Bigg Boss 8 Naga Manikanta: అమ్మ శవం కాల్చేందుకు డబ్బులు అడుక్కున్నా... బిగ్ బాస్‌లో ఏడ్చేసిన నాగమణికంఠ!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆరంభం నుంచి రచ్చ రచ్చగా సాగుతోంది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఒకర్ని మించి మరొకరు ఫైర్ అయ్యారు. నామినేషన్స్ లో ఎక్కువగా టార్గెట్ అయింది నాగ మణికంఠ..
iబిగ్ బాస్ హౌజ్ లో మూడో రోజు అంటూ రిలీజ్ చేసిన ప్రోమోలో నాగమణికంఠ చాలా ఏమోషనల్ అయిపోయాడు. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన బాధలన్నీ తోటి కంటెస్టెంట్స్ తో చెప్పుకుంటూ ఏడ్చేశాడు...
నేను చావు వరకూ వెళ్లొచ్చాను మీకు తెలియదు... చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను..తల్లి మరో పెళ్లి చేసుకుంటే... పెంపుడు తండ్రి నుంచి అవమానాలు ఎదుర్కొన్నాను.. తల్లి చనిపోయినప్పుడు శవం కాల్చేందుకు కూడా డబ్బుల్లేక అడుక్కున్నానని తన బాధలన్నీ ఏకరువు పెట్టాడు
అయితే నాగమణికంఠ సింగిల్ గా ఉండాలనుకున్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని.. పెంపుడు తండ్రి అమర్నాథ్ తనని బాగానే చూసుకున్నారని సోదరి కావ్య చెప్పుకొచ్చింది...
షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగమణికంఠ ఇప్పుడిప్పుడే సీరియల్స్ లో సత్తాచాటాలనుకుంటున్నాడు. ఇంతలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు హౌస్ లోకి అడుగుపెట్టాడు...
బిగ్ బాస్ సీజన్ 08 నాగ మణికంఠ(Image Credit: Naga Manikanta/ Instagram
బిగ్ బాస్ సీజన్ 08 నాగ మణికంఠ(Image Credit: Naga Manikanta/ Instagram