Bigg Boss Telugu 8 Heated Nominations Promo : బిగ్‌బాస్ హౌజ్‌లో నామినేషన్స్ నిన్న కొట్టుకునే రేంజ్లో జరిగితే.. ఈరోజు ఎపిసోడ్లో మాత్రం ఎమోషనల్‌గా మారాయి. ముఖ్యంగా నాగమణికంఠ నిన్న ఓ రేంజ్లో సీరియసై.. ఈరోజు మాత్రం ఏడుస్తూ.. అందరినీ ఏడిపించేశాడు. ఇంతకీ హౌజ్‌లో ఇంకెవరి నామినేషన్స్ మిగిలాయి. ఏ రీజన్ మీద ఎవరు నామినేట్ చేశారు. బిగ్‌బాస్ హౌజ్‌లో డే 3 ప్రోమోలో ఏముంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డు పంచాయతీ..
కిరాక్ సీత.. బేబక్కను నామినేట్ చేసింది. వీరి మధ్య కిచెన్ లొల్లి మొదలైంది. ఒక కూర మధ్యాహ్నం, ఒక కూర రాత్రి అనుకున్నాము అంతే.. కానీ నిన్న రాత్రి మీరు రెండు కూరలు చేశారంటూ సీత తెలిపింది. రెండు కూరలు చేయలేదు అంటూ బదులిచ్చిన బేబక్కకి.. రెండు కూరలు చేశారు.. ఒకటి చికెన్ ఒకటి ఆలూ అంటూ రిప్లై ఇచ్చింది సీత. దీంతో బేబక్క వెజిటేరియన్స్ ఉన్నారు వాళ్లు నాన్‌వెజ్ తినరు అంటూ తెలిపింది. ఒకటే గుడ్డు.. నాది అది దానితో నేను బుర్జి చేసుకుంటాను అంటే మీరు ఎందుకు నో అన్నారని సీత ప్రశ్నించింది.
రెస్పాన్స్‌బులిటీ తీసుకుని.. పవర్‌ని ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు తీసుకోవద్దు. అంతే జోవియల్‌గా, జోకులేసుకుని చిల్ కొట్టు అంటూ విష్ణుప్రియను ఉద్దేశించి చెప్పింది సోనియా. అభయ్ నవీన్ వచ్చి.. హైపర్ ఒకసారి అవ్చొచ్చు. బట్ సెకండ్ టైమ్ కనీసం ఆలోచించి మాట్లాడితే ఈ హౌజ్‌కు మంచిదని చెప్పాడు. దానికి నాగమణికంఠ సీరియస్‌గా రిప్లై ఇచ్చాడు.
నా మొహమే అంతా..
మీరు ఆదిత్య అన్నకి ఒత్తాసుగా వచ్చి నాకు చెప్తున్నప్పుడు నో అంటున్నప్పుడు అంటే.. మధ్యలో నవీన్ రిప్లై ఇవ్వడానికి యత్నించాడు. లెట్ మీ టాక్. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఆగాను కదా.. మీరు ఆగండి అంటూ గట్టిగా రిప్లై ఇచ్చాడు. నేను అతనికి వత్తాసు పలకలేదు నేను వచ్చాక ఆయన వచ్చాడు అంటూ నవీన్ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చాడు. ఆయనకు నేను చెప్పిన విధానం ఎలా అర్థమైందో తెలియదు.. ఎందుకంటే నా మొహమే అంతా.. సీరియస్‌గానే కనిపించి ఉంటాదని సమర్థించుకున్నాడు. ఇవేమి తనకి పట్టవన్నట్లు కూర్చోన్నాడు ఆదిత్య.
ఈ వారం వెళ్లేది నువ్వా.. నేనా?
సీత, ప్రేరణ మధ్య ఆర్గ్యూమెంట్ నడించింది. గేమ్‌ని సీరియస్‌గా తీసుకోలేదంటూ సీత ప్రేరణకు చెప్పగా.. నేను సీరియస్‌గా తీసుకోలేదని నువ్వు ఎలా చెప్తావంటూ ప్రేరణ రివర్స్ క్వశ్చన్ వేసింది. మళ్లీ అభయ్, మణికంఠ గొడవ ప్రారంభమైంది. నేను అన్‌ఫిట్ అయితే ఈ వారమే వెళ్లిపోతాను. నేను కూడా వెళ్లిపోవచ్చని అభయ్ నవీన్ చెప్పాడు. అనంతరం మణికంఠ, విష్ణుప్రియ మధ్య వాదన నడిచింది. ఈ మూడురోజులు నీతో కలిసి ఉండడానికి రీజన్ ఏంటంటే.. నువ్వు వర్డ్స్‌ని ఎలా రిలీజ్ చేస్తున్నావో చూస్తున్నానంటూ మణికంఠ తెలిపాడు. ఓహ్ గాడ్ నువ్వు అందుకు నాతో ఈ మూడు రోజులు కలిసి ఉన్నావా? అంటూ అడిగింది విష్ణుప్రియ.
అమ్మ శవం కాల్చడానికి కూడా డబ్బులు లేవు..
శేఖర్ భాష.. మణికంఠ ప్రతీది రాజకీయం చేయడానికి చూస్తున్నాడని కామెంట్ చేశాడు. ఎవరు ఏమన్నా దానిని నీకు ఆపాదించేసుకుని.. నీ గురించి చూపించుకోవడానికి వాడుకున్నావంటూ శేఖర్ తెలిపాడు. ప్రేరణ, మణికంఠ డిస్కషన్లో అతను ఎమోషనలై.. చావు దాక వెళ్లి వచ్చాను నేను. మీరు చూడలేదు. నాన్నని పోగొట్టుకున్నా.. కన్న తండ్రిని పోగొట్టుకున్నాను. స్టెఫ్ ఫాదర్ చులకనగా చూస్తే భరించాను. అమ్మ చనిపోయింది. కాల్చడానికి కట్టెలు పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ శవాన్ని సాగనంపించాను అంటూ ఎమోషనలై.. అందరినీ ఏడిపించేశాడు. దీంతో ప్రోమో ముగిసింది. ఈరోజు ఎపిసోడ్ ఇంకెన్ని ఎమోషన్స్‌ని బయటకు తీస్తుందో ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.