Seethe Ramudi Katnam Serial Today Episode సీత రామ్‌ని తీసుకొని రిజిస్టర్‌ ఆఫీస్‌కు వస్తుంది. రేవతి కిడ్నాప్‌ అయింది.. కిరణ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు కదా పెళ్లి ఎలా జరుగుతుందని రామ్ అడుగుతాడు. రెండు గంటల్లో ఇవి ఎలా సాధ్యం అని అడిగితే సీత అవన్నీ నేను చూసుకుంటానని అంటుంది. దానికి రామ్ అఖరి నిమిషంలో నన్ను ఫూల్‌ని చేయకు సీత అని అంటాడు. నిన్ను నమ్మి లోపలికి వెళ్లి ఆఫీసర్‌తో మాట్లాడుతున్నానని రామ్ అంటాడు.
 
సీత ఆపరేషన్ సీతని స్టార్ట్ చేస్తుంది. దాంతో మా అన్నయ్య సీరియల్ ఫేమ్ గంగాధర్, శివలు బుల్లెట్ బండి మీద ఎంట్రీ ఇస్తారు. తన ఫ్రెండ్ సీత ఇచ్చిన పని చేయాలని శివ అంటుంది. ఏం చేయాలని గంగాధర్ అడిగితే ఇద్దరమ్మాయిలని కిడ్నాప్ చేయాలని అంటుంది. దాంతో గంగాధర్ నాకు నలుగురు చెల్లెల్లు ఉన్నారని ఇలాంటి వాటిని చేయనని అంటాడు. మొత్తానికి శివ గంగాధర్‌ని ఒప్పిస్తుంది. ఇక ఎవరిని కిడ్నాప్ చేయాలని అడిగితే ప్రీతి, ఉషలను చెప్తుంది శివ. ప్రీతి ఉషలు కాలేజ్‌ అయిపోగానే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తుండగా గంగాధర్, శివలు వారి క్యాబ్‌కి ఎదురుగా వచ్చి బండి ఆపుతారు. శివ క్యాబ్ డ్రైవర్‌ని బెదిరించి తాను పోలీస్‌నని చెప్పి తాను డ్రైవింగ్ చేస్తూ ఇద్దరినీ తీసుకెళ్తుంది. ప్రీతి, ఉషలకు మత్తు మందు ఇస్తుంది.


ఇక జనార్థన్ రేవతి పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే స్టోర్ రూంలో ఉన్నా తనని జాగ్రత్తగా చూసుకుంటున్నామని రేవతి చెప్తుంది. రేవతి కోసం బయట అందరూ పిచ్చోళ్లా తిరుగుతున్నారని అనుకుంటారు. ఇంతలో మహాలక్ష్మీకి ఫోన్ వస్తుంది. ప్రీతి, ఉషల కిడ్నాప్ విషయం శివ మహాలక్ష్మీకి చెప్తుంది. ఇద్దరినీ కిడ్రాప్ చేశామని చెప్పడంతో మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. స్పీకర్ ఆన్ చేస్తుంది. దాంతో జనార్థన్ పిల్లల్ని వదలకు పోతే చంపేస్తా అంటాడు. దాంతో శివ మేం చెప్పిన పని చేయకపోతే రేపు వాళ్లని పరీక్షకు పంపమని చెప్తుంది. ప్రీతి, ఉషల కోసం మహాలక్ష్మీ వాళ్లు వాళ్ల డిమాండ్స్  అడుగుతారు. ఇదంతా కిరణ్‌ పని అయింటుందని అనుకుంటారు. మహాలక్ష్మీ మాత్రం వాడు కాదని అంటుంది. ప్రీతి, ఉషలు వదిలేయమని ఏడిస్తే సిస్టర్ సెంటిమెంట్‌తో గంగాధర్ ఏడుస్తాడు. 


మరోవైపు సీత, రామ్‌లు ఆఫీసర్‌తో మాట్లాతారు. కాసేపట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేస్తారని అంటుంది. మరోవైపు శివకృష్ణ, లలితలు పెళ్లికి రెడీ అవుతారు. ఇక విద్యాదేవికి కాల్ చేస్తారు. బయల్దేరుతున్నాం అని చెప్తారు. దాంతో విద్యాదేవి జరిగిందంతా చెప్తుంది. రేవతి కినిపించడం లేదని, కిరణ్‌ అరెస్ట్ చేశారని చెప్తుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. సీత ఎలా అయినా ఈ పెళ్లి చేస్తానని అంది అంటే శివకృష్ణ నా కూతురు మాట ఇచ్చిందంటే తప్పదని ఎలా అయినా పెళ్లి అవుతుందని పెళ్లికి బయల్దేరుతారు. మరోవైపు గంగాధర్ ప్రీతి, ఉషల్లో తన చెల్లెల్ని చూసుకొని వాళ్లకి జ్యూస్, ఫ్రూట్స్ ఇస్తాడు. ఇక శివకి సీత కాల్ చేస్తుంది. సీత శివకు తన ప్లాన్ చెప్తుంది. ఇక సీతకి శివ వీడియో కాల్ చేసి ప్రీతి, ఉషల్ని చూపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ, మిత్రలను ఒకే బెడ్ మీద అలా చూసేసిన మనీషా.. జానుతో పెళ్లికి వివేక్ ఏర్పాట్లు!