Trinayani Today Episode తిలోత్తమ ఇంటికి వచ్చి తనలో తాను మాట్లాడుకుంటుంది. గాయత్రీ అక్క రేపు నీ వర్ధంతి ఎందుకు జరిపించబోతున్నానో ఎవరికీ తెలీదు అని అనుకుంటూ నవ్వుకుంటుంది. తర్వాత తిలోత్తమ పడుకోగానే ఇంట్లో కరెంట్ ఆగిపోయి పెద్ద గాలి వీస్తూ తిలోత్తమ పక్కనే గాయత్రీ దేవి పడుకుంటుంది.
గాయత్రీదేవి: నిద్రలోకి జారుకున్నావా తిలోత్తమ. నీకు నిద్ర లేకుండా చేయాలి అనుకున్నాను. కానీ నువ్వు నీ దుర్మార్గమైన ఆలోచనలతో అలసిపోయి నిద్రలోకి జారుకున్నావు అవునా.
తిలోత్తమ: మాటలు వినిపించగానే తిలోత్తమ హడావుడిగా నిద్ర లేచి కంగారు పడుతుంది. ఎవరు అనుకొని మాటలు గుర్తు చేసుకుంటుంది. గాయత్రీ అక్క.. తనే మాట్లాడింది గొంతు అదే. ఇక్కడికి వచ్చిందా అని కిందకి పరుగులు తీస్తుంది. హాల్‌లో ఫొటో ఊగుతూ గాయత్రీ పాప నిల్చొని ఉంటుంది. ఇక తిలోత్తమ కిందకి రాగానే ఆ ఫొటో కిందకి వచ్చి తన వెంట వస్తుంది. తిలోత్తమ బిత్తరపోతుంది. గాయత్రీ అక్క గాయత్రీ అక్క అని పెద్దగా అరుస్తూ సోపాలో పడుకుంటుంది. అందరూ వస్తారు. ఎవరు ఎంత పిలిచినా వినదు. ఇంతలో నయని గట్టిగా తట్టి లేపుతుంది.
విశాల్: ఏమైంది అమ్మ ఎందుకు అలా అరిచావ్.
వల్లభ: భయం వేసిందా మమ్మీ.
తిలోత్తమ: అవును.
సుమన: మీరు భయపడటం ఏంటి అత్తయ్య.
నయని: అత్తయ్య ఎందుకు భయపడ్డారు. ఏం చూశారు.
తిలోత్తమ: ఫొటో. గాయత్రీ అక్క ఫొటో. ఫొటోని చూసి కాదు అక్క ఫొటో అదిగో అక్కడి నుంచి నా వైపు వచ్చింది. నా వైపు వచ్చింది. దానికదే వచ్చింది.
విశాల్: ఫొటో అక్కడే ఉంది కదా.
తిలోత్తమ: అదేంటి అక్కడ ఎందుకు ఉంది. ఇంతలో గాయత్రీ పాప వస్తుంది.
నయని: పాప గదిలో ఉండాలి కదా.
విశాల్: నయని నువ్వు చూడలేదా గదిలో ఉండాలి కదా అమ్మ అరుపులకు లేచి వచ్చేసింది.
హాసిని: రేపు పొద్దున్నే గాయత్రీ అత్తయ్య వర్థంతి వేడుక జరిపించాలి అని చెప్పింది కదా. అందుకే అదే కలలోకి వచ్చి ఉంటుంది.
నయని: చేయకూడదు అన్న గాయత్రీ అమ్మగారి వర్ధంతి జరిపించాలి అని మీరు పట్టపట్టడం మీలో కలతకు కారణం అయింటుంది. ఒక్కసారి ఆలోచించండి.
విశాల్: అవునమ్మ పునర్జన్మ ఎత్తిన అమ్మకు వర్థంతి వద్దు మంచిది కాదు అనిపిస్తుంది.
తిలోత్తమ: విశాల్ ఈ జన్మలో గాయత్రీ అక్కకి వేరే రూపం వచ్చి ఉంటుంది కదా. మరి గత జన్మలో రూపానికి వర్ధంతి చేయాలి కదా.
నయని: అమ్మగారు గత జన్మలో ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంటుంది. విశాల్ బాబు గారు తన తల్లిని చూడాలి అన్న ఆకాంక్షే అలాగే పుట్టేలా చేసింది.
పావనా: చిన్నప్పుడు గాయత్రీ దేవి అక్క ఫొటో చేస్తూ తెలిసిపోతుంది కదా.
విశాల్: షాక్ అయి మామయ్య నువ్వు కొత్త పనులు చెప్పకు.
నయని: అవును కదా బాబాయ్ చెప్పింది నిజమే కదా. బాబు గారు ఎందుకు నాకు అమ్మగారి చిన్నప్పటి ఫొటోలు చూపించడం లేదు.
హాసిని: ఫొటో చూసి భయపడిని తిలోత్తమ అత్తయ్య రేపు పెద్దత్తయ్య ఆత్మ చూస్తే తట్టుకోగలదా.
నయని: బాబుగారు నేను ఓ విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి. ఆత్మలా అమ్మగారు కనిపిస్తారు అంటే మనం రెండు విషయాలు గుర్తు చేసుకోవాలి. ఒకటి తను ఇక్కడే ఎక్కడో దగ్గర్లో పునర్జన్మలో పుట్టి ఉండాలి. రెండు ఆ బిడ్డ మనకు శాశ్వతంగా దూరం అయినా అయిండాలి.
విశాల్: నయని ఏంటి ఆ మాటలు. నీ నుంచి ఇలాంటి మాట వస్తుందని అనుకోలేదు.
నయని: ఏడాదిన్నర తర్వాత మళ్లీ అమ్మగారు ఆత్మలా కనిపించారు అంటే ఈ రెండు కారణాలే ఉంటాయి.
విశాల్: నయని అలా అయితే రెండోది అస్సలు ఆలోచించకు. అమ్మ బతికే ఉంది.
నయని: మీరు ఎంత చెప్పినా నాకు నమ్మకం, ధైర్యం ఇవ్వడానికి అంతే. కానీ రెండింటిలో ఒకటి మాత్రం నిజం.
విశాల్: నువ్వు ఇలా మాట్లాడితే మాకు బాధగా ఉంది నయని. ఇంకోసారి అమ్మ ఆత్మ కనిపిస్తే తనకే అడుగు.
నయని: ఆ పనే చేస్తాను. నా కడుపుకోతకి నేను మందు రాసుకుంటూ ఎంత కాలం ఇలా ఉండగలను.
ఉదయం నయని, హాసినిలు గాయత్రీదేవి ఫొటో పెట్టి దాని చుట్టూ దీపాలు పెడతారు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. తిలోత్తమ వచ్చి ఫొటోలో కాదు నేరుగా గాయత్రీ అక్కని చూడాలి అనుకుంటున్నాను అని అంటుంది. అందుకోసం తన వెంట ఓ పూల దండ, పిండం ముద్దలు తీసుకొని వస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. విశాల్ తిలోత్తమ, వల్లభలను తిడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.