Trinayani Today Episode గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలి అనుకున్నవారికి శిక్ష పడాలి అని విక్రాంత్ అంటాడు. ఇక ఎవరు తప్పు చేశారో నేను నిరూపిస్తాను అని నయని అంటుంది. ఇక అఖండ దీపం తెస్తుంది. ముగ్గురిలో ఎవరు అబద్ధం చెప్తే వాళ్లు ప్రాణం పోయే పరిస్థితి వస్తుందని అంటుంది. ముగ్గురు కంగారు పడతారు.


విక్రాంత్: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లి ద్రోహం తలపెట్టాలి అనుకుంటే అది సుమన అయినా సరే జాలి కానీ దయ కానీ ఉండదు.
నయని: మీ ముగ్గురు శివజ్యోతి మీద ప్రమాణం చేసి చెప్పండి గాయత్రీ పాప మాయం అవ్వడం వెనుక ఎవరి హస్తం ఉందో అని.
విశాల్: గాయత్రీ పాపని ఎవరు ఎత్తుకెళ్లారో కూడా చెప్పండి. 
నయని: ఇప్పుడే తేలిపోవాలి.
పెద్దబొట్టమ్మ: అలాగే నయని..
తిలోత్తమ: పెద్దబొట్టమ్మ మంచి జోష్‌లో ఉంది. 
వల్లభ: డమ్మక్కకు ఏం మింగుడు పడటం లేదు.
సుమన: ముగ్గురు దీపం మీద ప్రమాణం చేస్తారు. చేయి అయితే చాపాను కానీ నాకు ఉలూచి కంటే ఎవరూ ఎక్కువ కాదు. నేను గాయత్రీ పాపని మాయం చేసి ఉంటే ఉలూచి తల్లి ఈ రోజే చచ్చిపోవాలి.
పెద్దబొట్టమ్మ: గాయత్రీ జోలికి నేను రాలేదు ప్రమాణం.
డమ్మక్క: విశాలాక్షి తల్లే రక్షించాలి. దుష్టులను శిక్షించాలి ఇంతకంటే నేను ఏం చెప్పలేను.
విక్రాంత్: ముగ్గురు చేతులు చాపి మనస్ఫూర్తిగా ప్రమాణం అయితే చేశారు బ్రో.
తిలోత్తమ: నిజంగా శివజ్యోతికి శక్తి ఉంటే అది నిరూపించుకోవాలి.


ఇంతలో పెద్ద బొట్టమ్మ గొంతు పట్టుకొని విలవిల్లాడిపోతుంది. అందరూ షాక్ అవుతారు. పెద్దబొట్టమ్మ నేలకొరిగి నోటి నుంచి రక్తం వస్తుంది. అందరూ ఏమైంది అంటే సుమన చావబోతుంది అంటుంది. అందరూ పెద్ద బొట్టమ్మను వెళ్లిపోమని అంటారు. 


పెద్దబొట్టమ్మ: సుమన నమ్మక ద్రోహం చేశావ్. పెద్దబొట్టమ్మ పాములా మారుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 


విశాల్: నయని మన ఇంటికి మనకు సంబంధంలేని వాళ్లు కూడా వచ్చి ఇబ్బందులు సృష్టిస్తున్నారు ఏమో అనిపిస్తుంది. 
నయని: పెద్దబొట్టమ్మ గురించేనా మీరు అంటుంది. గాయత్రీని మాయం చేసింది ఎవరో కానీ తనని ఎత్తుకెళ్లాలి అనుకున్నది మాత్రం పెద్దబొట్టమ్మ కాదు బాబుగారు. 
విశాల్: అదేంటి నయని తను కాబట్టే కదా శివజ్యోతి మీద ప్రమాణం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అసలు ఇప్పుడు ఆవిడ ఉందో లేదో కూడా తెలీదు.
నయని: ద్రోహం చేయకపోతే ప్రాణం నిలబడుతుంది. తను ఉలూచి పాప కన్న తల్లి కాబట్టి ఇలా జరిగింది. సరిగ్గా ఇదే విషయంలో మనం అయోమయానికి గురైతే సుమన తెలివితేటలు ఉపయోగించింది. సుమనకు గర్భం రాకముందు నాగయ్య, కృష్ణరాయని చుట్టుకున్నాడు. అంటే లెక్క ప్రకారం నాగయ్య, పెద్దబొట్టమ్మలే ఉలూచి తల్లిదండ్రులుగా భావించాలి. 
విశాల్: కన్నది సుమన కదా 
నయని: అందుకే తెలివిగా సుమన ప్రమాణం చేస్తూ గాయత్రీని ఎత్తుకెళ్లి ఉంటే ఉలూచి తల్లి పోవాలి అని అంది. 
విశాల్: అంటే గాయత్రీ పాపను ఎత్తుకెళ్లింది సుమననా..
నయని: అవును. నా అంచనా ప్రకారం గాయత్రీ పాపను కాపాడటానికి పెద్దబొట్టమ్మ సుమనను అడ్డుకుంది. అందుకే సుమన తెలివిగా ప్రామిస్ చేసింది. 
విశాల్: మా అమ్మ పేరు పెట్టుకున్న ఈ చిట్టి తల్లికి ఏం కాదు అన్న నమ్మకం నాకు ఎప్పుడూ ఉంటుంది.


విక్రాంత్ సుమనను తిడతాడు. అంతా నువ్వే చేశావని నాకు అనుమానంగా ఉందని అంటాడు. గాయత్రీ పాపను ఎత్తుకెళ్లి ఏం చేద్దామని అనుకున్నావ్ అని సుమనను ప్రశ్నిస్తుంది. సుమన పెద్దబొట్టమ్మ చేసింది అని ప్లేట్ తిరగేస్తుంది. పెద్దబొట్టమ్మకు ఆ అవసరం లేదు అని గాయత్రీ పాపకు కోట్ల ఆస్తి ఉంది కాబట్టే అసూయతో ఇలా చేశావు అని తిడతాడు. సుమన రివర్స్ అయిపోతుంది. పెద్దబొట్టమ్మ అలా చేసింది అంటే ఎవరూ నమ్మరు అని అంటాడు. గాయత్రీకి అన్యాయం చేయాలి అని చూస్తే ఏం చేస్తానో తెలీదని వార్నింగ్ ఇస్తాడు. 


ఉదయం అందరూ హాల్‌లో ఉంటారు. గాయత్రీ పాప కిడ్నాప్ వెనుక పెద్ద కుట్ర ఉంది అని విక్రాంత్ అంటాడు. ఆ విషయాన్ని వదిలేయ్ మని విశాల్ అంటాడు. ఇంట్లో మిగతా అందరూ ఈ విషయాన్ని వదిలేయొద్దు అంటారు. ఇక సుమన ఇదంతా పెద్దబొట్టమ్మ పని అంటుంది. ఇక హాసిని పెద్దబొట్టమ్మ చేసుంటే పాములు వల్ల సీసీ కెమెరాలు ఆపడం కాదు అంటుంది. ఇంతలో విశాలాక్షి బుట్ట పట్టుకొని ఎంట్రీ ఇస్తుంది. సుమన విశాలాక్షి మీద సెటైర్లు వేస్తుంది. నయని తిడుతుంది. ఇక దురంధర నిన్న ఏం జరిగిందో చెప్తావా అని విశాలాక్షిని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: టిల్లు స్క్వేర్‌ ఫస్ట్ రివ్యూ: టిల్లు స్క్వేర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - 'మ్యాడ్'కు తాత, బ్లాక్ బస్టరే!