Trinayani Serial November 16th Episode


నయని: ఫొటోలో ఉన్న అమ్మగారితోనా మీరు మాట్లాడుతున్నది
విశాల్: అవును నయని యమదీపదానం చేయగానే దీపాల సెగ అమ్మ ఫొటో వైపు వెళ్లి చుట్టుకోవడం చూశాకా నా మనసంతా ఎదోలా అయిపోయింది. గాయత్రీ పాపను ఎత్తుకున్నా సరే భారంగా అనిపిస్తోంది. 
నయని: ఎక్కడో ఉన్న అమ్మగారికి ఏం కాకూడదు అని మీకు తెలీకూడదని నేను ప్రయత్నిస్తుంటే మీరు ఒంటరిగా ఇక్కడ మీలో మీరు బాధ పడుతున్నారా. 
విశాల్: నేను ఒంటరిగా ఎక్కడ ఉన్నాను నయని తోడుగా గాయత్రీ పాప ఉందిగా ఈ చిట్టి తల్లి కూడా నా కన్నతల్లి పేరు పెట్టుకున్నందుకు పాపను చూసి అమ్మకు ఏమీ కాదు అనే బరోసాను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. 
నయని: దీప దానం చేయకుండా ఉంటే బాగుండేది అని అప్పుడు అనుకున్నాను కానీ అలా చేయడమే మంచిది అని ఇప్పుడు అనిపిస్తుంది. అవును బాబుగారు నాకు గానీ నా బిడ్డలకు గానీ ఏదైనా ఆపద వస్తే తెలుసుకోలేని దురదృష్టవంతురాలిని నేను. స్వామి వారి వల్ల ప్రమాదం ముంచుకొస్తుందని అర్ధమైంది. కష్టంలోనే అవకాశాన్ని వెతుక్కుంటాను నేను. నా బిడ్డకు గండం వస్తుందని తెలిసినప్పుడు ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. అప్పుడు అమ్మగారిని వెతికి పట్టుకోవచ్చు. నా గుండెలకు హత్తుకున్నాక యముడైనా సరే నా బిడ్డను నా నుంచి తీసుకెళ్లలేడు. 
విశాల్: (మనసులో.. అంటే ఈ గాయత్రికి గండం రాగానే నన్ను కన్న తల్లి ఈ పాపే అని తెలిసిపోతుందా)


తిలోత్తమ, వల్లభ అఖండ స్వామి దగ్గరకు వెళ్తారు. ఎప్పుడూ డల్‌గా వచ్చే మీరు ఈ రోజు ఇంత ఆనందంగా నా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అఖండ స్వామి వారిని అడుగుతారు.  


తిలోత్తమ: అఖండ స్వామి మేము ఇంత ఆనందంగా ఇక్కడికి రావడానికి కారణం మీరు ఊహించినా మరోసారి మీకు చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. నా శత్రువు అయిన గాయత్రీ అక్కయ్య నన్ను కడతేర్చడానికి నయని కడుపున పుట్టిన జీవం ఎత్తుకుపోయి ఎక్కడో వదిలేశాడు.  
వల్లభ: ఆ.. ఆ తర్వాత పిల్ల కథ కంచికి పోయిందో కాన్పూర్‌ పోయిందో తెలీదు కానీ అప్పుడప్పుడు అదిగో పులి ఇదిగో పిల్ల అంటూ బయపడ్డాం. ఇది ఒప్పుకోవాల్సిన నిజమే.  
అఖండ: ఎవరు ఎక్కడ ఉన్నా మృత్యువు నుంచి తప్పించుకోలేరు. 
తిలోత్తమ: ఏం స్వామి గాయత్రి అక్క కంపెనీ ఉద్యోగులకు, కావాల్సిన వారికి దేవత అనండి ఒప్పుకుంటాను. కానీ తనో మృత్యుదేవత నా ప్రాణలు తీస్తుంది అంటే మాత్రం నేను ఒప్పుకోను. 
అఖండ: గాయత్రిని గండం చేరిపోయింది అన్నమాట. కానీ గండం గాయత్రీ దేవికి రాకముందే మీ అమ్మను ఒక్కసారి పలకరించి పోవాలి అనుకున్నది వల్లభ. మీకే ముప్పు రానుంది అని చెప్తున్నాను. మీరు కోటీశ్వరులు అయినా కూటికి లేని వారు అయినా మృత్యువు వెంట పడితే ఒంటి మీద నగలు ఉన్నాయా అన్న సంగతి మర్చిపోతారు. ఆకలి వేసినా  కూడా అక్కర్లేదని పారిపోతారు. మరణ మృదంగాన్ని వింటూ ఆస్వాదించే స్వామిని నేను నాకు అసూయ వంటివి ఉండవు. వచ్చే గండం నుంచి నిన్ను కాపాడేది నయనీనే. అది మీరే తెలుసుకుంటారు. వెళ్లండి  
 
