Brahmamudi Serial Today Episode: హాల్‌లో జరిగిన డ్రామా గురించి రాజ్ కావ్యను ప్రశ్నిస్తాడు. అదంతా తన ప్రేమ నాటకం అని కావ్య చెప్తుంది. తాను నటిస్తే ఎలా ఉంటుందో చూపించాలని ఇలా చేశానంటుంది. తన అక్క చేసిన పనికి మీ దృష్టిలో నేను దోషినయ్యానని వాపోతుంది. తన కాపురం కురుక్షేత్రం, యుద్ధం అయిందని బాధ పడుతుంది. తానే ఏ తప్పు చేయలేదని ఓ నిజం దాచానని చెప్తుంది. తాతయ్య గారిని సంతోషంగా ఉంచడానికి నటించాల్సి వస్తుందని రాజ్‌కు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కావ్య మాటలు అర్ధం కాక రాజ్ తలపట్టుకుంటాడు.  


రుద్రాణి: రాహుల్ నువ్వు చెప్పిన కొరియర్ ఇంకా రాలేదు ఏంటీ.. ఆ అరుణ్ కొరియర్ చేశాడా లేదా
రాహుల్: చేస్తా అని చెప్పాడు మామ్ కనుక్కుంటా అని అరుణ్‌కి ఫోన్ చేస్తాడు. ఇంతలో కొరియర్ వస్తుంది. మామ్ ఇప్పుడు స్వప్న అరుణ్ కలిసి ఉన్న ఫోటోలు ఇంట్లో వాళ్లు చూస్తే యుద్ధం మొదలవుతుంది చూడు
అపర్ణ: ఏంటి ఆ కొరియర్
ధాన్యలక్ష్మి: తెలీదు అక్క దుగ్గిరాల ఫ్యామిలీకి అని ఉంది అంతే అక్క అని ఆ కొరియర్‌ను ధాన్యలక్ష్మి చూడమని అపర్ణకు ఇస్తుంది. 


ఇంతలో తన భర్త పిలవడంతో అపర్ణ ఆ కొరియర్‌ను చిట్టీకి ఇచ్చేస్తుంది. చిట్టీ ఆ కొరియర్ తెరచి అందులో స్వప్న, అరుణ్ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు చూసి షాక్ అవుతుంది. స్వప్న ఆ అబ్బాయితో అంత క్లోజ్‌గా ఎందుకు ఉందని ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎవరు ఏ ఉద్దేశంతో పంపారని అనుకుంటుంది. పైనుంచి ఆ సీన్‌ను రుద్రాణి, రాహుల్ చూసి సంతోష పడతారు. క్లారిటీ లేకుండా ఈ విషయం అందరికీ చెప్పడం సరికాదని స్వప్నకే అడిగి తెలుసుకుంటానని చిట్టీ అనుకుంటుంది. ఇంతోల అపర్ణ కొరియర్‌లో ఏంటి అంటే నిజం చెప్పకుండా తన భర్త కోసం వచ్చిందని చెప్తేస్తుంది. 


స్వప్న: మీరు పై వరకు వచ్చారేంటి అమ్మమ్మ. కావ్యతో కబురు పెట్టి ఉంటే నేనే వచ్చేదాన్ని కదా. 
చిట్టీ: ఇది నలుగురిలో అడిగే విషయం కాదు. నాలుగు గోడల మధ్య అడగాల్సిన విషయం 
స్వప్న: ఏంటి అమ్మమ్మ కొత్తగా మాట్లాడుతున్నారు
చిట్టీ: కొన్ని విషయాలు కొత్తగా తెలిశాయి కాబట్టి. (స్వప్నకు ఫొటోలు చూపిస్తుంది)
ఈ అబ్బాయి ఎవరు ఈ అబ్బాయితో నీకు పరిచయం ఉందా. ఇదే ప్రశ్న అందరి ముందు కూడా అడగగలను. కానీ విషయం తెలీకుండా అందరి ముందు అడగడం ఎందుకు అని ఆగాను. ఎవరీ అబ్బాయి. స్వప్న అడుగుతుంది నిన్నే 
స్వప్న: ఎవరు అమ్మమ్మ గారు నన్ను అడిగితే నాకు ఏం తెలుస్తుంది. ఎవరీ అబ్బాయి. నిజంగానే నాకు ఈ అబ్బాయి ఎవరో తెలీదు. అసలు నాకు ఎందుకు ఈ ఫొటో చూపిస్తున్నారు. నన్నే ఎందుకు అడుగుతున్నారు. ఏంటి అమ్మమ్మ గారు ఏం మాట్లాడటం లేదు
చిట్టీ: ఈ ఫొటో కొరియర్‌లో వచ్చింది నీఫ్రెండ్ ఏమో అని అడుగుతున్నాను అంతే అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 
స్వప్న: ఈ అరుణ్ గాడు తన ఫొటో మా ఇంటికి ఎందుకు పంపించాడు. ఇడియట్
చిట్టీ: ఇదేంటి స్వప్న ఈ అబ్బాయి ఎవరో తెలీదు అని చెప్తోంది. మరి ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు పంపించారు. స్వప్న అబద్దం చెప్తోందా లేక ఆ ఫొటోలు అబద్ధమా 
రాహుల్: ఇదేంటి మామ్ అమ్మమ్మ ఏదో పెద్ద గొడవ చేస్తుంది అనుకుంటే స్వప్న అబద్ధం చెప్తోంది అని తెలిసి కూడా ఏం అనకుండా వెళ్లిపోయింది. ఒకవేళ స్వప్న చెప్పిందే నిజం అనుకుంటుందా 
రుద్రాణి: లేదురా స్వప్న మాటలు అబద్ధమనే అనుకుంటుంది. ఒకవేళ మీ తాతయ్య ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని గొడవలు ఎందుకని సైలెంట్‌గా ఉండుంటుంది. ఒక రకంగా ఇది మన మంచికే అయింది. ఇప్పుడు మనం మా అమ్మ మనసులో ఉన్న అనుమానానికి బలాన్ని చేకూర్చితే తనే వెళ్లి రాజ్‌కి తెలిసేలా చేస్తుంది. ఈవిషయం రాజ్‌కి కాకుండా నీకు కానీ నాకు కానీ చెప్తే మనం ఊరుకుంటామా అలానే ఇంట్లో ఎవరకి తెలిసినా గొడవ చేస్తారు. అందుకే విషయం తెలుసుకోమని రాజ్‌కి చెప్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది అంతా మా అమ్మ అనుమానాన్ని నిజం చేయడమే. దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. నేను చెప్పినట్లు చెయ్. మరోవైపు స్వప్న అరుణ్‌కి ఫోన్ చేస్తుంది. అరుణ్ ఫోన్ రిసీవ్ చేయడు. ఇక ఆ ఫొటోలు అరుణ్ దగ్గర తప్ప మరెవరి దగ్గర లేవు అని స్వప్న అనుకొని ఎలా అయినా విషయం కనుక్కుంటా అనుకుంటుంది.  


