బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu 7) 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఇప్పుడు ఆ పదిమందిలో టాప్ 1 నుంచి 10 స్థానాల్లో ఏ స్థానానికి ఎవరు అర్హులు అని వారినే డిసైడ్ చేసుకోమని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఏ స్థానం ఎవరికి అని తెలుసుకోవడం కోసం, తేల్చుకోవడం కోసం ఎన్నో చర్చలు జరిపారు. కానీ ప్రేక్షకులు ఊహించినంత వాగ్వాదాలు మాత్రం ఈ టాస్కులో కనిపించలేదు. ఈ టాస్కులో రతిక - పల్లవి ప్రశాంత్, అర్జున్ - శోభా శెట్టిల మధ్య మాత్రమే ఎక్కువగా వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కారణంగా శోభా శెట్టి కన్నీళ్లు కూడా పెట్టుకుంది. కానీ అమర్‌దీప్ మాత్రం తాను ఎప్పటికీ టాప్ 1లోనే ఉంటానని కాన్ఫిడెంట్‌గా ఇతర కంటెస్టెంట్స్‌కు ఛాలెంజ్ చేశాడు.


అర్జున్, శోభా మధ్య వార్


ముందుగా కంటెస్టెంట్స్ అంతా తమకు నచ్చిన స్థానం దగ్గరకు వెళ్లి నిలబడిన తర్వాత ఇతర కంటెస్టెంట్స్ వచ్చి వారు ఆ స్థానానికి అర్హులా లేదా వేరే స్థానంలో నిలబడితే కరెక్టా అనే విషయాన్ని చర్చించి చెప్పాలి. అలా మెజారిటీ కంటెస్టెంట్స్ ఏ నెంబర్ అయితే డిసైడ్ చేస్తారో ఇతన కంటెస్టెంట్స్ వెళ్లి ఆ నెంబర్లపై నిలబడక తప్పదు. ముందుగా రతిక, అశ్విని, అమర్‌దీప్, ప్రియాంకలు ఇతర కంటెస్టెంట్స్ అభిప్రాయాలను గౌరవించి వారు చెప్పిన నెంబర్లలో వెళ్లి నిలబడ్డారు. కానీ శోభా మాత్రం ఎప్పటిలాగానే వాగ్వాదానికి దిగింది. తన ఉద్దేశ్యంలో తనకు మొదటి స్థానం రావాలని, కాకపోతే తనలో కూడా కొన్ని తప్పులు ఉండడంతో తాను మూడో స్థానాన్ని ఎంచుకుంటున్నట్టు శోభా చెప్పింది. దీంతో కంటెస్టెంట్స్ అంతా తనకు మొదటి స్థానం కరెక్టా కాదా అని చర్చించుకున్నారు. 


కన్నీళ్లు పెట్టుకున్న శోభా


శోభా విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పడానికి అర్జున్ ముందుకొచ్చాడు. బిగ్ బాస్ ప్రారంభం అయినప్పటి నుండి తాను గెలిచిన ప్రతీ టాస్క్.. ఎవరో ఒకరి సాయంతోనే గెలిచిందని, సొంతంగా తను కష్టపడి ఏ టాస్క్ గెలవలేదని అర్జున్ అన్నాడు. ప్రతీ టాస్క్‌లో తనకు లక్ కలిసొచ్చిందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్‌మెంట్‌ను శోభా ఒప్పుకోలేదు. కానీ కంటెస్టెంట్స్ అంతా మెజారిటీగా నిర్ణయించినట్టుగానే తను 5వ స్థానంలో వెళ్లి నిలబడింది. ఆ తర్వాత లక్‌తోనే గెలిచావు అని అర్జున్ అన్న మాటలను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ల అభిప్రాయాన్ని చెప్పడం వల్ల కన్నీళ్లు పెట్టుకునే అవసరం లేదని అమర్‌దీప్, గౌతమ్.. శోభాను మోటివేట్ చేశారు. దాని తర్వాత ‘‘నాకు 5వ స్థానం ఇచ్చారు కాబట్టి నేను ఎవరికీ 1వ స్థానం ఇవ్వను. శోభా శెట్టి అంటే ఏంటో చూపిస్తా’’ అంటూ ఛాలెంజ్ చేసింది. కానీ సమయం వచ్చినప్పుడు శివాజీ మాత్రం 1వ స్థానానికి అర్హుడు అంటూ తనకు ఓటు వేసింది.


కామన్ మ్యాన్ సపోర్ట్


పల్లవి ప్రశాంత్.. తాను రెండో స్థానానికి అర్హుడు అనుకుంటున్నట్టు చెప్పాడు. దీంతో ముందుగా రతిక ఆ విషయాన్ని ఒప్పుకోకుండా తన అభిప్రాయాన్ని చెప్పడం మొదలుపెట్టింది. ‘‘మొదటి నాలుగు వారాల్లో నీ గేమ్ ఏమీ లేదు. మధ్యలో ఒక చిన్న సందర్భం వల్ల అది నీకు పాజిటివ్‌గా అయిపోయి నాకు మైనస్ అయ్యింది. నేను మళ్లీ వచ్చిన తర్వాత ముందు వారాలతో పోలిస్తే నీ స్వతహాగా గేమ్ ఏమీ లేదు. బిగ్ బాస్ చెప్పే రూల్స్ నీకు అర్థం కాదు. నామినేషన్స్‌లో ఎందుకలా ప్రవర్తిస్తావు అంటే మాట్లాడవు. శివన్న ఏం చెప్పమంటే అది చెప్తున్నావు. ఒక కామన్ మ్యాన్‌గా వచ్చావు. సెలబ్రిటీకి ఒక కామన్ మ్యాన్ సపోర్ట్ కావాలి. నువ్వు ఒక కామన్ మ్యాన్‌గా నీకు కామన్ మ్యాన్ సపోర్ట్ ఎక్కువ ఉంది.’’ అని తను అసలు గేమ్ ఆడలేదు అంటూ ఆరోపించింది రతిక. దీంతో ముందు నుండి తను ఆడిందంతా గుర్తుచేశాడు ప్రశాంత్. తన మాటలు నాకు అసలు వినిపించడం లేదు అంటూ పట్టించుకోనట్టుగా ప్రవర్తించింది రతిక.


Also Read: బిగ్ షాక్ - బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు, ఆ కామెంట్సే కొంపముంచాయ్