Prema Entha Madhuram Serial Today Episode: అమ్మవారి ముందు కూర్చున్న జోగమ్మ వాళ్ల గత జన్మ అర్ధాంతరంగా ముగిసింది. ఈ జన్మలోనేనా వారు పూర్తి జీవితం గడుపుతారనుకుంటే ఇలా చేస్తున్నావేంటమ్మా అని బాధపడుతుంది. మరోవైపు వినయ్ ని పెళ్లికోడుకును చేసిన పాండు నాది లక్కీ హ్యండ్ అని చెప్తాడు. ఇప్పుడు పెళ్లికొడుకును అవుతున్నాను. రాత్రికి నవమన్మథుడిని అవుతాను అనగానే పాండు రేపు మళ్లీ జైలులో ఖైదీవి అవుతావు. అని మాట్లాడుకుంటుంటే శ్రావణి వచ్చి వింటుంది. బయటకు వెళ్లి ఆలోచిస్తుంది. సంధ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో సంధ్య వస్తుంది.
సంధ్య: శ్రావణి పెళ్లి బట్టలు ఎక్కడున్నాయి. ఏమైందే అలా ఉన్నావు.
శ్రావణి: నువ్వు చెప్పింది నిజమే సంధ్య అతని క్యారెక్టర్ మంచిది కాదనిపిస్తుంది.
సంధ్య: ఏమైంది శ్రావణి నిన్ను ఏమైనా అన్నాడా?
శ్రావణి: లేదు. కానీ ఓనరు అంకుల్ అతనితో మాట్లాడ్డం విన్నాను. వాళ్ల మాటలేవో తేడాగా ఉన్నాయి సంధ్య. అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా అక్క పెళ్లికి ఒప్పుకుంది. అక్క జీవితం ప్రమాదంలో పడినట్టే అవుతుంది.
సంధ్య: నేను చెబితే వినిపించుకోలేదు. ఇప్పుడు ఏమి చెప్పినా లాభం లేదు. పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లిని ఆపడం కూడా కుదరదు.
శ్రావణి: ఎందుకు కుదరదు. ఇప్పుడే వెళ్లి అక్కతో చెబుదాం. ఎలాగైనా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాలి. పద.
అంటూ వెళ్తారు. ఇద్దరు వెళ్లి గౌరికి చెప్పగానే వాళ్లిద్దర్ని గౌరి తిడుతుంది. ఎవ్వరూ ఆపినా ఆగదు ఆ శంకర్ పంతం నెగ్గదు. ఈ పెళ్లి జరుగుతుంది అని గౌరి చెప్తుంది. మరోవైపు శంకర్ వాళ్లు ఇల్లు ఖాళీ చేసి వెళ్తుంటే ఒంటి ఓనరు పాండు టూ లెట్ బోర్డు తీసుకుని వస్తాడు. ఇంతలో యాదగిరి వచ్చి కంగారుపడుతుంటాడు. మరోవైపు ఇంట్లో ఏడుస్తూ కూర్చున్న అకిని చూసిన రాకేష్ హ్యాపీగా ఫీలవుతాడు. నువ్వు మీ అమ్మానాన్నను కలిపేసి మీ కుంటుంబం అంతా హ్యాపీగా ఉంటే చూస్తూ ఊరుకుంటానా అనుకుంటూ అకి దగ్గరకు వెళ్లి ఏంటి బాధపడుతున్నావు అని అడుగుతాడు. నాతో షేర్ చేసుకోకూడదా? అని అడుగుతుండగా రవి వస్తాడు.
రవి: షేర్ చేసుకోవడానికి ఏమీ లేదు సార్. గౌరి గారికి పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లి కొడుకు అంత మంచివాడు కాదని తెలిసింది. అందుకే బాధపడుతుంది.
రాకేష్: సో సాడ్. కొన్నింటిని ఆపినా ఆగవు.
రవి: శంకర్ గారి ప్లాన్ వర్కవుట్ అయ్యుంటే ఇంత వరకు వచ్చి ఉండేది కాదు.
అభయ్: ఏంటి ఏదో సీరియస్ డిష్‌కర్షన్ లో ఉన్నారు.
రవి: ఏం లేదు సార్ గౌరి గారి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాము.
అభయ్: అవును ఏవో ఇష్యూస్ అవుతున్నాయి అన్నారు అవి ఇంకా క్లియర్ అవ్వలేదా?
రాకేష్: ఈరోజు పెళ్లి పెట్టుకుని ఏం క్లియర్ అవుతుంది అభయ్.
అభయ్: ఓ ఈరోజేనా..?
రాకేష్: మనకు ఇన్విటేషన్ రాదులే లైట్ తీసుకో..
ఇంతలో యాదగిరి, అకికి ఫోన్ చేసి శంకర్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నాడు అని చెప్తాడు. దీంతో భయంగా ఏడుస్తున్న అకి నేను ఇప్పుడే వస్తున్నాను అని వెళ్లిపోతుంటే అభయ్ ఏమైందని అడుగుతాడు తర్వాత మాట్లాడతానని వెళ్లిపోతుంది. మరోవైపు యాదగిరి వెళ్లి శంకర్ ను ఆపాలని చూస్తాడు. శంకర్ వినడు. ఇంతలో పాండు వచ్చి శంకర్ ను చూసి వెటకారంగా మాట్లాడతాడు. మరోవైపు గౌరిని కన్వీన్స్ చేయాలని చూస్తుంటారు శ్రావణి, సంధ్య. ఇంతలో యాదగిరి వచ్చి అతడు మంచివాడు కాదని చెప్తుంటాడు. దీంతో గౌరి యాదగిరిని తిట్టి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు రాకేష్, పాండుకు ఫోన్ చేసి ఏ అడ్డంకి లేకుండా పెళ్లి జరిగిపోవాలని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం