బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. అయితే ఈ 10 మందిలో ఒకరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాధించుకునే అవకాశాన్ని అందించారు బిగ్ బాస్. దానికోసం ముందుగా టాప్ 10 స్థానాల్లో ఎవరు నిలుస్తారు అనే విషయాన్ని వారినే డిసైడ్ చేసుకోమన్నారు. అలా డిసైడ్ చేసుకునే ప్రక్రియలో కంటెస్టెంట్స్ మధ్య ఎన్నో వాగ్వాదాలు కూడా జరిగాయి. కొందరికి వారు అర్హులు అనుకున్న స్థానాలు దక్కకపోయినా.. దొరికిన స్థానంతో సర్దుకుపోయారు. అలా స్థానాలను డిసైడ్ చేసుకున్న తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి బయటపెట్టారు బిగ్ బాస్. అలా ఒక టాస్క్ ఆడిన తర్వాత అర్జున్ చేతికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది. కానీ ఇంతటితో ఆట ముగిసిపోలేదని బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు.


అర్జున్ చేతిలోకి ఎవిక్షన్ ఫ్రీ పాస్..
మామూలుగా టాప్ 1 నుంచి 5 స్థానాల దగ్గర నిలబడిన వారి మధ్య ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ జరుగుతుందని కంటెస్టెంట్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ వారికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. టాప్ 1 నుంచి 5 వరకు కాకుండా 6 నుంచి 10 స్థానాల్లో నిలబడిన అర్జున్, అమర్‌దీప్, గౌతమ్, అశ్విని, రతిక మధ్య ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ ఉంటుందని తెలిపారు. ఈ అయిదుగురు కంటెస్టెంట్స్ మధ్య పజిల్ టాస్క్‌ను పెట్టారు. అయితే ఈ పజిల్ టాస్క్‌లో అద్భుతంగా ఆడి, అందరినీ ఓడించిన అర్జున్ చేతికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది. అయితే అందరూ అర్జునే విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇంతలోనే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు.


యావర్‌ను ఎంపిక..
ప్రస్తుతం ఎవిక్షన్ ఫ్రీ పాస్ అర్జున్ చేతిలో ఉంది కాబట్టి టాప్ 1 నుంచి 5 స్థానాల్లో నిలబడిన శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, శోభా శెట్టి, ప్రియాంకలలో ఒకరిని ఎంపిక చేసుకొని ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం జరిగే మరో టాస్కులో పోటీపడాలని తెలిపాడు. ఎంపిక చేసుకునే అవకాశం కూడా అర్జున్‌కే ఇవ్వడంతో తను ఆలోచనలోపడ్డాడు. ఫైనల్‌గా నామినేషన్స్‌లో ఉన్నవారికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి వారితోనే పోటీపడాలని అనుకుంటున్నానని చెప్తూ యావర్‌ను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ ఒకవేళ అర్జున్‌కు, యావర్‌కు జరిగే ఈ పోటీలో ఎవరు ఓడిపోయినా.. వారికి మరోసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడే అవకాశం ఉండదని, పూర్తిగా ఆ టాస్క్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. అయినా కూడా యావర్‌తో పోటీపడడానికి అర్జున్ సిద్ధమయ్యాడు. వీరిద్దరి మధ్య జరిగిన టాస్క్‌కు సంచాలకుడిగా అమర్‌దీప్ వ్యవహరించాడు.


అవకాశం కోల్పోయిన అర్జున్..
ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం జరిగే టాస్క్‌లో అర్జున్, యావర్ ఒక బోర్డ్‌పై నిలబడి ఉండాలి. ఆ బోర్డ్ కదులుతూ ఉంటుంది. అయినా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ.. దానిపై ఉన్న అయిదు పోల్స్‌పై అయిదు బాల్స్‌ను నిలబెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ క్రమంలో బాల్ కింద పడిపోతే.. బోర్డ్‌పై నుంచి దిగి కంటెస్టెంట్సే బాల్‌ను తిరిగి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో అర్జున్‌కంటే యావర్ ముందుగా బాల్స్‌ను బ్యాలెన్స్ చేసి ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను గెలుచుకున్నాడు. ఇందులో ఓడిపోవడంతో అర్జున్ ఇక పూర్తిగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరి ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను కాపాడుకోవడానికి యావర్ ఎవరితో పోటీపడాలో తెలియాలంటే వేచిచూడాల్సిందే.


Also Read: బెదింపులకు భయపడను, దేశం విడిచి వెళ్లను- దీపికా పదుకొణె