Trinayani Serial Today Episode గాయత్రీ పాప హాల్‌లో నీరుపోసి ఉంటుంది. ఇక డమ్మక్క గాయత్రీ పాప తిలోత్తమను దెబ్బకొట్టడానికే ఇలా చేసింది అని సాయం చేయాలి అని తిలోత్తమ గదికి వెళ్తుంది. అక్కడ తిలోత్తమ గాయత్రీ దేవి చీర కప్పుకొని పడుకొని ఉంటుంది. దీంతో తిలోత్తమ ముఖం మీద డమ్మక్క ఆ చీరను పూర్తిగా కప్పేస్తుంది. మరోవైపు గాయత్రీ పాప కరెంట్ వైరులను తీస్తుంటుంది. అప్పుడు అక్కడికి సుమన వస్తుంది.
సుమన: ఏయ్ ఏం చేస్తున్నావ్ ఇక్కడ. దత్త పుత్రికలా వచ్చి మొత్తం దోచుకుంటున్నావ్. మీ తాత కోసమేనా.. అంటూ గాయత్రీ పాప దగ్గర వైరు తీసుకుంటుంది. వైరుతో ఆటలా.. దేనితో ఆడుకోవాలో కూడా తెలీదా నీకు పిచ్చి పిల్లలా ఇళ్లంతా తిరుగుతూ ఉంటావ్.. వెళ్లు..
ఇక సుమన వెళ్లిపోయిన తర్వాత ఆ వైపును ఫ్లగ్‌లో పెట్టి తిలోత్తమ మీద ఉన్న చీర నీటి దగ్గరకు వెళ్లేలా డమ్మక్క చేస్తుది. ఇక తిలోత్తమ లేచి చీరని ఎవరో తీసుకెళ్తున్నారు అనుకొని వెనక వెళ్తుంది. మరోవైపు వల్లభ ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడికి వస్తాడు. ఇక ఆ చీర నీటిలో ఉన్న వైరు మీదకు వచ్చి పడుతుంది. ఇక వల్లభ, తిలోత్తమలు ఇద్దరూ అక్కడికి వస్తారు. కానీ ఇద్దరికీ చెవులు పనిచేయకపోవడం వల్ల ఒకరి మాటలు ఒకరికి అర్థం కావు. ఇక హాసిని, దురంధర కూడా అక్కడికి వస్తారు. ఇక గాయత్రీ దేవి చీర నీటిలో పడేశావు అని తిలోత్తమను అంటూ దురంధర చీర తీయడానికి వెళ్తుంది. దీంతో దురంధరకు కరెంట్ షాక్ కడుతుంది. ఇంట్లో అందరూ అక్కడికి చేరుకొని కంగారు పడతారు. ఇక పావనామూర్తి షూని దురంధరతో పట్టించి ప్రమాదం నుంచి తప్పిస్తారు.
తిలోత్తమ: ఆ చీర వల్లే షాక్ కొట్టింది మళ్లీ దాన్ని ఎందుకు తీసుకొచ్చావు. దురంధర: నా ప్రాణం పోకముందు గాయత్రీ అక్కయ్య చీర కాపాడాలి అనుకున్నారు.పావనా: బుర్ర తక్కువ దానా కొంచెం ఉంటే చచ్చేదానివే.సుమన: ఈ వైరు ఈ వైరు తెచ్చింది ఎవరో కాదు గాయత్రీనే.. నయని: నువ్వు ఆపుతావా సుమన అత్తయ్య వాళ్లకి వినిపించలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే చిన్న పాపని ద్వేషించేవాళ్లు. హాసిని: ఇప్పటికే పాప మీద చాలా కోపం ఉంది వీళ్లకి ఇప్పుడు ఆ వైరు తెచ్చింది తనే అని చెప్తే ఏమైనా ఉందా..సుమన: ఈవైరు ఇందాక గాయత్రీ చేతిలో చూశాను.విశాల్: సుమన నువ్వు ఇలా చెప్పడం కరెక్ట్‌కాదు. అమ్మా వాళ్లకి అర్థమైతే గాయత్రీనే ఇలా చేసింది అని అనుకుంటారు. దురంధర: ఏం నయని నేను ఇలా చనిపోతాను అని నీకు ముందే తెలియాలి కదా ఎందుకు చెప్పలేదు.నయని: ప్రాణం పోయే అంత ప్రమాదం జరగలేదు కదా పిన్ని.. విక్రాంత్: కింద పవర్ ఆపేశా.. ఈ వైరు తీసేస్తా.. పెద్దమ్మ చీర డ్రైక్లీనింగ్‌కు ఇవ్వండి. సుమన: అలా ఎవరు చేశారో కనుక్కోరా..విశాల్: వదినా సుమనను తీసుకెళ్లండి. తిలోత్తమ: గాయత్రీ అక్కయ్య చీర వల్లే ఇలా జరిగుండొచ్చు అందుకే నేను ఇక్కడే ఆగిపోయాను.
