Prema Entha Madhuram Serial Today Episode: సెక్యూరిటీ చేంజ్‌ చేయడం, చెఫ్‌ను మార్చడం కాదు. ఇంకా ఏదో చేయాలని అజయ్‌ మీరా మాట్లాడుకుంటుంటారు.  ఇంతలో ఆనంది వస్తుంది. స్కూల్‌ కు వెళ్లలేదా అంటూ ఆనందిని  అజయ్‌, మీరా అడుగుతారు. హోంవర్క్‌ చేయలేదని అందుకే స్కూల్‌కు వెళ్లలేదని ఆనంది చెప్తుంది. ఎందుకు హోంవర్క్‌ చేయలేదని అడగ్గానే ఈ రూంలో నాకు కంపర్ట్‌ గా లేదని అందుకే హోంవర్క్‌ చేయలేదని ఆనంది చెప్తుంది. దీంతో అజయ్‌ ఈ ఇంట్లో కంపర్ట్‌ గా ఉండే రూం ఏదని అడుగుతాడు. ఆర్య వాళ్ల రూం అని మీరా చెప్తుంది. అయితే మనం అందులోకి షిప్ట్‌ అవుదాం అంటాడు అజయ్‌. దీంతో మీ అమ్మ ఒప్పుకుంటుందా? అని మీరా అడుగుతుంది. ఒప్పుకునేటట్టు చేదాం అంటాడు అజయ్‌. ఇంతలో చెఫ్‌ జ్యూస్‌ తీసుకుని వస్తాడు. చెఫ్‌కు ఆర్యను రూం వెకేట్‌ చేయమని చెప్పి వాళ్లు వెకేట్‌ చేశాక ఈ రూంలో లగేజీ ఆ రూంలోకి షిప్ట్‌ చేయమని చెప్తారు.  మరోవైపు ఆర్య వర్కులో ఉంటే  అను రూంలోకి వస్తుంది.


ఆర్య: ఎక్కడికి వెళ్లావు అను.


అను: అత్తమ్మకు ఎవరో దాంపత్య వ్రతం చేసుకున్న కుంకుమ ఇచ్చారట. ఇందాకే పిలిచి నాకు  ఇచ్చారు. నేను కొంచెం పెట్టుకుని మాన్షి మేడంకు కూడా ఇచ్చేసి వస్తున్నా.. అయ్యోయ్యో మీకు కొంచెం పెట్టమన్నారు నేను మర్చిపోయి ఇచ్చేసి వస్తున్నాను.


ఆర్య:  నీ బ్రెయిన్ అంత షార్ప్‌ గా ఉంది మరి. నువ్వు ఈ మధ్య అన్ని మర్చిపోతున్నావు. ఆఖరికి నేను కాఫీ అడిగింది కూడా మర్చిపోయావు.  


అని ఆర్య అంటుండగానే అను తన నుదిటి కుంకుమను ఆర్యకు పెడుతుంది. దీంతో ఇద్దరూ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటుంటే ఇంతలో చెఫ్‌ వచ్చి అజయ్‌ సార్‌ ఫ్యామిలీకి ఈ రూంకి షిఫ్ట్‌ అవుతారంటా అంటూ చెప్పగానే నీరజ్‌ వచ్చి చెఫ్‌ను కాలర్‌ పట్టుకుంటాడు. దీంతో ఆర్య వద్దని వారిస్తాడు. నీరజ్‌ కోపంగా అరుస్తూ కిందకు వెళ్తాడు.


శారద: నీరజ్‌ ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు.


నీరజ్‌: ఆ మాట నన్ను అడగడం కాదమ్మా ఏమీ తెలియనట్టు అక్కడ కూర్చున్నారు కదా వాళ్లను అడుగు. మీరా యువర్‌ క్రాసింగ్‌ యువర్‌ లిమిట్స్‌.


అజయ్‌: నీరజ్‌ బిహేవ్‌ యువర్‌ సెల్ఫ్‌.. మీరా కాదు వదిన


నీరజ్‌: అలా పిలిపించుకునే అర్హత తనకు లేదని ఇదివరకే చెప్పాను.


శారద: అసలేం జరిగింది నీరజ్‌ ఏంటి ఈ గొడవ


నీరజ్‌: అసలేం జరిగింది తెలుసా? అమ్మా దాదా గదిలోకి వీళ్లు సిఫ్ట్‌ అవుతారంటా సర్వెంట్‌తో దాదాను వెకేట్‌ చేయమని చెప్పారు.


శారద: ఏంటి అజయ్‌ నీరజ్‌ చెప్పేది నిజమేనా?


అనగానే అజయ్‌ అవునని మాకు ఆ గదే కంపర్టుగా ఉంటుంది. అందుకే మేము షిఫ్ట్‌ అవ్వాలనుకుంటున్నాము అంటాడు. మీరా కూడా మేము ఇంటి ఓనర్స్‌ కదా అంటూ మేము అక్కడే ఉండటం మంచిదేమో అంటుంది. దీంతో నీరజ్‌ మీరాను ఇంట్లోంచి గెంటివేస్తాననడంతో శారదాదేవి అపుతుంది. అజయ్‌ మీరు కూడా అడ్జస్ట్‌ చేసుకోవాలి అనగానే అజయ్‌ ఆనందిని పిలవగానే ఆనంది వచ్చి పెద్దనాన్న నాకు మీ రూం కావాలి అని అడుగుతుంది. దీంతో ఆర్య సరేనని రూం ఇచ్చేస్తానని రూం కీ తీసుకొచ్చి అజయ్‌కి ముష్టి వేసినట్టు వేస్తాడు.


నీరజ్‌: ఇప్పటికైనా అర్థం అయ్యిందా అజయ్‌ ఇచ్చే చేయి ఎప్పుడూ పైనే ఉంటుంది. తీసుకునే చెయ్యి ఎప్పుడూ కిందనే ఉంటుంది.


అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు స్కూల్‌లో పిల్లలు గణేష్‌ మట్టి విగ్రహాలు చేస్తుంటారు. అకి చేసిన విగ్రహం చాలా అందంగా ఉంటుంది. పిల్లలందరూ అకిని మెచ్చుకుంటారు. అకి, అభయ్‌ని తీసుకురావడానికి వెళ్లగానే ఆనంది  ఆ విగ్రహంపై వాటర్‌ పోస్తుంది. ఇంతలో వచ్చిన అకి పాడైపోయిన విగ్రహాన్ని చూసి ఏడుస్తుంది. పక్కనే ఉన్న ఒక స్టూడెంట్‌ ఆనంది వాటర్‌ పోసిందని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మంచులో సితారతో గౌతమ్‌ ఆటలు - ఆ స్టైల్‌ చూశారా, అచ్చం తండ్రిలాగే!