Trinayani Serial Today Episode తిలోత్తమ, వల్లభ గాయత్రీ దేవి ఫొటో దగ్గర నిల్చొంటే పాప అక్కడికి వస్తుంది. పాపని తిలోత్తమ వచ్చావా గాయత్రీ దేవి అని అంటుంది. పూర్తి పేరు పెట్టి ఎందుకు పిలిచాను అంటే నువ్వే విశాల్‌ని కన్న తల్లివి అని ఈ జన్మలో విశాల్ కూతురిలా పుట్టావని నాకు తెలిసిపోయిందని అంటుంది. 


తిలోత్తమ: ఎలాగని అనుకుంటున్నావా నువ్వు పడుకోగానే గాయత్రీ అక్క ఆత్మ వచ్చిందంటే తనే నువ్వు నువ్వే తను.
విశాల్: గుర్తు పట్టేశావా అమ్మ.
తిలోత్తమ: విశాల్ ఈ పిల్లకు ఇంకా మాటలు రావడం లేదు కానీ నిన్ను నాన్న అని పిలవాలి. ఎందుకంటే తనే నువ్వు కన్న తొలిబిడ్డ కాబట్టి.
విశాల్: అంటే గాయత్రీనే నా కన్నతల్లి అని అంటావ్. 
వల్లభ: కళ్ల ముందు క్లారిటీ ఉంటే ఇంకా డౌటా.
నయని: నేను కూడా మొదట్లో ఇలాగే పొరపడ్డా బాబుగారు.
తిలోత్తమ: అంటే ఏంటి పాప నీ తొలిబిడ్డ అని నమ్మడం లేదా. 
విశాల్: గాయత్రీ పాప మెలకువతో ఉంటే మా అమ్మ ఆత్మ రాదు అంటారు అంతే కదా.
తిలోత్తమ: రాదు. 
విశాల్: వస్తే.. పాప ఇక్కడే ఉంది మెలకువతో కూడా ఉంది మా అమ్మ వస్తే.
తిలోత్తమ: గాయత్రీ అక్కని రమ్మని చెప్పండి అప్పుడు ఈ పిల్ల గాయత్రీ అక్క కాదు అని కరాఖండీగా చెప్పొచ్చు.
విశాల్: నయని అమ్మని పిలు. మీ కళ్లు తెరుచుకోవడానికి అమ్మ ఇక్కడికి వస్తుంది. 


నయని అమ్మగారు అని పిలుస్తుంది. ఎన్ని సార్లు పిలిచినా గాయత్రీ దేవి రాదు. దాంతో విశాల్ పాపని ఆడుకోమని పంపేస్తాడు. అప్పుడు కర్టెన్స్ ఊగి గాయత్రీ  దేవి వస్తుంది. గాయత్రీ దేవితో పాటు గాయత్రీ పాప కూడా పక్కనే నడిచి రావడంతో అందరూ షాక్ అయిపోతారు. గాయత్రీ పాప పక్కనే గాయత్రీ దేవి కూడా ఉన్నారని చెప్పడంతో అందరూ బిత్తరపోతారు. తిలోత్తమ ఇద్దరూ వచ్చారని చెప్తుంది. నేనే తను అని పసి పాపని విసిగుస్తున్నావని నీ సంగతి చూడటానికి  వచ్చానని గాయత్రీ దేవి చెప్తుంది. ఇంకెప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని దైవ నిర్ణయంతో నేను నీ దగ్గరకు వస్తానని గాయత్రీ దేవి చెప్తుంది. ఇక అందరికీ ఇంకెప్పుడూ పాపని గాయత్రీ దేవి అనొద్దని విశాల్ అంటాడు. ఇక పాపని తీసుకొని వెళ్లిపోతాడు. నయని ఇంకెప్పుడూ ఎలాంటి ప్రయోగాలు చేయకని కేవలం పంచకమణి, భుజంగమణిని మానసాదేవి ఆలయానికి చేర్చడమే నీ కర్తవ్యం అని చెప్పి భుజంగమణి నయని చేతికి ఇస్తుంది.


నయని ఆరు బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి విశాల్ వస్తాడు. పాప మీద నీకు ఉన్న అనుమానాలు తీరిపోయాయా అని అడుగుతాడు. నయని తనకు ఇంకో డౌట్ వచ్చిందని గాయత్రీదేవి గారు భుజంగమణి నాకు ఎందుకు ఇచ్చారా అని అనుమానం వ్యక్తం చేస్తుంది. గాయత్రీ దేవికి భుజంగమణి ఎవరు ఇస్తారని అడుగుతుంది. మణి ఎక్కడుందో మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు కదా అమ్మగారికి ఎలా తెలిసిందని నయని అంటుంది. అంతగా ఆలోచించొద్దని విశాల్ అంటాడు. అమ్మకి ఏది ఎక్కడుందో తెలుసని అంటాడు. దానికి నయని మీకు తప్ప ఇంకెవరికీ అది తెలీదని అంటుంది. విశాల్ తడబడుతూ అన్నీ చెప్తే నయనికి విశాల్ మీద అనుమానం వస్తుంది. ఉదయం అందరూ హాల్‌లో కూర్చొంటారు. సరదాగా పొడుపు కథలు చెప్పుకొని నవ్వుకుంటారు. ఇంతలో తిలోత్తమకు కొత్త నెంబరు నుంచి ఫోన్ వస్తుంది. వల్లభ మాట్లాడగా మీ అమ్మకి ఫోన్ ఇవ్వు అంటుంది అవతల వ్యక్తి దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ప్రీతి, ఉషలు కిడ్నాప్.. మహాలక్ష్మీకి బెదిరింపులు.. సీత ప్లాన్ సక్సెస్ అవుతుందా!‌