Trinayani Serial Today Episode తిలోత్తమకి కొత్త నెంబరు నుంచి ఫోన్ వస్తుంది. వల్లభ మాట్లాడుతాడు. ఆమె వల్లభని ఓరేయ్ మీ అమ్మకి ఫోన్ ఇవ్వురా అని అంటుంది. ఇక వల్లభ తిలోత్తమకి ఫోన్ ఇస్తాడు. బాగున్నావా? నా గొంతు గుర్తు పట్టలేదా? అని అడుగుతుంది. దాంతో తిలోత్తమ నువ్వు ఎవరో తెలీదు అంటే నన్ను నువ్వు మర్చిపోయావు అంటే రేపే నేను నీకు నా ముఖం చూపిస్తాను నీ ముఖం నేను చూస్తాను. రేపే ఇంటికి వస్తానని అంటుంది.


విక్రాంత్: ఎవరు అమ్మా.
తిలోత్తమ: తెలీదు నేను ఎవరో తెలిసినట్లు నువ్వు అని మాట్లాడుతుంది. రేపు ఇంటికి వస్తుందట. 
విక్రాంత్: ఆ ఫోన్ కాల్ వల్ల అమ్మ ఆలోచనలో పడింది. 
వల్లభ:  వచ్చింది ఎవరో మరి.
తిలోత్తమ: చూస్తా రేపు ఎవరు వస్తారో. 


ఉదయం అందరూ ఆ అతిథి కోసం ఎదురు చూస్తుంటారు. తిలోత్తమ చాలా కంగారు పడుతుంది. ఫోన్ కాల్ గురించి హాసిని విశాల్‌తో చెప్తుంది. ఇంతలో ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. టెడ్టీబేర్ పట్టుకొని అహల్య తిలోత్తమ ఇంటికి వస్తుంది. గాయత్రీ పాప నీ కోసమే తీసుకొచ్చానని బొమ్మ ఇస్తుంది. అలేఖ్యని చూసి అందరూ చాలా సంతోషిస్తారు. 


నయని: అమ్మగారు ఎంత కాలం అయింది మిమల్ని చూసి.
అహల్య: అమ్మగారు అనకు నయని చక్కగా అత్తయ్య అని పిలు.  
విశాల్: పిన్ని ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ చెప్పకుండా వెళ్లిపోయావ్.
అహల్య: చెప్తా నాన్న తన రూపం మారింది కానీ తాను చేసిన పాపం మాత్రం మారలేదని తిలోత్తమ తెలుసుకుందో లేదో అని వచ్చాను.
తిలోత్తమ: నేనేం చేశానని అలా అంటున్నావ్ అలేఖ్య
అహల్య: ఎవరికో ఏదో చేశావని నేను అనను కానీ నా వరకు చేసింది చాలు నువ్వు ఎలాంటిదో చెప్పడానికి.
హాసిని: మీకు అన్యాయం చేసిందన్నమాట. చిట్టీ అలేఖ్య అత్తయ్య నీకు ఎవరో తెలీదు కదా తను జగదీష్ మామయ్య గారి తమ్ముడి భార్య.
నయని: 5 ఏళ్లలో మా జీవితాల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి అత్తయ్య. ఇంత మంది ఉన్నా సరే మేం సతమతం అయ్యామంటే ఎవరూ లేని మీరు ఇంకెంత ఇబ్బంది పడుంటారో.
అహల్య: ఒంటరి పోరాటం చేశా నయని. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తిరిగి వచ్చాను కానీ నా భర్త ఏమైపోయారో ఇప్పటికీ ఆచూకీ తెలీదు. 
విశాల్: పిన్ని బాబాయ్ మిస్సింగ్ కేసు ఇంకా అవుతూనే ఉంది.
తిలోత్తమ: ఏదో ఒక రోజు చిన్న బావగారు తిరిగి వచ్చేస్తారు అనుకుంటా.
అహల్య: రారు తిలోత్తమ. ఎందుకు అంటే మా ఆయన బతికి ఉన్నారో లేదో కూడా తెలీదు. ఒకవేళ కన్న మూసినా పునర్జన్మ ఎత్తి ఈ ఇంట్లో ఉండటానికి ఆయనేమీ గాయత్రీ అక్కలా కాదు. 
సుమన: గాయత్రీ దేవి అత్తయ్య పునర్జన్మ ఎత్తారు కానీ మా అక్కకి పుట్టగానే ఆ జీవం పాపని ఎత్తుకుపోయాడు. ఇంకా దొరకలేదు.
అహల్య: అదేంటి ఈ గాయత్రీ పాపే గాయత్రీ అక్క కాదా. 
దురంధర: నిన్నటి వరకు అదే అనుమానం ఉండేది వదినా కానీ గాయత్రీ దేవి ఆత్మే పాపని వెంట పెట్టుకొని రావడంతో ఈ పాప పెద్ద వదిన కాదని క్లారిటీ వచ్చింది. 
హాసిని: గాయత్రీ అత్తయ్య వేరు ఈ గాయత్రీ పాప వేరు.
అహల్య: కాదు కానేకాదు 
నయని: అంత కచ్చితంగా ఎలా చెప్పగలగుతున్నారు.
అహల్య: జరిగిన దాని బట్టి నేను ఆ మాట అన్నాను. అయితే అది చెప్పడానికి ముందు నేను పొరపాటు పడ్డానేమో తెలుసుకోవడానికి నాకు కాస్త సమయం కావాలి.
దురంధర: ఈ పిల్ల అడుగు పెట్టినప్పటి నుంచి అన్నీ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. 
అహల్య: సుమన ఉలూచిని కనడం, ఇన్నేళ్ల తర్వాత దురంధర గర్భవతి కావడం కూడా తన వచ్చిన అదృష్టమే.
నయని: అమ్మగారు గాయత్రీ పాప, గాయత్రీ దేవి ఇద్దరూ నా కళ్ల ముందుకు ఒకేసారి వచ్చారు.
అహల్య: అది కనికట్టు కావొచ్చు. 


ఇక ఆస్తులు గురించి మాట్లాడుకుంటారు. పుట్టడమే కోటీశ్వరురాలిగా అహల్య పుట్టిందని హాసిని సుమనకు చెప్తుంది. ఇక తిలోత్తమ కూడా కోటీశ్వరురాలు అని అంటే అలా కవరింగ్ ఇచ్చావా తిలోత్తమ అని అహల్య అంటుంది. ఇక అహల్య త్వరలోనే గాయత్రీ పాప గాయత్రీదేవి అని నిరూపించడంతో పాటు తిలోత్తమ నిజస్వరూపం సాక్ష్యాలతో సహా బయట పెడతానని అంటుంది. ఇక విక్రాంత్ నయని, విశాల్‌లు ఫైల్స్ చూస్తుంటే సుమన అక్కడికి వచ్చి భర్త లేకపోయినా అహల్య బాగానే సంతోషంగా ఉందని అంటుంది. సుమనకు కొట్టడం వేస్టని వదిలేస్తారు. తన పిన్నితో జాగ్రత్తగా ఉండమని విశాల్ సుమనకు స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ప్రీతి, ఉషల్ని చంపేస్తా అని మహాని బెదిరించిన సీత.. పిన్ని, తండ్రిని కొట్టమని రామ్‌తో చెప్పిన సీత!