Brahmamudi Serial Today Episode:  అక్కడికి అనామిక వస్తుంది. దీంతో కనకం షాక్‌ అవుతుంది. కంగారుపడకండి పిన్ని ఆ అగ్రిమెంట్స్‌ పేపర్స్‌ ఇవ్వండి  అని అడుగుతుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు అని కనకం అడుగుతుంది. ఏం చేయను అనగానే కనకం వెళ్లబోతుంది. సురేష్‌ ఆ సీసీటీవీ పుటేజీ తీసుకుని పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్దాం పద అంటుంది. దీంతో కంగారుగా కనకం ఎందుకని అడుగుతుంది. దీంతో మా ఆఫీసులో దొంగతనం చేసావని బెదిరిస్తుంది. కనకం అగ్రిమెంట్‌ పేపర్‌ ఇస్తుంది.


కనకం: నీలాంటి ఆడదాని కింద పని చేయాల్సిన అవసరం నా కూతురుకు లేదు.  


అనామిక: బాగా తెగించినట్టు ఉన్నావు. నేను తలుచుకుంటే..


కనకం: ఏయ్‌ ఆపు.. నువ్వు తలుచుకుంటే ఏమీ చేయలేవు. ఈ కనకం సంగతి నీకు పూర్తిగా తెలియదు. ఒసారి నీ మాజీ అత్త ధాన్యలక్ష్మీని, ఆ ఇంటి మీద పడి తినే రుద్రాణిని అడుగు. నీ అగ్రిమెంట్‌ పేపర్స్‌ నీకు ఇచ్చాను. నా కూతురు రాదు ఏం చేసుకుంటావో చేసుకో..


అని వెళ్లిపోతుంది కనకం. నిన్ను ఏం చేయాలో అదే చేస్తాను అని అనామిక అనుకుంటుంది. మరోవైపు కనకం ఎవరూ చూడకుండా ఇంట్లోకి వెళ్తుంది. ఇంతలో కావ్య వస్తుంది.


కావ్య: అమ్మా ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అమ్మా..


కనకం: న్యాయాన్ని నిలబెట్టడానికి వెళ్లాను. ధర్మాన్ని గెలిపించడానికి వెళ్లాను. అన్యాయాన్ని ఎదిరించడానికి వెళ్లాను.


కావ్య: కొంపదీసి మా అత్తగారింటికి వెళ్లి మా ఆయనతో గొడవ పడ్డావా?


కనకం: చీ నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది.


కావ్య: న్యాయం అన్యాయం అంటూ నినాదాలు చేస్తున్నావు కదా?


 అని కావ్య అడగ్గానే అనామిక వాళ్ల ఆఫీసుకు వెళ్లానని చెప్తుంది కనకం. ఆ అగ్రిమెంటే లేకుండా చేయాలని ఆలోచించి లేబర్‌ ఆఫీసర్‌ లా వెళ్లానని జరిగింది మొత్తం చెప్తుంది కనకం. కావ్య తిడుతుంది. కావ్యను క్షమించమని అడుగుతుంది కనకం. తర్వాత రాజ్‌ నిద్రపోతుంటే కావ్య వెళ్లి నిద్ర లేపుతుంది.


రాజ్: ఏయ్‌ నువ్వా ఏ ముఖం పెట్టుకుని వచ్చావు.


కావ్య: నేనే కందిపప్పు ముఖం


రాజ్: ఎంత ధైర్యమే నీకు చేసిందంతా చేసి సిగ్గు లేకుండా మళ్లీ నాకు ఎదురు పడతావా? వెళ్లు.


కావ్య: ఆగండి మీరు ఆవేశపడకండి. నిజంగా మీ మనఃసాక్షిని అడగండి నేను తప్పు  చేశానంటే మీ మనసు ఒప్పుకుంటుందా?  


రాజ్‌: లేదు.


కావ్య: మరి ఇంకా కోపం దేనికి..?


రాజ్: అయినా సరే నా కళ్ల ముందే అంతా జరిగింది. నా కళ్ల ముందే ఆ కంపెనీకి నువ్వు ఇచ్చిన డిజైన్స్‌ అవార్డ్స్‌ గెలుచుకున్నాయి. ఆ అవార్డు కూడా నువ్వే దగ్గరుండి తీసుకున్నావు.


కావ్య: మీ భార్య డిజైన్స్‌ కు అవార్డు వస్తే మీరు గెలిచిన్టు కాదా?


అని కావ్య చెప్పగానే రాజ్‌ కాదంటాడు. కావ్య మీద కోప్పడతాడు. దీంతో రాజ్‌ ను హగ్‌ చేసుకుంటుంది కావ్య. రాజ్‌ మాత్రం నువ్వు ఎంత చేసినా నేను నిన్ను క్షమించను వెళ్లు అంటుంటాడు. కళ్లు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. ఇది కలా అనుకుని కింద హాల్లోకి వచ్చి పడుకుంటాడు రాజ్‌. పొద్దున్నే హాల్లో పడుకున్న రాజ్‌ ను చూసి ఇందిరాదేవి, అపర్ణ నవ్వుకుంటారు.


ఇందిరాదేవి: నాకు అర్థమైంది. ఇన్ని రోజులు కావ్యతో కలిసి పడుకోవడం అలవాటు అయిపోయి ఇప్పుడు తోడు లేక తనే గుర్తుకు వస్తు ఉండటంతో గదిలో ఒంటరిగా ఉండలేక ఇక్కడకు వచ్చి పడుకున్నావు కదా?


రాజ్: హలో నాన్నమ్మ గారు ఆవిడ గారు లేకపోతే నాకు నిద్ర పట్టదా? అయినా మీకేం పని పాట లేదా? దాని పేరు ఇంట్లో ఎత్తొద్దు అంటే మళ్లీ మళ్లీ తీసుకొస్తారు.


ఇందిరాదేవి: నువ్వు ఎన్ని అబద్దాలు చెప్పినా నీ ముఖంలో కనిపిస్తుందిరా..నీకు అన్ని మీ తాతయ్య పోలికలే.


రాజ్‌: మధ్యలో ఆయనేం చేశారు.


అంటూ ఇద్దరినీ తిట్టుకుంటూ రాజ్‌ పైకి వెళ్లిపోతాడు. రాజ్‌ మాటలు వింటుంటే నాకు భయమేస్తుంది అత్తయ్యా.. వీళ్లిద్దరిని కలపడం ఎలా అని బాధపడుతుంది అపర్ణ. వీళ్లిద్దర్ని కలిసి ఒకేచోట ఉంచితే తప్పా దారికి రారు అంటుంది ఇందిరాదేవి. కనకం అయితేనే ఎలాగైనా ఇద్దరిని కలుపుతుందని ఇద్దరం వెళ్లి కలుద్దామని డిసైడ్‌ అవుతారు అత్తా కోడళ్లు. తర్వాత ఇద్దరూ వెళ్లి గుడిలో కనకాన్ని కలుస్తారు నువ్వే ఎలాగైనా వాళ్లిద్దర్ని కలపాలని చెప్తారు. దీంతో వాళ్లిద్దరు ఒకరికి చెప్పేవాళ్లు..  వాళ్లకు మనమేం చెబుతాం చెప్పండి అంటుంది కనకం. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: దొంగతనం మీదేసుకున్న చెర్రి – భూమిని క్షమించమన్న శరత్‌చంద్ర