మరోవైపు కనకం అప్పు బెడ్ సర్దుతూ కల్యాణ్ ఫొటో మీద ఐ లవ్‌ యూ అని అప్పు రాసుకున్న రాతలు చూస్తుంది. అప్పుని గట్టిగా పిలుస్తుంది. అప్పుని గట్టిగా కొడుతుంది. అప్పు పెద్దమ్మ అడ్డు వచ్చినా ఆగదు. 
కనకం: ఇంకా ఎన్ని సమస్యలు ఎదుర్కొవాలే. ఇంకా ఎందరి ముందు నేను దోషిలా నిలబడాలే. ఎంత మందితో మాటలు పడాలే చెప్పవే చెప్పు
పెద్దమ్మ: కనకం ఆగవే పిచ్చి పట్టిందా నీకు ఎదిగిన ఆడ బిడ్డను పట్టి గొడ్డును కొట్టినట్లు కొడుతున్నావ్ నీ కూతుర్ని చంపేస్తావా. ఆడపిల్లను కొడతావా
కనకం: ఇది కూడా ఓ ఆడపిల్లే అని ఇప్పుడే తెలిసింది అక్క. ఆ కల్యాణ్ బాబుని ప్రేమిస్తోంది. ఇదిగో ఈ ఫొటో చూడు. 
పెద్దమ్మ: నాకు ముందే తెలుసు. 
కనకం: తెలుసా.. నీకు ముందే తెలుసా. తెలిసి నాతో ఎందుకు చెప్పలేదు అక్క
గొప్ప పని చేశావు లే. ఈ నిజం తెలిసి కూడా దీన్ని అలాగే వదిలేశావా. ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను ఆ ఇంటికి పంపించానని దాని అత్త దీని అత్త నన్ను పురుగును చూసినట్లు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మూడో దాన్ని కూడా వాళ్ల ఇంటికి కోడలిగా పంపించాలి చూస్తే వాళ్లు నన్ను బతకనిస్తారా
పెద్దమ్మ: కనకం ఈ విషయం ఎవరికీ తెలీదే
కనకం: తెలిస్తే.. ఇప్పటికే అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో.. పెద్దది చేసిన పనులకు చిన్నది ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలిసి కూడా ఇది ఆ ఇంటి అబ్బాయిని ఎలా ప్రేమిస్తుంది అక్క. అసలు దీన్ని నేను ఏం చేయాలి అక్కా. ఇంతలో అప్పు తండ్రి అక్కడికి వస్తాడు(కనకం చిన్నగా అప్పూతో)ఈ విషయం ఆయనకు తెలిస్తే నీతో పాటు నన్ను చంపేస్తాడు. కళ్లు తుడుచుకొని లోపలికి వెళ్లిపో అని చెప్తుంది. అప్పు ఫొటో తీసుకొని లోపలికి వెళ్లిపోతుంది. ఏమైంది ఎందుకు అలా ఉన్నావ్. అప్పు మీద ఎందుకు చెయ్ ఎత్తావ్ అని అడుగుతారు. ఇంతలో కనకం భోజనం అంటూ కవర్ చేస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.