్తే తట్టుకోలేకపోయిందని అంటాడు. నయని, గురువుగారు నిప్పుల కొలిమిలా ఉన్న ప్రాంతానికి చేరుతారు. అగ్ని కీలలతో ఉన్న నదిని చేరుతారు.  అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. విశాల్ గాయత్రీ దేవి ఫొటో చూడటం చూస్తారు.


వల్లభ: తంబి నయని మరదలు ఫొటో చూస్తాడు అనుకుంటే తన తల్లి ఫొటో చూస్తున్నాడు.
తిలోత్తమ: నయని ఉదయం వచ్చేస్తుంది. పసి బిడ్డగా ఉన్న తన తల్లి మాత్రం రెండేళ్లు అయినా ఇంకా రాలేదని దిగులు విశాల్‌లో ఉందిరా అందుకే అక్కయ్య ఫొటో చూస్తున్నాడు. ఎన్నో ఆటంకాలు దాటుకొని వెళ్తే తప్ప పంచకమణి ఉన్న చోటుకి చేరలేం అని చెప్పారు కదా.
గురువుగారు: పున్నమి వెన్నెల కనిపించడం లేదు అంటే వెన్నెల పూర్తిగా ఇక్కడ ప్రసరించడం లేదు.
నయని: పేపర్లు చూసి.. రేచుక్క మారుతున్నట్లు ఇక్కడ ఉంది అంటే పశ్చిమ నుంచి తూర్పునకు వస్తుందా. 


ఆకాశంలో ఓ చుక్క వచ్చి చందమామ కనిపించేలా చేస్తుంది. దాంతో నిప్పుల నది తొలగి మంచి మార్గం వస్తుంది. మానస దేవి గుడిలోకి నయని, గురువుగారు వెళ్లగలగుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మ శవం కాల్చేందుకు డబ్బులు అడుక్కున్నా... బిగ్ బాస్‌లో ఏడ్చేసిన నాగమణికంఠ!