విక్రాంత్: సుమనను లాక్కొచ్చి గదిలో పడేసి.. నువ్వే పని చేయవే నీ మాటలతోనే మంట పుట్టిస్తావు. నోరు జారి ఒకరికొకరు విడిపోయేలా చేస్తావు. సుమన: మీ అన్నాదమ్ములే చొక్కాలు పట్టుకొని విడిపోరని నాకు తెలుసు.విక్రాంత్: నోరు ముయ్ ఇంక.. చిన్న పిల్ల గాయత్రీ గురించి నువ్వు అలా మాట్లాడితే నాకే ఒళ్లు మండిపోతుంది వాళ్లకి ఎలా ఉంటుంది.సుమన: కన్నవాళ్లు కాదు కదా ఇంకెందుకు ఆ ప్రేమ ఉంది అనుకోవడం కూడా భ్రమే.విక్రాంత్: పళ్లు రాలతాయ్ జాగ్రత్త.సుమన: చేయి చేసుకుంటే నేను గట్టిగా ఏడ్చేస్తా చెప్తున్నా.. విక్రాంత్: నిన్ను ఏం చేసినా పాపం లేదు.సుమన: మీరు గింజుకోకుండా కాస్త నేను చెప్పేది వింటారా. ఆ గాయత్రీ పాపని ఎవరు కన్నారో ఏంటో ఆ విషయం కాస్త పక్కన పెట్టండి. మిమల్ని కన్నది ఎవరు తిలోత్తమ అత్తయ్య ఆవిడ ప్రాణాలు తీయబోయింది ఆ అనాథ పిల్ల. విక్రాంత్: నోర్‌ముయ్.. పిచ్చి మాటలు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు.సుమన: అబ్బా మీకు తెలీదు నేను చెప్తే వినరు కదా. ఉలూచికి పాలు పడదామని పిలుస్తూ వెళ్తుంటే గాయత్రీ పాప వైరు వెనక్కి దాచుకొని నా కళ్లలో పడింది. విక్రాంత్: ఏడాదిన్నర వయసున్న చంటి పిల్లే తను. మా అమ్మ గదిలో పడుకొని ఉంటే హాల్‌లోకి తీసుకొచ్చి కరెంట్ షాక్ వచ్చేలా చేస్తుందా. సుమన: గాయత్రీ అత్తయ్య చీర కోసం తిలోత్తమ అత్తయ్య వస్తే హత్య చేయాలి అనుకుంది ఆ పిల్ల. ఇది నిజం. మీరేమైనా అనుకోండి అత్తయ్య ప్రాణాలు తీయడానికి ఆ పిల్ల ఉంది.విక్రాంత్: నువ్వేమైనా అనుకో ఆ పిల్ల కాదు కని పెద్దమ్మ అయింటే మా అమ్మ ప్రాణాలు ఎప్పుడో తీసేసేది.సుమన: ఏమన్నారు. పెద్దత్తయ్య చిన్న అత్తయ్యను చంపేస్తుందా ఎందుకు చెప్పండి బుల్లిబావగారు. విక్రాంత్: ఏం లేదు వదిలేయ్..సుమన: ఆ మాట అన్నారు ఏంటి ఈయన. ఏంటి వాళ్లిద్దరి మధ్య ఉండే శత్రుత్వం.
విశాల్: గాయత్రీ పాపని తమ గదికి తీసుకొస్తూ.. నీకు నిద్ర రాకపోతే బొమ్మలతో ఆడుకోవాలి కానీ ఇలా తిలోత్తమ అమ్మ ప్రాణాలతో ఆడుకోవడం ఏంటమ్మ. సుమన ఏమందో విన్నావు కదా.. అని విశాల్ అంటే గాయత్రీ పాప కారు విసిరి సౌండ్ చేస్తుంది ఆ శబ్ధానికి విశాల్ చూస్తే ఎదురుగా నయని ఉంటుంది. నయని ఇక్కడే ఉన్నావా నేను నిన్ను చూడలేదు.నయని: నేను మిమల్ని చూడటమే కాదు మీ మాటలు విన్నాను బాబు. విశాల్: దేవుడా నయని వినేసిందా.. అది కాదు నయని ఎలా ఉండాలో గాయత్రీకి చెప్తున్నా..నయని: తను బాగానే ఉంటుంది. మీ మీదే నాకు అనుమానం. విశాల్: డౌటా ఏంటి మేడమ్ ఎన్నడూ లేనిది మీ ఆయనతో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. నయని: నేను అంటుంది మీ మీద కాదు. మీరు ఆడిన మాటల మీద అనుమానం. గాయత్రీ పాపతో ఏమన్నారు. అందరికి అనుమానం వచ్చేలా గాయత్రీ పాపతో ఎందుకు తిలోత్తమతో ఆడుకుంటున్నావు అన్నారు కదా..విశాల్: అన్నాను.నయని: ఎవరికి ఏం అనుమానం వస్తుంది అని.విశాల్: నీకు ఏం అనుమానం వచ్చింది. నయని: ఎవరి మీద..విశాల్: నువ్వు ఎవరి మీద ఎవరికి అనుమానం అంటున్నావ్.నయని: కన్ఫ్యూజ్ చేయకండి. కరెక్ట్‌గా చెప్పండి. విశాల్: మేడం నేను క్లారిటీగా ఉన్నాను. నయని: సూటిగా అడుగుతున్నాను. గాయత్రీ పాప మీద ఎవరికి అనుమానం వస్తుంది. విశాల్: అదే మీ చెల్లి ఏమంది. తిలోత్తమ అమ్మను ఈ గాయత్రీ చంపాలి అనుకుందా ఎంత మాట అది.నయని: అత్తయ్యను చంపేది ఈ పాప కాదు. విశాల్: అంటే చంపేస్తారా.. ఏమన్నావు నయని.. తిలోత్తమ అమ్మను చంపేస్తారా..నయని: ఏదో పొరపాటున అన్నాను పాపకి పాలు తీసుకొస్తాను బాబుగారు. మరోవైపు ఉదయం ఇంట్లో అందరూ లలితా దేవి వస్తుందని ఇంటిని శుభ్రంగా చేసేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ప్రభాస్: ప్రభాసే నంబర్ వన్ - ట్విట్టర్ టాప్ హ్యాష్ ట్యాగ్స్‌లో ఏకైక హీరోగా రెబల్ స్టార్!