Trinayani Serial Today Episode సుమన విక్రాంత్ దగ్గరకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అని అడుగుతుంది. ఎందుకు అని విక్రాంత్ అడిగినా విషయం చెప్పకుండా అదీ ఇదీ మాట్లాడితే విక్రాంత్ ల్యాప్‌టాప్‌తో ఒక్కటి కొట్టాలి విషయం చెప్తావా అని కోప్పడతాడు. దానికి సుమన గాయత్రీ పాపని ఎత్తుకుపోవడానికి వచ్చిన వాళ్ల మీద కంప్లైంట్ ఇవ్వమని అంటుంది. ఎత్తుకుపోలేదు కదా కంప్లైంట్ ఎందుకులే అని విక్రాంత్ అంటాడు.
విశాల్‌కి ఒక చేయి పని చేయకపోయినా దుప్పట్లో బాగానే పోరాడాడని సుమన అంటే విక్రాంత్ తిడతాడు. వచ్చింది గజగండ, గంటలమ్మలని వాళ్ల విషయం తెలిసి కూడా ఎందుకు రానిచ్చారని పోలీసులు చీవాట్లు పెడతారని విక్రాంత్ అంటాడు. పిల్లలు అందరూ ఉండగా గాయత్రీ పాపని ఎందుకు ఎత్తుకెళ్లి పోవాలనుకున్నారని అంటుంది. ఆ పిల్ల వల్ల జరగరాని వన్నీ జరుగుతున్నాయని ఆలోచించండండి అని అంటుంది.
విక్రాంత్: కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు వాళ్ల దగ్గర పంచకమణి ఉన్నా సరే గాయత్రీ పాప కావాలని వచ్చారంటే ఆ పాప విలువ ఏంటో అర్థం చేసుకో. పిల్లకుందో గాయత్రీ పాప అనే పేరుకు పవర్ ఉందో తెలీదు కానీ పాప కోసం ఎవరైనా సరే దిగి రావాల్సింది. ఈ సారి వస్తే మాత్రం వాళ్ల శవాల్నిఅదే దుప్పటితో కప్పేస్తారు విశాల్ బ్రో, నయని వదినలు.
సుమన: ఈయన మాటల్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే పంచకమణి ఉన్నా సరే పాప కావాలి అనుకున్నారంటే ఇదేదో ఆలోచించాల్సిందే.
రాత్రి నయని ఇంటికి రావడంతో అందరూ జరిగిన విషయం చెప్తారు. గజగండని తిట్టో కొట్టో పంచకమణి తీసుకురమ్మని సుమన అంటుంది. అది అంత ఈజీ కాదని నయని అంటుంది. ఏం చేయాలా అని అందరూ ఆలోచిస్తారు. ఇంతలో గురువుగారు వస్తారు. ఇంటికి ఎవరు వచ్చినా అనుమానించాల్సి వస్తుందని విశాల్‌లా వచ్చిన గజగండ గురించి గురువుగారికి చెప్తారు.
గురువుగారు: మీరు ఎంతగా ఆలోచించినా పరిష్కారం దొరకదు.
నయని: అలా అని ఆ తాంత్రిక శక్తిని ఎదురించలేమా స్వామి.
గురువుగారు: ఇంటి పట్టున ఉంటే పరిష్కారం దొరకదు. నయని మణికాంత గుడికి వెళ్లాలి.
దురంధర: నయనికి వెళ్లాలి అని ఉన్నా దారి తెలియక ఆగిపోయింది.
గురువుగారు: నాగులమ్మకు తెలుసు.
సుమన: పెద్దబొట్టమ్మకి తెలుసా నాకు చెప్పలేదు చూడు దొంగముఖంది.
గురువుగారు: నాగులమ్మ వచ్చింది. గాయత్రీ పాపని ఎత్తుకొని వస్తుంది. గాయత్రీ పాపే చీర లాగిందని పాపని పెద్దబొట్టమ్మ ఏమైనా చేస్తుందేమో అని కంగారు పడి నయని తీసుకుంటుంది.
పెద్దబొట్టమ్మ: నాకు దారి తెలీదు. మళ్లీ ఇప్పుడు మారిపోయి ఉంటుంది కదా. నిజంగా నాకు తెలీదు.
విశాల్: స్వామి పెద్దబొట్టమ్మకి తెలీనప్పుడు బలవంత పెట్టడం తప్పు.
గురువుగారు: నాగులమ్మ పంచకమణి గురించి సుమనకు చెప్పావ్. ఆ గజగండ నయని దగ్గర నుంచి పంచకమణి తీసుకున్నాడే కానీ ఆధిపత్యం సంపాదించలేకపోయాడు. మణి వల్ల అష్టైశ్వర్యాలు పొందొచ్చు కానీ సర్వశక్తులు పొందలేరు. ఆ విషయం గజగండకు తెలీదు.
పెద్దబొట్టమ్మ: నాకు తెలుసు. దారి తెలీదు కానీ పంచకమణితో సర్వశక్తులు పొందాలంటే దానికి తోడుగా ఉంటే భుజగమణిని కూడా తీసుకొస్తేనే సర్వశక్తులు లభిస్తాయి అని తెలుసు. అవును నయని ఆ విషయం గజగండకు తెలీక సతమతం అవుతున్నాడు. అది కానీ తీసుకొస్తే ఈ లోకాన్నే జయించొచ్చు.
సుమన: అవునా ఎక్కడుంది అది.
పెద్దబొట్టమ్మ: మానసాదేవి గుడిలోనే ఉంది. కానీ దాన్ని తీసుకురావడం పంచకమణి తీసుకొచ్చినంత ఈజీ కాదు. శక్తియుక్తులు ఉన్న వాళ్లు కూడా కాలగర్భంలో కలిసిపోయారే తప్ప దాన్ని ఎవరూ గుడి నుంచి బయటకు తీసుకురాలేదు.
విశాల్: దాంతో నా ఆరోగ్యం కుదుట పడుతుందా స్వామి.
గురువుగారు: దానితో ఏమైనా సాధ్యమే పంచకమణితో జత కట్టిస్తే ఏమైనా సాధ్యమే.
దురంధర: అక్కడికి ఎలా వెళ్లాలో ఎలా తెలుస్తుంది.
గురువుగారు: తెలుస్తుంది గాయత్రీ దేవినే చూపిస్తుంది. ఒక్క మాట విశాలా మీ అమ్మ ఆత్మకి కాదు పునర్జన్మ ఎత్తి పసిబిడ్డగా ఉన్న పాప దారి చూపాలి.
వల్లభ: ట్విస్ట్ అదిరిపోయింది. పునర్జన్మలో ఉన్న పెద్దమ్మ దారి చూపిస్తే పసిబిడ్డగా ఉన్న తను ఎవరో మనకు తెలిసిపోతుంది కదా.
నయని: బావ గారు అన్నది నిజమే.
విక్రాంత్ భుజంగ మణి గురించి ఆలోచిస్తూ ఉంటే సుమన తన సలహా ఇస్తుంది. విక్రాంత్ సుమన సలహాని పొగిడి ఆ మణిని మనమే ముందు దక్కించుకుందామని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రూపని కాపాడిన రాజు.. శ్వేత, హర్షలు సీఎంని చంపేస్తారా!