పావనా మూర్తి, డమ్మక్క గానవి, గాయత్రిలను ఆడిస్తుంటారు. ఇక హాసిని, విక్రాంత్, సుమన అందరూ అక్కడికి వచ్చి మాట్లాడుకుంటారు. ఇంతలో నయని వచ్చి మాట్లాడుతూ ఉంటే కాదు అందరూ పండగ పనులు చేయమని చెప్తుంది. మరోవైపు విశాల్ వచ్చి దీపావళి పండగ రోజు ఉత్తరేణి ఆకులతో చేసే ప్రత్యేక తలస్నానం గురించి ఇంట్లో అందరికీ చెప్తాడు. ఇక అందరూ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అనుకుంటారు. 


తిలోత్తమ: సుమన ఆగు.. నీ దగ్గర ఉన్న 7 కోట్ల రూపాయలు కాలిపోతే మీ అక్క కానీ, బావ కానీ కనీసం అందులో సగం అయినా ఇస్తామని అన్నారా
సుమన: లేదు అత్తయ్య అయినా ఎందుకు అంటారు అది నేను చేసుకున్న తప్పు
వల్లభ: నువ్వు అలా అనకు మరదలా నిత్యం పూజలు అంటూ హడావుడి చేయడం వల్లే కదా అలా జరిగింది లేదంటే నీ డబ్బు నీ దగ్గరే ఉండేది కదా
తిలోత్తమ: కరెక్ట్. అట్లతద్ది వచ్చినా ఆషాడం వచ్చినా ప్రతీది హడావుడి ఎందుకు చేస్తుందో తెలుసా. నీ దగ్గర మూడు కోట్ల ఆస్తి అని తన దగ్గర వందల కోట్ల ఆస్తి ఉందని ప్రతి రోజు పండగలు చేసినా అది తరగదని బిల్డప్ ఇస్తుంది మీ అక్క. కావాలి అంటే ఈ రోజు చూడు నిన్నే టార్గెట్ చేస్తుంది. 
సమన: అదీ చూస్తా 


మరోవైపు హాసిని ఎండిన గోగునారతో పిల్లలకు దిష్టి తీయడానికి ఏర్పాటు చేస్తుంది. గాయత్రి పాపకు దిష్టి తీయడానికి గోగునారకు నిప్పు పెట్టి దిష్టి తీస్తుంది. ఇక సుమన ఉలూచికి కేవలం పెద్దబొట్టమ్మ దిష్టి తగలకుపోతే చాలు అని అంటుంది. దీపాల వెలుగు ఉంటే పాములు ఎలా వస్తాయి అని వల్లభ అంటాడు. మరోవైపు దీపావళి పండగ ఏర్పాట్లు జోరుగా జరుగుతాయి. అందరూ లక్ష్మిదేవి దగ్గర పూజకు వస్తారు. ఇక తిలోత్తమ అఖండ దీపం తీసుకొస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.